Ntr -Hrithik: బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ (Hrithik Roshan)హీరోగా ఆయాన్ ముఖర్జీ (Ayan Mukerji)దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం వార్ 2(War 2). ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు ఎన్టీఆర్(Ntr) కూడా భాగమైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కు పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ ఏర్పడిన నేపథ్యంలో ఈ సినిమాలో నటించే అవకాశం అందుకున్నారు. ఇది ఎన్టీఆర్ కు మొదటి బాలీవుడ్ సినిమా అని చెప్పాలి. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఈ ప్రమోషన్లలో భాగంగా హృతిక్ రోషన్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా సరదా సంఘర్షణతో ఈ సినిమాకు కావలసినంత ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు.
మాతో యుద్ధం గెలవలేరు..
ఇటీవల ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కు ఒక బిల్ బోర్డ్ పంపిస్తూ మీకు కాళ్లు అలుపు వచ్చేలా డాన్స్ చేసిన మాతో యుద్ధం గెలవలేరు అంటూ ఉన్న ఒక బిల్ బోర్డు పంపించారు. ఎన్టీఆర్ ఇలాంటి ఛాలెంజ్ విసరడంతో హృతిక్ రోషన్ కూడా ఆ చాలెంజ్ స్వీకరించారు. అయితే ఎన్టీఆర్ పంపిన గిఫ్ట్ కు హృతిక్ రోషన్ రిటన్ గిఫ్ట్ పంపించారని తెలుస్తుంది. తాజాగా ఎన్టీఆర్ సైతం తన బాల్కనీలో ఉండగా హృతిక్ రోషన్ ఒక బిల్ బోర్డ్ పంపించారు. ఇందులో నాటు నాటు.. నీకు ఎంత కావాలంటే అంత కానీ ఈ యుద్ధంలో నేను గెలుస్తున్నాను అంటూ రాసి ఉంది. ఇలా ఈ బిల్ బోర్డు పంపించడంతో ఎన్టీఆర్ రియాక్ట్ అవుతూ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.
రిటర్న్ గిఫ్ట్ బాగుంది..
ఈ సందర్భంగా ఎన్టీఆర్ స్పందిస్తూ..” మీరు పంపిన రిటర్న్ గిఫ్ట్ చాలా బాగుంది హృతిక్ సార్. కానీ ఇది ముగింపు కాదు అసలైన యుద్ధం ఆగస్టు 14వ తేదీ మొదలవుతుంది. అప్పుడు కలుద్దాం#8 days to war 2! “అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా వీరిద్దరి మధ్య సరదా సంభాషణ కొనసాగుతున్న నేపథ్యంలో అభిమానులు కూడా స్పందిస్తూ సినిమా ప్రమోషన్ కోసం ఇలా సోషల్ మీడియాలో మీ ఛాలెంజస్ చాలా బాగున్నాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ రాబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో ఆసక్తి చూపుతున్నారు.
Nice return gift @iHrithik sir…But this is not the end! The War begins for real on 14th August. See you then! 😎#8DaysToWar2 pic.twitter.com/3P8kD2rrwy
— Jr NTR (@tarak9999) August 6, 2025
ఇక ఈ సినిమా తెలుగులో కూడా ఎన్నో అంచనాలను నడుమ విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు హక్కులను నాగవంశీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే తెలుగులో కూడా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు కాబోతున్నాయి. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది. ఆగస్టు 10వ తేదీ ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించబోతున్నారని సమాచారం. అయితే ఈ వేడుకను హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో నిర్వహించబోతున్నట్టు వార్తలు వినపడుతున్నాయి.ఇక ఈ వేడుకను శ్రేయస్ మీడియా వారు నిర్వహించబోతున్నారని సమాచారం. దేవర ప్రీ రిలీజ్ వేడుకలు జరిగిన విధంగా కాకుండా.. ముందుగానే తగినన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమా వేడుకను నిర్వహించడానికి శ్రేయస్ మీడియా సిద్ధమవుతుందని తెలుస్తుంది. శిల్పకళ వేదిక అయితే క్లోజ్డ్ ఆడిటోరియం కావడంతో అభిమానులను కంట్రోల్ చేయడానికి , ఎలాంటి తప్పిదాలు జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుందని అందుకే శిల్పకళ వేదికలోనే ఈ కార్యక్రమం జరగబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి అయితే ఈ విషయం గురించి త్వరలోనే అధికారక ప్రకటన కూడా వెలబడనుంది.
Also Read: Prashanth Neel: సలార్ ఎఫెక్ట్.. ఆ హీరోకి క్షమాపణలు చెప్పిన ప్రశాంత్.. కావాలని చెయ్యలేదంటూ!