E-Paper
Advertisement

Ibomma Ravi : ఐబొమ్మ వల్ల ఎంతో మంది చనిపోయారు, పైరసీతో రవి కోట్లు సంపాదించాడు.. కీలక విషయాలు వెల్లడించిన సజ్జనార్!

Ibomma Ravi : ఐబొమ్మ వల్ల ఎంతో మంది చనిపోయారు, పైరసీతో రవి కోట్లు సంపాదించాడు.. కీలక విషయాలు వెల్లడించిన సజ్జనార్!

IBomma Ravi: మూవీ పైరసీ కింగ్ ఐ బొమ్మ రవి (IBomma Ravi)అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన  నేపథ్యంలో పోలీసులు పక్కా పథకం ప్రకారం అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈయన రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇలా ఐ బొమ్మ రవి అరెస్ట్ కావడంతో పలువురు సినీ ప్రముఖులు నేడు హైదరాబాద్ సిపి సజ్జనార్(CP Sajjanar) తో భేటీ అయిన సంగతి తెలిసిందే.. ఇక ఈ భేటీ అనంతరం సజ్జనార్ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా సజ్జనార్ ఐ బొమ్మ రవి గురించి సంచలన విషయాలను వెలుగులోకి తీసుకువచ్చారు. ఐ బొమ్మ రవి వైజాగ్ చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆయన మాత్రం ప్రహ్లాద్ కుమార్  వేళ్లల్ల అనే పేరుతో డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు వంటివి తీసుకున్నారని సజ్జనార్ వెల్లడించారు. ఈయన అరెస్టు అయిన సమయంలో మూడు కోట్ల నగదు సీజ్ చేసినప్పటికీ సినిమా పైరసీ ద్వారా సుమారు 20 కోట్ల వరకు సంపాదించారని సమాచారం అందింది. ఇక ఈ విషయాన్నికి సంబంధించి లోతుగా దర్యాప్తు జరుగుతోందని ఈ పైరసీ రాకెట్ వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయాల త్వరలోనే వెలుగులోకి వస్తాయని తెలిపారు.

పాన్ ఇండియా సినిమాలు పైరసీ..

ఇలా మూవీ పైరసీలో భాగంగా రవి నెదర్లాండ్, ఫ్రాన్స్, థాయిలాండ్, అమెరికా స్విట్జర్లాండ్ వంటి దేశాలలో ఏకంగా 110 డొమైన్ లను కొనుగోలు చేశారని వెల్లడించారు. ఇక రవి ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో విడుదలై మంచి సక్సెస్ అందుకున్న ఓజీ, కాంతార1, మిరాయి వంటి సినిమాలు థియేటర్లోకి రావడమే ఆలస్యం రవి తన వెబ్సైట్ అన్నింటిలోనూ రిలీజ్ చేశారని ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రస్తుతం రవికి సంబంధించిన ఈ కేసులో లోతుగా దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్..

ఇలా మూవీ పైరసీ మాత్రమే కాకుండా భారీ స్థాయిలో బెట్టింగ్ యాప్స్(Betting App) కూడా ప్రమోషన్ చేసినట్లు సజ్జనార్ ఈ సందర్భంగా తెలిపారు. రవి వన్ విన్, వన్ ఎక్స్ అనే బెట్టింగ్ యాప్స్ భారీ స్థాయిలో ప్రమోట్ చేసి పెద్ద ఎత్తున డబ్బు సంపాదించడమే కాకుండా ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎంతోమంది అమాయకుల ప్రాణాలు పోవడానికి కూడా కారణమయ్యారని వెల్లడించారు. గత రెండు సంవత్సరాల క్రితం రవి పోలీసులకు చాలెంజ్ చేసిన సంగతి తెలిసింది. ఇక ఈ విషయం గురించి కూడా సజ్జనాలు మాట్లాడుతూ పోలీసులకు చాలెంజ్ చేశారు ఇప్పుడు మీ పరిస్థితి ఏమైందో ఆలోచించండి. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారు ఎక్కడున్నా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇక రవి దగ్గర నుంచి కొన్ని హార్డ్ డిస్క్, లాప్టాప్,సీజ్ చేసినట్లు తెలిపారు. ఇక రవి 35 బ్యాంక్ అకౌంట్ మైంటైన్ చేస్తున్నారని వాటి వివరాలను కూడా విచారిస్తున్నామని తెలిపారు. ఇక రవి గురించి ఎవరు ఎలాంటి సమాచారం అందించలేదని పోలీసులు తమ నెట్ వర్క్ ఉపయోగించే అరెస్టు చేశారని తెలిపారు. ఇక ప్రజలు కూడా ఇలాంటి వాటిపై బాధ్యతాయుతంగా ఉండాలని, ఎవరూ కూడా పైరసీని ప్రోత్సహించవద్దని ఈ సందర్భంగా సజ్జనార్ కోరారు. ఇలా బెట్టింగ్ యాప్స్ గురించి ఏవైనా తెలిసి ఉంటే వెంటనే ఈ సైబర్ క్రైమ్ నంబర్ కు 1930 సమాచారం అందించమని కోరారు.

Also Read: Rajinikanth -Balakrishna:50 ఏళ్ల సినీ కెరియర్ పూర్తి..బాలకృష్ణ, రజనీకాంత్ కు అరుదైన గౌరవం!

Related News

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

Big Stories

×