BigTV English

Brahmamudi Serial Today August 8th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ను తిట్టిన కావ్య – ప్రేమ లేకపోతే ఎందుకొచ్చావన్న రాజ్‌   

Brahmamudi Serial Today August 8th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ను తిట్టిన కావ్య – ప్రేమ లేకపోతే ఎందుకొచ్చావన్న రాజ్‌   

Brahmamudi serial today Episode: రాజ్‌ ఇంట్లోంచి వెళ్లిపోవడానికి కారణం కావ్య.. తప్పులన్నీ కావ్య చేస్తే నువ్వు నన్ను తిడతావేంటి..? అయినా ఇప్పడు అంత పెద్ద తప్పు నేనేం చేశాను అని అడుగుతుంది రుద్రాణి. దీంతో ఇంద్రాదేవి కోపంగా నువ్వు పుట్టడమే పెద్ద తప్పు అంటుంది. కాసేపు నోరు మూసుకుని సైలెంట్‌గా ఉండు. లేదంటే నీ గదిలోకి వెళ్లు నా మనవరాలు కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్లింది అక్కడ ఏదో జరిగింది అని కాదు.. నా మనవడు దొరికాడు అని చెప్పగానే.. అందరూ హ్యాపీగా ఫీలవుతారు. రుద్రాణి, రాహుల్‌ మాత్రం షాక్‌ అవుతారు. ఇంతలో సుభాష్‌ లేచి ఏంటమ్మా నువ్వు చెప్పేది రాజ్‌ దొరికాడా అని అడుగుతాడు. దీంతో అవునండి ఇందాకే కావ్యకు వాళ్ల ఫ్రెండ్‌ ఎవరో ఫోన్‌ చేసి చెప్పారు.. అందుకే అది అంత ఆగమేఘాల మీద వెళ్లింది అని చెప్పగానే..


ఇతకీ అన్నయ్య ఎక్కడ ఉన్నాడంట పెద్దమ్మ అని కళ్యాణ్‌ అడగ్గానే.. వాళ్ల ఫ్రెండ్‌ దగ్గరే ఉన్నాడంట కళ్యాణ్‌ అని చెప్తుంది అపర్ణ. అయితే వెంటనే కావ్యకు ఫోన్‌ చేసి అడ్రస్‌ పెట్టమను.. మనం కూడా వెళ్దాం అంటాడ సుభాష్‌. ఉండండి ఫోన్‌ తీసుకోస్తాను అంటూ అపర్ణ లోపలికి వెళ్లబోతుంటే ఇంద్రాదేవి వద్దు అపర్ణ ఆగు.. అంటూ ఆపేస్తుంది. దీంతో ప్రకాష్‌ ఎందుకమ్మా అడ్రస్‌ పెడితే మనం అందరం కూడా వెళ్తాం కదా అంటాడు.  నా మనవడు అందిరి మీద అలిగి వెళితే అందరం వెళ్లి తీసుకొచ్చే వాళ్లం. ఈ టైంలో మనం అక్కడికి వెళితే వాడు దానితో సరిగ్గా మాట్లాడలేడు.. అని ఇంద్రాదేవి చెప్పగానే.. అవును అమ్మా అయితే ఇక రాజ్‌కు నిజం చెప్పేద్దాం.. అంటాడు సుభాష్‌.

ఏమంటున్నారు అండీ మీరు అని అపర్ణ అడగ్గానే.. అవును అపర్ణ ఇవాళ కావ్య తన ప్రేమను యాక్సెప్ట్‌ చేయలేదనే అలిగి వెళ్లిపోయాడు. రేపు మనమే వాడి పేరెంట్స్‌ అని తెలుసుకుంటే మన మీద ఎంత అలుగుతాడో ఏంటో ఆలోచించండి.. అందుకే నిజం చెప్పేద్దాం అంటాడు సుభాష్‌. అందరూ ఆలోచిస్తుంటారు. ఇంతలో రుద్రాణి ఈ విషయం వెంటనే యామినికి చెప్పాలి అనుకుంటూ బయటకు వెళ్ళి ఫోన్‌ చేసి జరిగింది చెప్తుంది రుద్రాణి. రుద్రాణి మాటలకు యామిని షాక్‌ అవుతుంది. మరోవైపు కావ్య, రేవతి ఇంటికి వెళ్లి రాజ్‌ ఎక్కడ అని కంగారుగా అడుగుతుంది. దీంతో రేవతి ఇక్కడే ఉన్నాడని రాత్రి చిన్న యాక్సిడెంట్‌ జరిగిందని చెప్పగానే.. కావ్య ఏడుస్తూ లోపలికి వెళ్తుంది. కోపంగా సరిపోయిందా..? ఇంకా పెద్ద యాక్సిడెంట్‌ చేసుకోవాల్సింది. ఇంకా రెండు మూడు కట్లు కట్టేవారు కదా అంటుంది. అవసరం అయితే తగిలించుకుంటాను.. మీకెందుకు అయినా మీరెందుకు ఇక్కడకు వచ్చారు.. అక్కా నేను చెప్పాను కదా చెప్పకూడదు అని నీకు ఈ తమ్ముడి కంటే తనే ఎక్కువై పోయింది కదా..? అంటాడు రాజ్‌.


దీంతో కావ్య కోపంగా ఏంటి ఆవిడ మీద అరుస్తున్నారు..  తప్పు చేసింది మీరు.. చెప్పకుండా వెళ్లిపోయింది మీరు.. యాక్సిడెంట్‌ చేయించుకుంది మీరు.. దెబ్బలు తగిలించుకుంది మీరు..అంటుంది. దీంతో రాజ్‌ అవును నాకే కదా యాక్సిడెంట్‌ జరిగింది నా వల్ల ఏదో మీకు యాక్సిడెంట్‌ జరిగినట్టు ఎందుకు గొడవ చేస్తున్నారు. నాకేం అయితే మీకెందుకు..? అసలు నేనెవరిని మీ లైఫ్‌లో  అంటాడు రాజ్‌. కావ్య కోపంగా నాకు మీకు ఏ సంబంధం లేదా.? అని అడుగుతుంది. దీంతో లేదని నిన్న మీరే చెప్పారు కదా..? నేనెవరో దారిన పోయే దానయ్యను అని నాకేం అయితే మీకెందుకు అంటాడు. ఇలా అడదిడ్డంగా వాగారంటే చంపేస్తాను.. అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు.. లవ్‌ ఫెయిల్‌ అయిందని ఏడ్చుకుంటూ వెళ్లి యాక్సిడెంట్‌ చేసుకోవడానికి.. రాత్రి నుంచి మీరు ఇంటికి రాలేదని యామిని చెప్పేసరికి నా గుండె ఆగినంత పనైంది. మీరు ఏమయ్యారో ఎక్కడున్నారో తెలియక నేను ఎంత టెన్షన్‌ పడ్డానో తెలుసా..? ఒక్క మాట ఫోన్‌ చేసి చెప్పి ఉంటే మీ ఆస్తులు ఏమైనా పోయాయా…? నేను తిడుతుంటే మీరు నవ్వుతున్నారేంటి..? గతంతో పాటు కామన్‌సెన్స్‌ కూడా మర్చిపోయారా..? అంటుంది.

ఫస్ట్‌ టైం ఒక మనిషి మనల్ని తిడుతున్నా ఆనందంగానే ఉందండి. మీ మనసులో నా మీద ఇంత ప్రేమ పెట్టుకుని నిన్న ఎందుకు అలా మాట్లాడారు..? అసలు ఇష్టమే లేనట్టు ఎందుకు అలా ప్రవర్తించారు. మీరు అన్నట్టు నేను నిజంగానే పరాయి వాణ్ని అయింటే నాకు ఏం జరిగినా  మీరు పట్టించుకునే వారే కాదు.. మీరు కూడా నన్ను ఇష్టపడుతున్నారు కాబట్టే ఇలా ఇంత దూరం వచ్చారు అంటాడు రాజ్‌. దీంతో కావ్య ఏవండి మీకు ఒక్కసారి చెబితే అర్థం కాదా.? నేను మిమ్మల్ని ప్రేమించడం లేదు అటుంది. మరైతే ఎందుకు వచ్చారు వెళ్లిపోండి అంటాడు రాజ్‌. వెళ్తాను కానీ నిన్ను తీసుకునే ఇక్కడి నుంచి వెళ్తాను.. మా అత్తయ్య.. అమ్మమ్మ వాళ్లు నీకోసం బాధపడుతున్నారు.. వాళ్లకోసమే నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తాను అంటూ రాజ్‌ను లాక్కుని వెళ్తుంది కావ్య. కావ్య రాజ్‌ను ఇంటికి తీసుకుని వస్తుంది.

రాజ్‌ తలకు గాయం చూసి అందరూ షాక్‌ అవుతారు. రాత్రంతా ఎక్కడికి వెళ్లిపోయావు. తలకు గాయం ఎందుకు తగిలింది అంటూ ప్రశ్నిస్తారు. రాజ్‌ తన ప్రేమ గురించి ఎమోషనల్‌ అవుతుంటే  యామిని  వస్తుంది. నవ్వు  ప్రేమ ఓడిపోతే మమ్మల్ని వదిలేసి వెళ్లిపోదాం అనుకన్నావా..?  అంటూ సెంటిమెంట్‌ డైలాగులు చెప్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

×