Nani Paradise : ప్రస్తుతం నాని కొత్త టాలెంట్ ను నమ్మి సినిమాలు చేస్తున్నారు. అలా కొత్త దర్శకుడుని నమ్మడం అనేది మామూలు విషయం కాదు. కానీ స్వతహాగా నాని లో కూడా ఒక దర్శకుడు ఉండటం వలన టాలెంట్ ను పట్టుకోగలుగుతున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలుపెట్టిన నాని, అష్టాచమ్మా (Aata Chemma) సినిమాతో హీరోగా మారిపోయాడు.
ఆ తర్వాత నానికి వరుసగా అవకాశాలు వచ్చాయి. కేవలం మంచి సినిమాలు చేయడం మాత్రమే కాకుండా ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి మంచి సినిమాలును నిర్మించడం మొదలు పెట్టాడు. నాని బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. నాని ఆ సినిమాలను ప్రమోట్ చేసే విధానం కూడా అదే స్థాయిలో ఉంటుంది.
ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో ఫస్ట్ లుక్
నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో పారడైజ్ (Paradise) అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద విపరీతమైన నమ్మకాలు ఉన్నాయి. సినిమా మార్చి 26 2026 లో ప్రేక్షకులు ముందుకు రానుంది. సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ తో వదిలిన వీడియో బీభత్సమైన సంచలనంగా మారింది. ముఖ్యంగా ఆ సినిమా టీజర్ లో ఉన్న కొన్ని పదాలు అభ్యంతరంగా మారాయి. అయినా యూట్యూబ్ కి పెద్దగా ఆంక్షలు లేవు కాబట్టి ఆ వీడియో అలానే ఉంది. అయితే ఈ సినిమా నుంచి నాని ఫస్ట్ లుక్ ఆగస్టు 8న రిలీజ్ చేయబోతున్నట్లు ఆసక్తికరమైన పోస్టర్ తో అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది చిత్ర యూనిట్.
He never had a name, until they gave him one 🐦⬛
Get ready for the reveal from #TheParadise on August 8th at 10:05 AM & 5:05 PM ❤️🔥❤️🔥#THEPARADISE in CINEMAS 𝟐𝟔𝐭𝐡 𝐌𝐀𝐑𝐂𝐇, 𝟐𝟎𝟐𝟔.
Releasing in Telugu, Hindi, Tamil, Kannada, Malayalam, Bengali, English, and Spanish.… pic.twitter.com/HJKIRhXf2v— SLV Cinemas (@SLVCinemasOffl) August 6, 2025
మెగాస్టార్ చిరంజీవితో సినిమా
మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడానికి చాలామంది దర్శకులు రెడీగా ఉంటారు. కానీ ఆ అవకాశం అందరికీ దక్కదు. మొత్తానికి నానితో పారడైజ్ సినిమా అయిపోయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. దీని గురించి అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. సినిమాను నాని ప్రజెంట్ చేస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ తోనే మంచి అంచనాలు క్రియేట్ అయిపోయాయి. ముఖ్యంగా బ్లడ్ తో కలిసిన చేతులతో రిలీజ్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక ప్రస్తుతం వస్తున్న పారడైజ్ సినిమా మీద అందరికీ విపరీతమైన అంచనాలు ఉన్నాయి. టీజర్ తో క్యూరియాసిటీ పెంచాడు శ్రీకాంత్. అలానే ఈ సినిమాలో మోహన్ బాబు (Mohan Babu) ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు అని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: Usthad Bagath Singh: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పైన సమ్మె ఎఫెక్ట్ ఏమైనా పడిందా ? ప్రొడ్యూసర్ రిప్లై…