Daryll Cullinan: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో (Indian Premier League 2026 tournament) అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Sooryavanshi )… అతి త్వరలోనే అంతర్జాతీయ అరంగేట్రం చేయబోతున్నాడు. ఇందులో భాగంగానే ఐర్లాండ్, ఇంగ్లాండ్, ఏషియన్ గేమ్స్ కోసం అతడిని సెలెక్ట్ చేశారు. ఐర్లాండ్ తో అరంగేట్రం చేసే అవకాశం వచ్చినప్పటికీ… టీమిండియా యాజమాన్యం అతడిని పక్కకు పెట్టింది. ఇక ఇవాళ ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య టి20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇలాంటి క్రమంలో వైభవ్ సూర్యవంశీకి అవకాశం వస్తుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అంతేకాదు వైభవ్ సూర్యవంశీ ఆడితే చూడాలని జనాలు కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ పై మాజీ దక్షిణాఫ్రికా క్రికెటర్ డారిల్ కల్లినన్ ( Daryll Cullinan) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ ఆడటం అవసరం లేదని బాంబు పేల్చారు. టీమిండియాలో ఆడటం నీ వల్ల కాదు..వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకో అంటూ హేళన చేస్తూ మాట్లాడారు. దీంతో డారిల్ కల్లినన్ ( Daryll Cullinan) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరగనున్న టి20 సిరీస్ నేపథ్యంలో అరంగేట్రం చేసేందుకు వైభవ్ సూర్యవంశీ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ దెబ్బతీసేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ కల్లినన్ ( Daryll Cullinan). అంతర్జాతీయ క్రికెట్ ఆడే వయస్సు నీది కాదంటూ వైభవ్ ను హేళన చేశారు. వెంటనే టీమిండియా జట్టు నుంచి వైదొలిగి… బీహార్ లో గల్లీ క్రికెట్ ఆడుకో అంటూ చురకలు అంటించారు. ప్రస్తుత వయసులో నువ్వు చదువు పైన దృష్టి పెట్టడమే కాకుండా.. చిన్నపిల్లలతో గల్లీ క్రికెట్ ఆడాలని సూచనలు చేశారు.
అంతర్జాతీయ క్రికెట్ లో ఒత్తిడి విపరీతంగా ఉంటుందని.. ఇలాంటి క్రమంలో 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ అంతర్జాతీయ మ్యాచ్ లో ఆడడం కష్టమన్నారు డారిల్ కల్లినన్ ( Daryll Cullinan). ఆ ఒత్తిడి వల్ల భవిష్యత్తులో వైభవ్ సూర్యవంశీ కెరీర్ దెబ్బ తినే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. తాను చెప్పే మాటలు వినకుండా అంతర్జాతీయ క్రికెట్ ఆడితే… 20 ఏళ్ల లోపే వైభవ్ సూర్యవంశీ నాశనం కావడం గ్యారెంటీ అంటూ హెచ్చరించారు. వైభవ్ బ్యాట్ ఊపడం కూడా చాలా తేడాగా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అతడు బ్యాట్ ఊపే స్టైల్ కారణంగా.. అతడు గాయాల పాలు కావడం గ్యారెంటీ అని తెలిపారు. దీంతో డారిల్ కల్లినన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.