E-Paper
Advertisement

చేతికి కట్టుతో కనిపించిన హీరో సిద్ధార్థ్.. వీడియో వైరల్!

చేతికి కట్టుతో కనిపించిన హీరో సిద్ధార్థ్.. వీడియో వైరల్!
Advertisement

Siddharth: వినూత్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే హీరో సిద్ధార్థ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. కామెడీ పండించడంలో, ఎమోషన్ ను ఎలివేట్ చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా.. అంతలా తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకునే ఈయన.. సడన్గా సైలెంట్ గా ఒక సరికొత్త నెట్ ఫ్లిక్స్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కార్గిల్ యుద్ధ నేపథ్యంలో రాబోతున్న ఈ సరికొత్త వెబ్ సిరీస్ పేరు ఆపరేషన్ సఫేద్ సాగర్. 1999లో జరిగిన కార్గిల్ వార్ ఆధారంగా వస్తున్న ఈ సిరీస్ కి ఓనీ సేన్ దర్శకత్వం వహించారు. జూలై 21వ తేదీన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ ను ముంబై వేదికగా ఘనంగా నిర్వహించారు.

చేతికి కట్టుతో కనిపించిన సిద్ధార్థ్..

ఈ కార్యక్రమానికి హాజరైన సిద్ధార్థ్.. చేతికి కట్టుతో కనిపించేసరికి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు సిద్ధార్థ్ కి ఏమైంది ?అంటూ కంగారుపడుతున్నారు. ఇకపోతే హీరో సిద్ధార్థ్ చేతికి గాయం ఎలా తగిలింది? అనే విషయంపై ఎటువంటి సమాచారం లేదు. కాకపోతే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో స్టేజ్ పై ఆయన కన్నీటి పర్యంతమవుతూ కనిపించిన తీరు అభిమానులను సైతం కంటతడి పెట్టించింది. మరి సిద్ధార్థ్ కన్నీళ్లు పెట్టుకోవడం వెనుక అసలు ఏం జరిగింది? ఆ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఆయనను కన్నీళ్ళకు గురిచేసిన ఆ సందర్భం ఏమిటి? అనే విషయం ఇప్పుడు చూద్దాం..

Advertisement

also read:కొత్త ప్రాజెక్టుతో కళ్యాణ్ రామ్.. డైరెక్టర్ ఎవరంటే?

స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సిద్ధార్థ్..

నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో దివంగత స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహుజా భార్య అల్కా అహుజా కూడా ట్రైలర్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈమె వేదికపైకి రాగానే ప్రేక్షకులంతా గౌరవ సూచకంగా ఆమెకు మర్యాద ఇస్తూ లేచి నిలబడ్డారు. తన భర్త కథను తెరపైకి తీసుకు వస్తున్నందుకు నిర్మాతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడిన మాటలు సిద్ధార్థ్ ను కదిలించాయి. దీంతో ఆయన కన్నీళ్లు ఆపుకోలేక వేదికపైనే కన్నీటిపర్యంతమయ్యారు. ముఖ్యంగా ఈ సీరిస్ పై నమ్మకం ఉంచినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేశారు సిద్ధార్థ్.

ఆమె అనుమతి తప్పనిసరి..

Advertisement

ఇక అనంతరం ఆయన మాట్లాడుతూ..” నిజ జీవిత వీరుడి పాత్రను పోషించడానికి మొదట నేను వెనకడుగు వేశాను. మన మధ్య లేని వారి పాత్రను, ఒక అమరవీరుని పాత్రను పోషించడం అంటే మనపై చాలా బాధ్యత ఉంటుంది. హీరోలు ఎప్పుడూ హీరోలాగా కనిపించరు. వారి చర్యల వల్లే హీరోలవుతారు. ఈ ప్రాజెక్టు అంగీకరించే ముందు నేను ఈ సిరీస్ నిర్మాతలతో చాలా సార్లు చర్చించాను. ఆయన భార్య అల్కా దీనికి అనుమతించారా? అని.. ఆమె అనుమతి ఈ వెబ్ సిరీస్ కు చాలా ముఖ్యమని మేకర్స్ తో చెప్పానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇక ప్రస్తుతం సిద్ధార్థ్ చేసిన ఈ కామెంట్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

విశ్వక్ సేన్ ‘లెగసీ’.. ఈసారి రాజకీయాలతో రచ్చ చేయబోతున్నాడా?

మీర్జాపూర్‌కు పిచ్చ క్రేజ్.. రెండో రోజు కలెక్షన్స్ చూస్తే షాక్

జగమే సంగీతం పై చిరు ప్రశంసలు… చాలా గర్వంగా ఉందంటూ పోస్ట్!

గన్స్.. గ్రేహౌండ్స్.. మధ్యలో శ్రీవిష్ణు.. ‘కామ్రేడ్ కళ్యాణ్’ టీజర్ ఎలా ఉందంటే!

సుమలత క్షమాపణలు చెప్పాలి.. ఫెడరేషన్ కు శేఖర్ మాస్టర్ ఫిర్యాదు!

ఫ్యాన్స్ గెట్ రెడీ…బాలయ్య NBK 111 టైటిల్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్!

ఆదర్శ కుటుంబం విడుదలపై నాగ వంశీ క్లారిటీ.. ఒకేసారి ఇన్ని అప్డేట్స్ ఏంటీ చింటూ!

పారడైస్ స్టోరీ ఇదేనా ? ఇదే ఐతే కష్టమే మరి !

Big Stories

Advertisement
×