BigTV English

OTT Movie : వామ్మో ఇదెక్కడి అరాచకంరా అయ్యా… మనిషి మెదడును ఉడికించి తినే సైకో… 14 మంది బలి

OTT Movie : వామ్మో ఇదెక్కడి అరాచకంరా అయ్యా… మనిషి మెదడును ఉడికించి తినే సైకో… 14 మంది బలి
Advertisement

OTT Movie : కొత్త కొత్త కంటెంట్ లతో ప్రేక్షకులను చూపు తిప్పుకోకుండా చేస్తున్నారు మేకర్స్. సినిమాలతో పోటీ పడి, వెబ్ సిరీస్ లు కూడా సత్తా చాటుతున్నాయి. వీటిలో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లు ఓటీటీలో టాప్ లేపుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ లో ఒక వ్యక్తి 15 మందికి పైగా హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కుంటాడు. అంతే కాకుండా కానిబలిజం ఆరోపణలు కూడా అతని మీద వస్తాయి. ఈ సిరీస్ 2000లో జరిగిన ఒక జర్నలిస్ట్ హత్య నుండి ప్రారంభమై, అతని ఫామ్‌హౌస్‌లో దొరికిన ఒక డైరీ ద్వారా మిగతా హత్యలను కనిపెట్టడం జరుగుతుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ

‘ఇండియన్ ప్రిడేటర్: ది డైరీ ఆఫ్ ఎ సీరియల్ కిల్లర్’ (Indian Predator: The Diary of a Serial Killer) 2022 లో విడుదలైన ఒక భారతీయ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్. దీనిని ఇండియా టుడే గ్రూప్ నిర్మించగా, ధీరజ్ జిందాల్ దర్శకత్వం వహించారు. ఇది ‘ఇండియన్ ప్రిడేటర్’ సిరీస్‌లో రెండవ భాగం. ఇది మూడు ఎపిసోడ్‌లతో, రాజా కోలందర్ అనే సీరియల్ కిల్లర్ చుట్టూ తిరుగుతుంది. 2022 సెప్టెంబర్ 7 నుంచి ఈ సిరీస్ Netflix లో స్ట్రీమింగ్ అవుతోంది. IMDb లో ఈ సిరీస్ కి 6.2/10 రేటింగ్ ఉంది.


స్టోరీలోకి వెళితే

2000లో అలహాబాద్ లో ఒక జర్నలిస్ట్ ధీరేంద్ర సింగ్ మిస్సింగ్ అవుతాడు. అతని తల మాత్రం పొరుగు రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో దొరుకుతుంది. ఈ హత్య అనుమానితుడిగా రాజా కోలందర్ (రామ్ నిరంజన్) పోలీసులు అరెస్టు చేస్తారు. అతను కోల్ సమాజానికి చెందిన ఒక స్థానిక నాయకుడు. అంతే కాకుండా కారు దొంగతనం చేసే గ్యాంగ్ ను కూడా నడుపుతుంటాడు. రాజా కోలందర్ తన భార్యను ఫూలన్ దేవి అనే పేరుతో పిలిచేవాడు. తన పిల్లలకు అందోలన్ (ప్రొటెస్ట్), జమానత్ (బెయిల్), అడాలత్ (కోర్ట్) వంటి పేర్లు పెడతాడు. ఇది అతని విచిత్రమైన మనస్తత్వాన్ని చూపిస్తుంది. పోలీసులు అతని ఫామ్‌హౌస్‌లో దర్యాప్తు చేసినప్పుడు, “రాజా కి డైరీ” అనే డైరీ దొరుకుతుంది. ఇందులో ధీరేంద్ర సింగ్‌తో సహా 14 మంది బాధితుల పేర్లు ఉంటాయి. ఈ డైరీ అతని హత్యలను రికార్డ్ చేసే సాధనంగా పనిచేసింది. అతను ఈ హత్యల నుండి ఒక రకమైన ఆనందాన్ని పొందినట్లు, ఆ డైరీ చదివిన పోలీసులకు తెలుస్తుంది.

రాజా కోలందర్ చంపాలనుకున్న మనుషులతో పరిచయం పెంచుకుని, వారిని రోడ్లపై గాని, తన ఫామ్‌హౌస్‌లో గాని హత్య చేసి, శరీర భాగాలను కత్తిరించి, వివిధ ప్రాంతాలలో విసిరివేసేవాడు. అతను తన బాధితుల మెదడులను ఉడికించి తినేవాడని, దాని ద్వారా వారి శక్తులు, సామర్థ్యాలను పొందవచ్చని నమ్మేవాడని ఆరోపణలు ఉన్నాయి. అయితే కానిబలిజం ఆరోపణలు కోర్టులో నిరూపించబడలేదు. సిరీస్ రాజా కోలందర్ మానసిక స్థితిని, అతని కోల్ సమాజం నేపథ్యాన్ని, ఉత్తరప్రదేశ్‌లోని సామాజిక-రాజకీయాల చుట్టూ తిరుగుతుంది. అతను తన బాధితులను ఎంచుకోవడంలో ఒక ఫాంటసీని నిర్మించి, పక్కా ప్రణాళికను ఖచ్చితంగా అమలు చేసేవాడు.  ఇది చూసే ప్రేక్షకులకు కూడా ఒక భయంకరమైన అనుభవాన్ని అందిస్తుంది. రాజా 2001లో అరెస్టు అయినప్పటికీ, ధీరేంద్ర సింగ్ హత్య కేసులో 2012లో అతనికి శిక్ష పడింది. చివరికి రాజా కోలందర్ కి ఎటువంటి శిక్ష పడింది ? అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ? నిజంగానే మనుషుల మాంసాన్ని తిన్నాడా ? అనే విషయాలను ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : ప్రియుడితో కలిసి పెళ్ళికి ముందే ఆ పని… థ్రిల్లింగ్ ట్విస్టులతో నరాలు తెగే సస్పెన్స్… క్లైమాక్స్ డోంట్ మిస్

Related News

OTT Movie : పక్కనున్న భార్య మిస్సింగ్ అంటూ కేసు… పోలీసులకే పిచ్చెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : పెళ్లీడు పిల్లలుండగా పక్కింటి ఆంటీ ఇంట్లోకి… ఫైట్స్ లేవు, రొమాన్స్ లేదు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్

Mirai: థియేటర్లలోనే కాదు ఓటీటీలో కూడా సరికొత్త సంచలనం.. కుమ్మేశాడుగా!

OTT Movie : ఆడవాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ పై పన్ను… ఫ్యామిలీతో చూడకూడని సీన్లున్న హిస్టారికల్ మూవీ

OTT Movie : మెడికల్ కాలేజీలో వరుస మరణాలు… అమ్మాయిల టార్గెట్… గుండె జారిపోయే సీన్లు ఉన్న హర్రర్ మూవీ

OTT Movie : క్రిమినల్ ను పట్టుకోవడానికెళ్లి తప్పించుకోలేని ట్రాప్ లో… చిన్న పిల్లలు చూడకూడని సై-ఫై మూవీ

OTT Movie : కంటికి కన్పించని అబ్బాయితో ప్రేమ… డైరీనే దిక్కు… మస్ట్ వాచ్ మలయాళ అడ్వెంచర్ డ్రామా

OTT Movie :లేడీ డ్రైవర్ తో లేకి పనులు… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సస్పెన్స్ థ్రిల్లర్… డోంట్ మిస్

Big Stories

×