BigTV English

Tollywood Actress : ఒకప్పుడు వాచ్ మెన్.. ఇప్పుడు స్టార్.. కోట్ల సంపాదన.. ఎవరంటే..?

Tollywood Actress : ఒకప్పుడు వాచ్ మెన్.. ఇప్పుడు స్టార్.. కోట్ల సంపాదన.. ఎవరంటే..?

Tollywood Actress : సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్స్ గా కొనసాగుతున్న ఎంతోమంది నటులు సినిమాల్లోకి రాకముందు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక్క పూట అన్నం కూడా లేని పరిస్థితి నుంచి ఇప్పుడు తమ టాలెంట్ తో ఇండస్ట్రీలో స్టార్స్ గా కొనసాగుతున్నారు. గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖుల గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కొందరు యాక్టర్స్ గోల్డెన్ స్పూన్ తో పుట్టలేదని పలు ఇంటర్వ్యూలలో తమ జీవితాల గురించి బయటపెడుతున్నారు.. ఎంతోమంది హీరోలు కూడా ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం స్టార్స్ గా కొనసాగుతున్నారు. స్వయం కృషితో పైకొచ్చిన హీరోలు అంటే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది మాత్రం మెగాస్టార్ చిరంజీవి.. ఇంకా న్యాచురల్ స్టార్ నాని ఇలా చాలా మందే ఉన్నారు.. కొందరు యాక్టర్స్ కూడా కష్టాలను దిగమింగుకొని సినిమాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టార్ నటుడు ఒకప్పుడు వాచ్ మెన్.. కానీ ఇప్పుడు కోట్ల ఆస్తిని కూడబెట్టాడు. ఇంతకీ ఆ స్టార్ నటుడు ఎవరో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..


వాచ్ మెన్ టు స్టార్ యాక్టర్..

విలక్షణ నటుడు షాయాజీ షిండే గురించి అందరికీ తెలుసు.. తెలుగు లో విలన్ గా ఈయన ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు.. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, గుజరాతీ, మరాఠీ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించి అశేష ప్రేక్షకాదరణ పొందారు. ఈయన మహారాష్ట్ర కు చెందిన వ్యక్తి. ఆయన తండ్రి రైతు. మొదట్లో సొంతూరు విడిచిపెట్టి సతారా నగరానికి వెళ్లి అక్కడే చదువుకున్నారు. షాయాజీ షిండేకు సినిమా అంటే పిచ్చి. సినీ రంగంలోకి ప్రవేశించడానికి ముందు ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు. ఇరిగేసింది డిపార్ట్మెంట్లో వాచ్మెన్ గా ఉద్యోగం చేశారు. అప్పుడు ఆయన నెల జీతం కేవలం రూ.165. నటనపై ఇంట్రెస్ట్ తో నాటకాల్లోకి రంగ ప్రవేశం చేశారు. అలా సినిమాల్లో అవకాశాలు రావడం మొదటి మూవీతోనే ప్రశంసలు అందుకున్నాడు.


షాయాజీ సినిమాలు..

నాటకాలు చేస్తూనే సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత ముంబైకు వెళ్లి నటనలో శిక్షణ తీసుకున్నారు. తొలుత ‘శూల్’ అనే హిందీ సినిమాలో బచ్చు యాదవ్ పాత్రను పోషించారు. ఈ సినిమాలో ఆయన నటనకు ప్రతి ఒక్కరూ మంత్రముగ్ధులయ్యారు. నటుడిగా లక్షల రూపాయల్లో పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగారు. ‘ఠాగూర్’ సినిమా తో తెలుగులో షాయాజీ సినీ ప్రస్థానం మొదలైంది.. అలా ఒక్కో మూవీతో స్టార్ రేంజ్ ను సొంతం చేసుకున్నాడు.. సినిమాల్లో విజయవంతంగా కెరీర్ కొనసాగిస్తున్న షాయాజీ షిండే, ఇప్పుడు రాజకీయా ల్లోనూ తన సత్తా చాటాలని భావిస్తున్నారు.. ఇటీవల రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు.. ఈ మధ్యనే ఓ పార్టీలో చేరారు.. ఆయన ఇక సినిమాలు చేస్తారో లేదో కానీ, రాజకీయాల్లో తన మిగిలిన జీవితాన్ని గడపాలని అనుకుంటున్నారట..

Related News

Ilaiyaraaja : మైత్రి మూవీ మేకర్స్ కు దిమ్మతిరిగే షాక్.. 5 కోట్లు డిమాండ్..

Bollywood: బాలీవుడ్ లో దిగ్బ్రాంతి, ఆ ప్రముఖ నటుడు దూరమయ్యారు

Ar Muragadoss: ఇంక రిటైర్మెంట్ ఇచ్చేయండి బాసు, పెద్ద డైరెక్టర్లు వరుస ఫెయిల్యూర్స్

Nag Ashwin: ప్రధానికి నాగ్ అశ్విన్ కీలక రిక్వెస్ట్.. కొత్త జీఎస్టీ‌లో ఆ మార్పు చెయ్యాలంటూ…

Siima 2025 Allu Arjun: సైమా ఈవెంట్లో అల్లు అర్జున్, లుక్ అదిరింది భాయ్

17 Years of Nani : మామూలు జర్నీ కాదు, ఈ తరానికి నువ్వే బాసు

Big Stories

×