Ramgopal Varma: రాంగోపాల్ వర్మ(Ramgopal Varma) పరిచయం అవసరం లేని పేరు. ఒకప్పుడు వర్మ దర్శకత్వంలో సినిమా వస్తుంది అంటే అభిమానులు ఎంతగానో ఈయన సినిమాల కోసం ఎదురు చూసేవారు. అంత అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి దర్శకుడిగా మంచి గుర్తింపు పొందారు. ఇక ఈయన దర్శకత్వ ప్రతిభ తెలిసి ఎంతోమంది ఈయన వద్ద శిష్యరికం నేర్చుకొని నేడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు మంచి క్రేజ్ సొంతం చేసుకున్న వర్మ ఇటీవల కాలంలో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నారు. వర్మ ఏదైనా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసిన లేదా మీడియా సమావేశాలలో మాట్లాడిన పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతుంది.
ఆసక్తి ఉంటేనే థియేటర్లో చూస్తా..
ఇలా నిత్యం వివాదాలలో నిలుస్తున్న వర్మ తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా ఆయన సినిమాల గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా కొనసాగిన వర్మ దాదాపు అన్ని సినిమాలను చూస్తారని అందరూ భావిస్తారు కానీ ఈయన మాత్రం తనకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే సినిమాలను చూస్తానని తెలియజేశారు. తనకు సినిమా చూడాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటే తప్పనిసరిగా థియేటర్లలోనే సినిమా చూస్తా లేదంటే పైరసీలో చూస్తాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
పైరసీలో సినిమా చూస్తాను…
ఇలా ఇండస్ట్రీలో ఒక దర్శకుడిగా కొనసాగుతున్న వర్మ పైరశీలో సినిమా చూస్తానని చెప్పడంతో ఈ వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారాయి. ఇక ఈ వ్యాఖ్యలపై అభిమానులు విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు. ఒక దర్శకుడిగా మీరు ఇలా పైరసీలో సినిమా చూస్తానని చెప్పడం ఏమాత్రం భావ్యంగా లేదు అంటూ కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం అరే వర్మ కూడా మన బ్యాచే అంటూ ఫన్నీగా కామెంట్ లు చేస్తున్నారు. అయితే ఏ విషయాన్ని మనసులో పెట్టుకోకుండా ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తిత్వం వర్మదనే సంగతి తెలిసిందే.
సినిమాల ద్వారా చిక్కుల్లో వర్మ…
ఈ క్రమంలోనే పైరసీలో సినిమాలు చూస్తానని ఈయన నిర్మొహమాటంగా చెప్పడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఇక ఇటీవల కాలంలో ఎంతోమంది దర్శక నిర్మాతలు సినిమాలను పైరసీలో చూస్తున్న నేపథ్యంలో పైరసీకి అడ్డుకట్టు వేయాలని ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు కానీ సినిమా విడుదలైన మొదటి రోజే హెచ్డి ప్రింట్ బయటకు రావడంతో పెద్ద ఎత్తున నిర్మాతలు నష్టపోతున్నారు. ఇలా పైరసీ గురించి ప్రేక్షకులకు అవగాహన కల్పించాల్సిన వర్మ పైరసీలో సినిమా చూస్తానని చెప్పటం గమనార్హం. ఇటీవల కాలంలో వర్మ ఎక్కువగా రాజకీయ నాయకులకు సంబంధించిన బయోపిక్ సినిమాలు చేస్తూ వివాదాలలో నిలుస్తున్నారు. ముఖ్యంగా వ్యూహం సినిమా తర్వాత ఈయన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ సినిమా విషయంలో వర్మపై ఎన్నో కేసులు కూడా నమోదు అయిన విషయం తెలిసిందే.
Also Read: Kichcha Sudeep : దయచేసి ఎవరూ రావద్దు.. అభిమానులను వేడుకున్న సుదీప్.. ఏమైందంటే?