Prashanth Neel: సౌత్ సినీ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు ప్రశాంత్ నీల్ (Prashanth Neel)పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతల సొంతం చేసుకున్నారు. కే జి ఎఫ్ సినిమాతో సంచలనాలను సృష్టించిన ఈయన ప్రస్తుతం వరుస తెలుగు సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇదివరకే ప్రభాస్(Prabhas) హీరోగా నటించిన సలార్ సినిమా(Salar Movie) ద్వారా మరోసారి తన మార్క్ ఏంటో నిరూపించుకున్నారు. తాజాగా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో మరో పాన్ ఇండియా సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డ్రాగన్ అనే టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు.
షారుఖ్ ఖాన్ కు క్షమాపణలు చెప్పిన ప్రశాంత్…
ఈ వీడియోలో భాగంగా ఈయన బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్(Shahrukh Khan) కు క్షమాపణలు తెలియజేశారు. అసలు బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కు ప్రశాంత్ ఇప్పుడు క్షమాపణలు చెప్పడం ఏంటి అసలు క్షమాపణలు చెప్పడానికి గల కారణాలు ఏంటి అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ప్రశాంత్ షారుక్ ఖాన్ కి క్షమాపణలు చెప్పడానికి కారణం ఏంటనే విషయానికి వస్తే ..షారుక్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ (Raj Kumar Hirani)దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం డుంకీ(Dunki). ఈ సినిమా ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాకు ముందు రోజు విడుదల అయింది.
జ్యోతిష్యం కారణంగానే…
ఇలా ఈ సినిమా విడుదలైన మరుసటిరోజే అనగా డిసెంబర్ 22, 2023వ సంవత్సరంలో సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పట్లో ఈ రెండు సినిమాల మధ్య భారీ స్థాయిలో పోటీ ఏర్పడింది. ప్రభాస్ సినిమా కారణంగా డుంకీ కలెక్షన్ల పై తీవ్రమైన ప్రభావం చూపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయం గురించి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. మేము ఉదేశపూర్వకంగా డుంకీ సినిమాకు పోటీగా సలార్ సినిమాని విడుదల చేయలేదు అసలు మేము డిసెంబర్ 22వ తేదీ మా సినిమాని విడుదల చేయాలనే ఆలోచనలో కూడా లేమని, కానీ జ్యోతిష్యం కారణంగా అదే రోజు విడుదల చేయాల్సి వచ్చిందని తెలియజేశారు.
PrashanthNeel Said Sorry Ra to team DUNKI for Clash pic.twitter.com/YZwEXMFTe3
— PBSena2.o (@Crrrrraaaazzii) November 4, 2024
ఈ విషయంలో షారుఖ్ ఖాన్ గారు అలాగే హిరానీ సర్ నన్ను క్షమించాలి అంటూ ఈ సందర్భంగా ఈయన క్షమాపణలు చెప్పిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే రెండు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన గురించి ప్రశాంత్ ఇప్పుడు క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఇక సలార్ సినిమా కారణంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో డుంకీ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ఇక సలార్ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం అంతకుమించి ఉండబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి అయ్యాయని పలు సందర్భాలలో ప్రశాంత్ నీల్ తెలియజేశారు. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులను ప్రారంభించబోతోంది.
Also Read: Actor Balakrishna:కార్మికుల సమస్యలపై స్పందించిన బాలయ్య… నిర్మాతలకు కీలక సూచనలు!