Chiranjeevi Comments at Press Meet:ఎంతోకాలంగా సినీ పరిశ్రమకు వెంటాడుతున్న పైరసీ భూతం చెక్ పడింది. ఐబొమ్మ (Ibomma Ravi Arrest) పేరుతో కొత్త సినిమాలను, పాన్ ఇండియా చిత్రాలను పైరసి చేస్తున్నారు. ఈ పైరసికి అడ్డుకట్ట వేయడం సినీ పరిశ్రమకు సవాలుగా మారింది. దీన్ని అరికట్టడానికి సినీ పరిశ్రమ ఎంతో క్రష్టి చేస్తుంది. అయిన ఈ పైరసీ అరికట్టలేకపోతున్నారు. ఈ క్రమంలో ఐబొమ్మ నిర్వహకుడు ఇమ్మడి రవి అరెస్టు తో సినీ టాలీవుడ్ పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది.
దీంతో అతడిని అరెస్టు చేసి ఇండస్ట్రీ పరిశ్రమను బతికించిన పోలీసు శాఖకు మెగాస్టార్ చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా నిర్వహించిన హైదరాబాద్ కమిషనర్ సీపీ సజ్జనార్ సినీ ప్రముఖులంత స్వయంగా కలిశారు. ఈ సందర్బంగా నిర్వహించిన ప్రెస్ మీట్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘సినీ నిర్మాత, దర్శకుడు నుంచి లైట్ బాయ్, ప్రొడక్షన్ బాయ్ వరకు ఎంతో మంది కష్టాన్ని బయట వ్యక్తి అప్పలంగా దోచుకుంటుంటే తట్టుకోలేని పరిస్థితులను చూశాం‘ అన్నారు మెగాస్టార్ చిరంజీవి.
ఫిల్మ్ ఇండస్ట్రీతో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో లక్షల మంది ఆధారపడ్డారు. సినిమా అంటే ఓ స్టార్ హీరోదో, స్టార్ నిర్మాతదో కాదు. లైట్ బాయ్ నుంచి ప్రొడక్షన్ బాయ్ వరకు ఈ సినిమా కోసం కష్టపడుతున్నారు. వేలమంది కష్టాన్ని ఎవడో అప్పలకంగా వచ్చి దోచుకుంటుంటే, దౌర్జన్యం చేస్తూ సినీ పరిశ్రమకు, పోలీసు శాఖకు సవాలు విసురుతుంటే తట్టుకోలేని పరిస్థితి. వీరిని ఎలా అరికట్టాలని తర్జనభర్జన పడుతున్న సమయంలో గత కమిషన్ సీపీ ఆనంద్, అనంతరం ప్రస్తుతం సీపీ సజ్జనార్ ఎంతో కృషి చేశారు. ఐబొమ్మ నిర్వహకుడిని అరెస్టు చేసిన సీపీ సజ్జనార్ ఆయన టీంకి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సజ్జనార్ ఎంతో శ్రమించి ఐబొమ్మ నిర్వహకుడిని పట్టుకోవడం హర్షించదగ్గ విషయమన్నారు.
Also Read: SS Rajamouli: ఏంటి జక్కన్న ఇది.. ఇంట్లో వాళ్లకి కూడా చెప్పకుండా? డెడికేషన్ అంటే నీదే సామీ
‘ప్రజలు కూడా సినిమా తమది అని భావించాలి. పైరసీ చూడొద్దు. ఈ ఏడాది చాలా సినిమాలు పైరసీ చేశారు. దీనివల్ల ఎంతో నష్టం జరిగింది. త్వరలోనే రాజమౌళి గొప్ప సినిమా తీస్తున్నారు. అప్పుడు మన ఖ్యాతి ఖండాంతరాలు విస్తరిస్తుంది. ఆ సమయంలో పైరసీ పెనుసవాలుగా ఉంటుంది. ఇండస్ట్రీ బాధను అర్థం చేసుకున్నందుకు పోలీసులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎన్నో ఏళ్లు సినీ పరిశ్రమకు పట్టి పీడుతున్న పైరసీ భూతాన్ని అరికట్టిన పోలీసు శాఖను అభినందస్తున్నా’ అని చిరంజీవి పేర్కొన్నారు. ఈ ప్రెస్ మీట్ అనంతరం పోలీసు శాఖ అధికారులను సినీ ప్రముఖులంత శాలువలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు అక్కినేని నాగార్జున, నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ రాజమౌళి, నిర్మాత డి సురేష్ బాబుల ఇతరులు పాల్గొన్నారు.