Asia Cup 2025 : ఆసియా కప్ 2025 లో టీమిండియా (Team India) కి షాక్ తగిలిందనే చెప్పాలి. టీమిండియా కీలక ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) ఆసియా కప్ మ్యాచ్ లు ప్రస్తుతం జరుగుతుండగానే టీమిండియా స్క్వాడ్ నుంచి వైదొలిగాడు. జట్టులో రిజర్వ్ ఆటగాడిగా ఉన్న ఆయన.. టోర్నమెంట్ మధ్యలోనే టీమ్ ను వీడి ఇంగ్లాండ్ (England) కి బయలుదేరాడు. సుందర్ ను ప్రధాన జట్టులో కాకుండా రిజర్వ్ స్క్వాడ్ లో చేర్చారు. దీంతో ఈ టోర్నమెంట్ లో ఆమే అవకాశం దాదాపు ఉండదు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న ప్రతిష్టాత్మక కౌంటీ ఛాంపియన్ షిప్ ( County Champion Ship) లో ఆడేందుకు వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఆసియా కప్ లో టీమిండియా కి తిరిగి రాగానే శుబ్ మన్ గిల్ కి వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. కీలక ఆటగాడు కే.ఎల్.రాహుల్, శ్రేయాస్ అయ్యర్ కి నిరాశే ఎదురైంది. వారిద్దరినీ కూడా జట్టులో లేకుండా సెలెక్టర్లు చేశారు. కొంత మంది అయితే కీలక ఆటగాళ్లను ఎందుకు ఎంపిక చేయలేదో ఏమి అని మండిపడుతున్నారు. మరోవైపు సెలెక్ట్ చేసిన ఆటగాళ్లు సైతం టీమిండియా కి దూరంగా వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్ వెళ్లిపోవడంతో అతని పై టీమిండియా కంటే కౌంటీ ఛాంపియన్ షిప్ ముఖ్యమా..? అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.
సూర్యకుమార్ యాదవ్ ( కెప్టెన్), శుబ్ మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, జితేశ్ శర్మ, హర్షిత్ రాణా, రింకూసింగ్.
ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్, వాషింగ్టన్ సుందర్.
మరోవైపు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ని జట్టులోకి తీసుకోవడం పై క్రికెట్ ప్రియులు సోషల్ మీడియా వేదిక గా ప్రశ్నిస్తున్నారు. ఐపీఎల్ లో 2024లో కేకేఆర్ కి కెప్టెన్ గా వ్యవహరించారు. కేకేఆర్ టైటిల్ సాధించింది. 2025లో పంజాబ్ కింగ్స్ ను ఫైనల్ తీసుకెళ్లాడు. 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ట్రోఫీ సాధించింది. ఇదిలా ఉంటే.. ఆసియా కప్ లో సెప్టెంబర్ 14న పాకిస్తాన్ వర్సెస్ భారత్ మధ్య మ్యాచ్ జరుగబోతుంది. ఈ మ్యాచ్ పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. టీమిండియా ఆటగాళ్లు మేమే విజయం సాధిస్తామని వారు ధీమాలో ఉంటే.. మరోవైపు పాకిస్తాన్ జట్టు తామే గెలుస్తామని గొప్పలు చెప్పుకుంటుంది. పాక్ ఓపెనర్ అయూబ్ 6 బంతుల్లో 6 సిక్సులు కొడతాడని మాజీ క్రికెటర్ పేర్కొన్నాడు. కానీ ఒమన్ తో జరిగిన మ్యాచ్ లో అయూబ్ డకౌట్ కావడం గమనార్హం. దీంతో టీమిండియాతో కూడా డకౌట్ అయ్యే అవకాశం ఉందని టీమిండియా అభిమానులు పేర్కొంటున్నారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుందో వేచి చూడాలి.