Allu Arvind In Scam: ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) కు ఈడీ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ స్కామ్(Bank Scam) కేసులో భాగంగా ఈడి అధికారులు దాదాపు మూడు గంటల పాటు అల్లు అరవింద్ ను విచారణ చేస్తూ ప్రశ్నలు వేశారు. 2018- 19 మధ్య జరిగిన ఈ స్కామ్ కి సంబంధించిన ఆర్థిక లావాదేవీలతో పాటు, ఆస్తుల కొనుగోలుపై ఎన్నో ప్రశ్నలు వేసినట్టు తెలుస్తుంది. ఇలా మూడు గంటల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు తదుపరి వచ్చేవారం మరోసారి విచారణకు హాజరు కావాలి అంటూ ఈయనకు నోటీసులను జారీ చేశారు. ఇలా గతంలో జరిగిన స్కాం కి సంబంధించి ఇప్పుడు విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇది అల్లు అరవింద్ కు ఊహించని షాక్ అనే చెప్పాలి.
బ్యాంక్ స్కాం..అల్లు అరవింద్ ప్రమేయం ఉందా?
2018 సంవత్సరంలో రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంకు స్కామ్ లో భాగంగా ఇప్పుడు ఈయనని విచారణ చేపట్టడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. ఈ విచారణలో భాగంగా అల్లు అరవింద్ ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ చేపట్టారు మరి ఈ విచారణలో భాగంగా అల్లు అరవింద్ ఏం సమాధానాలు ఇచ్చారనేది తెలియాల్సి ఉంది. ఇక తదుపరి విచారణకు కూడా హాజరు కావాల్సిందే అంటూ ఈడి అధికారులు నోటీసులు జారీ చేశారు. మరి ఈ బ్యాంక్ స్కాంకు సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పాన్ ఇండియా హీరోగా అల్లు వారసుడు…
ఇక అల్లు అరవింద్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. అల్లు రామలింగయ్య వారసుడుగా ఇండస్ట్రీలోకి నిర్మాతగా అడుగుపెట్టిన అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ స్థాపించారు. ఇలా గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మిస్తూ ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఇక అల్లు అర్జున్ వారసులుగా ముగ్గురు కుమారులు ఇండస్ట్రీలోకి హీరోలుగాను నిర్మాతలుగాను అడుగుపెట్టినప్పటికీ అల్లు అర్జున్ మాత్రమే ఇండస్ట్రీలో హీరోగా మంచి సక్సెస్ అందుకున్నారు. అల్లు అర్జున్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతూనే మరోవైపు పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకున్నారు.
స్టార్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు…
పుష్ప సినిమా ద్వారా అల్లు అర్జున్ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ సినిమా అనంతరం ఈయన తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ సినిమా డైరెక్షన్లో బిజీగా ఉన్నారు. ఇక నిర్మాతగా అల్లు అరవింద్ కూడా వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఇక ఈయన గీత ఆర్ట్స్ బ్యానర్ 2 కూడా ప్రారంభించారు. ఈ బ్యానర్ వ్యవహారాలన్నింటిని కూడా బన్నీ వాస్తు చూసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక అల్లు అరవింద్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారని విషయం తెలియడంతో ఇది కాస్త ఇండస్ట్రీలో చర్చలకు కారణమైంది.
Also Read: నో డౌట్.. ఆయన అరెస్ట్ తెలుసుంటే బిగ్ బాస్ షో నుంచి వాక్ ఔట్ చేసేవాడిని.. శివాజీ వైరల్ కామెంట్స్!