BigTV English

Hrithik Roshan:  గర్ల్ ఫ్రెండ్ కోసం ఇంటిని అద్దెకిచ్చిన హృతిక్.. రెంట్ ఎంతో తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే!

Hrithik Roshan:  గర్ల్ ఫ్రెండ్ కోసం ఇంటిని అద్దెకిచ్చిన హృతిక్.. రెంట్ ఎంతో తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే!

Hrithik Roshan: బాలీవుడ్ ఇండస్ట్రీలో నటీనటులుగా కొనసాగుతున్న ఎంతోమంది సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ఆస్తులను కొనుగోలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే . ముఖ్యంగా సెలబ్రిటీలు ఎక్కువగా ముంబైలో పెద్ద ఎత్తున ఖరీదైన బంగ్లాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు ముంబైలో పలు ప్రాంతాలలో వందల కోట్ల విలువ చేసే అపార్ట్మెంటులను కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే హృతిక్ రోషన్(Hrithik Roshan) సైతం ఖరీదైన బంగ్లాలను కొనుగోలు చేశారు. అయితే ఇందులో ఓ బంగ్లాను తన స్నేహితురాలి కోసం ఏడాది పాటు అద్దెకు ఇచ్చారని తెలుస్తోంది.


వందల కోట్ల విలువ…

జుహు-వెర్సోవా లింక్ రోడ్‌లోని మన్నత్ అపార్ట్‌మెంట్స్ లో హృతిక్ రోషన్ 2020వ సంవత్సరంలో 18 ,19 ,20 అంతస్తులలో డూప్లెక్స్ తో పాటు 3BHk అపార్ట్మెంట్లను కొనుగోలు చేశారు. అప్పట్లో ఈ అపార్ట్మెంట్ల కోసం సుమారు 97 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇందులో భాగంగా జుహులోని సముద్రానికి ఎదురుగా ఉన్న తన విలాసవంతమైన  బంగ్లాను తన స్నేహితురాలు సబా గ్రెవాల్(Saba Grewal) కు అద్దెకు ఇచ్చారు. ఏడాది పాటు అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది. అయితే నెలకు ₹ 75,000 అద్దె చెల్లించేలా అగ్రిమెంట్ చేసుకున్నట్టు సమాచారం. నెలకు 75000 అంటే ముంబైలో సర్వసాధారణమని చెప్పాలి.


నెలకు రూ.75,000 అద్దె..

ముఖ్యంగా బాంద్రా, జుహు వంటి ప్రాంతాలలో 3bhk అద్దెకు తీసుకోవాలి అంటే లక్ష నుంచి రెండు లక్షల వరకు అద్దె చెల్లిస్తూ ఉంటారు. ఇలా హృతిక్ రోషన్ తన స్నేహితురాలికి అద్దెకు ఇవ్వడంతో 75000 చాలా తక్కువనే చెప్పాలి. ప్రస్తుతం హృతిక్ రోషన్ కి సంబంధించిన ఈ వార్త ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఇకపోతే హృతిక్ రోషన్ ప్రస్తుతం కెరియర్ పరంగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈయన నటించిన సినిమాలకు బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు సౌత్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి క్రేజ్ ఉందనే చెప్పాలి.

నిరాశ పరిచిన వార్ 2..

ఇటీవల హృతిక్ రోషన్ అయాన్ ముఖర్జీ (Ayan Mukerji)దర్శకత్వంలో తెరకెక్కిన వార్ 2(War 2)  సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ఎన్నో అంచనాలు నడుమ విడుదలైంది. అయితే అనుకున్న విధంగా ప్రేక్షకులు అంచనాలను చేరుకోలేకపోయింది. ఇక ఈ సినిమాలో  హృతిక్ రోషన్ తో పాటు ఎన్టీఆర్ (Ntr)కూడా నటించిన సంగతి తెలిసిందే. ఇలా మొదటిసారి హృతిక్ రోషన్ నటించిన సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడంతో అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు కానీ ప్రేక్షకులను కాస్త నిరాశపరిచింది. యశ్ రాజ్ ఫిలిమ్స్ యూనివర్స్ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

Also Read: Ramgopal Varma: పైరసీలో సినిమా చూస్తానాన్న వర్మ.. మన బ్యాచే అంటున్న నెటిజన్స్!

Related News

Anushka Shetty: అనుష్క లేకుండానే ప్రమోషన్స్… పాపం నిర్మాతే స్వయంగా…

Ramgopal Varma: పైరసీలో సినిమా చూస్తానాన్న వర్మ.. మన బ్యాచే అంటున్న నెటిజన్స్!

Kichcha Sudeep : దయచేసి ఎవరూ రావద్దు.. అభిమానులను వేడుకున్న సుదీప్.. ఏమైందంటే?

Anchor Manjusha: యాంకర్‌ మంజుష హాట్‌ లుక్స్‌.. ఘాటు అందాలతో కుర్రకారును రెచ్చగొడుతున్న తెలుగమ్మాయి..

Sachin Tendulkar: సౌత్ సినిమాపై మనసు పడ్డ క్రికెట్ దిగ్గజం… అంతగా నచ్చిన సినిమా ఏంటబ్బా?

Big Stories

×