Ilaiyaraaja Copyright: నా పాటల్ని అనుమతి లేకుండా ఎవరైనా వాడుకుంటే మాములుగా ఉండదు అంటూ కాపీ రైట్ పేరిట మొన్నటి వరకు మేకర్స్ ముక్కు పిండి కోట్ల రూపాయలు వసూలు చేశాడు ఇళయరాజా.అయితే ఇపుడు ఏకంగా 134 సినిమాల కాపీ రైట్ ఇష్యూలో రాజాకి ఢిల్లీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఇదే కేసులో గతంలో ఉన్న స్టే ఆర్డర్స్ ని ఎత్తివేయాలంటూ సుదీర్ఘ న్యాయపోరాటం చేసిన రాజా అభ్యర్థనను పక్కన పెడుతు ఇపుడున్న స్టే ఆర్డర్ అలాగే ఉంటుందని కోర్టు తేల్చి చెప్పడంతో ఈ కాంట్రవర్సీ మరింత ముదిరేలానే కనిపిస్తుంది.
అసలు విషయంలోకి వస్తే సమస్య అంతా రాజా సంగీతం అందించిన దాదాపు 134 చిత్రాల చుట్టూ తిరుగుతుంది.నా సినిమాల్లోని పాటలని ఎవరూ వాడుకోవడానికి వీలు లేదంటూ ఇళయరాజా కోర్టు ఆర్డర్ పాస్ చేయడంతో మొదలైంది అసలు సమస్య. అయితే ఆ సినిమాలలోని పాటలకి సంబందించిన సౌండ్ రికార్డింగ్, పబ్లిషింగ్..ఇలా సర్వ హక్కులు మాకే ఉన్నాయని, లీగల్ గా కొన్నేళ్ళ కిందటే వాటి హక్కులని దక్కించుకున్నామని ప్రొడ్యూసర్స్ అగ్రిమెంట్స్ ని కోర్టు ముందు ఉంచింది ప్రముఖ సంగీత సంస్థ ‘సారేగామా’ (గతంలో హెచ్‌ఎమ్‌వి)అయితే దీనికి కౌంటర్ ఇస్తూ వాటికి ట్యూన్స్ కట్టి ప్రాణం పోసింది తానేనని,అలాంటప్పుడు వాటికి సంబందించిన సర్వ హక్కులు నాకే ఉంటాయన్నది వాదిస్తున్నారు ఇళయరాజా .
1970, 80, 90లలో ఇళయరాజా అందించిన సంగీతం ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిందనే చెప్పాలి. ముఖ్యంగా అంకురం’, ‘అభినందన’, ‘ఘర్షణ’, ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘శివ’ వంటి ఎన్నో సినిమాలు ఈయన సంగీత దర్శకత్వంలో వచ్చినవే.అలాంటి బ్లాక్ బస్టర్ ఆడియో రైట్స్ అన్నీ అప్పటి కాపీరైట్ చట్టాల ప్రకారం నిర్మాతలు ఈ హక్కులను ఆడియో కంపెనీలకు అమ్మేశారు ప్రొడ్యూసర్స్.అయితే ఈ సోషల్ మీడియా జమానాలో యూట్యూబ్, స్పాటిఫై, వింక్ వంటి ఓటీటీ, మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్స్ ద్వారా కోట్లాది రూపాయల రాయల్టీ వస్తుండటంతో పాటల మీద హక్కులు మావంటే మావంటూ కోర్టు మెట్లు ఎక్కాయి ఇరు వర్గాలు.
అయితే ప్రస్తుతం దీనిపై ఎలాంటి ఆర్డర్ ఇవ్వలేమని,కేస్ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లోనే ఉన్నందున గతంలో ఇచ్చిన ఆర్డర్స్ అమల్లో ఉంటాయని తేల్చి చెప్పింది డిల్లీ హైకోర్ట్. చూస్తుంటే ఈ కాపీ రైట్ కేసులో వచ్చే తీర్పు మ్యూజిక్ డైరెక్టర్ రాయల్టీ హక్కుల విషయంలో సరికొత్త దిశని చూపించబోతుందని అర్థమైపోతుంది. చూడాలి ముందు ముందు ఈ రాజా vs సారేగామ మధ్య జరుగుతున్న ఈ కాపీ రైట్ పంచాయితీ ఇంకెన్ని మలుపులు తీసుకోనుందో !