Mega 157: చిరంజీవి (Chiranjeevi) అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబోలో వస్తున్న ‘మెగా 157’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అనిల్ రావిపూడి తన సినిమాలకు వెరైటీగా ప్రమోషన్స్ చేస్తూ సినిమాని ఓ రేంజ్ కి తీసుకువెళ్తారు. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం(Sankrantiki Vasthunnam) సినిమా టైమ్ లో ఎలాంటి ప్రమోషన్స్ చేశారో చెప్పనక్కర్లేదు. అలా తాజాగా మెగా 157 మూవీకి కూడా డైరెక్టర్ చేసే పనులు ప్రమోషన్స్ గా మారుతున్నాయి. అయితే తాజాగా డ్రామా జూనియర్స్ (Drama Juniors)లో పార్టిసిపేట్ చేసే ‘ఇరియా’ అనే చిన్నారి.. ఈ షో కి జడ్జిగా వ్యవహరిస్తున్న డైరెక్టర్ అనిల్ రావిపూడిని మామా అంటూ ప్రేమగా పిలుస్తుంది. ఇక డైరెక్టర్ కూడా కోడలా అంటూ పిలుస్తారు. అంతేకాదు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్ రావిపూడి కూడా ఇరియా దేవుడిచ్చిన కోడలు అంటూ చెప్పిన విషయం తెలిసిందే.
చిరు సినిమాలో ఛాన్స్ కొట్టేసిన డ్రామా జూనియర్స్ ఇరియా..
అయితే తాజాగా డ్రామా జూనియర్స్ ఇరియా ఏకంగా చిరంజీవి సినిమాలోనే అవకాశం పట్టేసింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక విషయంలోకి వెళ్తే.. అనిల్ రావిపూడి,రోజా(Roja)లు జడ్జిలుగా చేస్తున్న డ్రామా జూనియర్స్ షోలో సుధీర్ హోస్ట్ గా చేస్తున్నారు. అయితే ఈ షోలో ఇరియా స్టేజ్ మీదకి వచ్చి తాను అనిల్ రావిపూడి సినిమాలో హీరో అని చెబుతుంది. ఇన్ని రోజులుగా మీరు నన్ను చూస్తున్నారు.కానీ మెగాస్టార్ సినిమాలో నాకు అవకాశం ఇవ్వలేదు దగా మోసం అంటూ సుధీర్ (Sudheer) అంటారు.
తన టాలెంట్ తో ఎలా అవకాశం కొట్టేసిందంటే?
దానికి అనిల్ రావిపూడి ఇరియాకు అవకాశం ఎలా ఇవ్వాల్సి వచ్చిందో ఒకసారి ఆ వీడియో చూడు అని స్క్రీన్ మీద వీడియో వేస్తారు. ఆ వీడియోలో చిరంజీవి పాటల మీద స్టెప్పులు వేస్తూ స్కూల్ కి వెళ్ళమంటే నేను చిరు మామతో సినిమా చేస్తా అంటూ ఇరియా(Iriya) చెబుతుంది.ఆ తర్వాత మెగా 157 సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది అని టీవీలో చూపించగానే చాలా కోపంతో ఇరియా షూటింగ్ లోకేషన్ కి కత్తి పట్టుకుని వెళుతుంది. అలా వెళ్తూ ఇరియా పేల్చే డైలాగులు అన్ని ఇన్నీ కావు. కత్తి పట్టుకొని రప్పా రప్పా అనిల్ మామని ఆడిస్తా.కత్తితో కాదు కంటిచూపుతో ఆడిస్తా అంటూ లోపలికి వెళుతుంది. ఆ తర్వాత వాచ్ మెన్ ని బోల్తా కొట్టించి లొకేషన్ లోకి ఎంట్రీ ఇస్తుంది.
సెట్లో డైరెక్టర్ నే దడదడ లాడించిన ఇరియా..
ఇక నయనతార (Nayanthara) ఎంట్రీ సీన్ అంటూ డైరెక్టర్ ఎదురు చూస్తూ ఉంటే అందులోకి సడన్గా ఇరియా రావడంతో అనిల్ షాక్ అవుతారు. ఆ తర్వాత నాకు చిరు మామ సినిమాలో రోల్ కావాలి అంటే నో నేను ఇవ్వనని అంటారు. ఇక అనిల్ రావిపూడి రైటర్లను, ఆర్ట్ డైరెక్టర్ లని పరిచయం చేస్తే వాళ్లపై పంచులు వేస్తూ రైటర్లు రాస్తారంటే నాకు జండుబామ్ రాయచ్చుగా.. ఆర్ట్ డైరెక్టర్ పెద్దపెద్ద సెట్లు వేశాడని అనిల్ రావిపూడి చెబితే.. మా నానమ్మ పళ్ళు పోయాయి. ఓ పళ్ల సెట్టు వేయించండని, సినిమాటోగ్రాఫర్ ని మా తమ్ముడు బర్త్డేకి వీడియో తీయమని,ఒక కేకు ముక్క మిక్చర్ పొట్లం చేతిలో పెడతాను అంటూ పంచులు వేస్తుంది.
ఏకంగా మెగాస్టార్ తోనే రికమండేషన్..
ఇక బుడ్డదాని గోల భరించలేక నేను నీకు అవకాశం ఇవ్వను అంటాడు. ఆ తర్వాత చిరంజీవి, నయనతార క్యారవాన్ లు చూసి మరి నా క్యారవాన్ ఎక్కడ అని అంటే నీకు స్కూల్ బస్సు ఉంది.. ఇంటికి వెళ్లి చదువుకో పో అని అనిల్ రావిపూడి సమాధానం ఇస్తారు. అంతేకాదు బుడ్డదాని ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక విసిగిపోయి ఇక్కడ నుండి వెళ్ళిపో అంటే ఏం చేస్తానో చూడు అంటూ చిరంజీవి క్యారెక్టర్వాన్ లోకి వెళుతుంది. ఆ తర్వాత బయటకు వచ్చి డైరెక్టర్ ని మార్చమని, చిరు మామకు చెప్పానంటూ ఇరియా చెప్పడంతో ఆ పని చేయకే బాబోయ్ అంటూ తీసుకువెళ్లి నీకు సార్ పక్కన ఒక క్యారెక్టర్ ఇస్తున్నాను అని చెబుతారు.ఇక దీనికి సంబంధించిన వీడియో స్క్రీన్ మీద చూపించడంతోనే బుడ్డదాని టాలెంట్ చూసి అందరూ మెచ్చుకుంటారు.
వీడియో వైరల్.. పాప టాలెంట్ కి ఆడియన్స్ ఫిదా..
ఇక అనిల్ రావిపూడి ఈ వీడియో గురించి మాట్లాడుతూ డ్రామా జూనియర్స్ పాపని సినిమా షూటింగ్లో చూపించడానికి, అలాగే పాపని సినిమాలో తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినందుకు చిరంజీవి గారికి,ప్రొడ్యూసర్ గారికి థాంక్స్ చెబుతారు. అలాగే ఈ వీడియో చూసిన సుధీర్ ఇప్పటి నుండి అనిల్ రావిపూడి సినిమాలో అవకాశం రావాలంటే అందరూ ఇలాగే చేస్తారు అంటూ మాట్లాడుతారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొట్టడంతో ఇరియా పాప టాలెంట్ కి చాలామంది ఫిదా అవుతున్నారు.
ALSO READ:B.Saroja Devi: పద్మభూషణ్ గ్రహీత సరోజా దేవి నటించిన తెలుగు చిత్రాలివే!