Hyundai Grand i10 Nios Price Hike: హ్యుందాయ్ కార్లు కొనుగోలు చేయాలనుకునే వారికి కంపెనీ మరో షాకిచ్చింది. తన కార్లకు సంబంధించి కొన్ని మోడళ్ల ధరలను పెంచింది. ఈ పెంపు వెంటనే అమల్లోకి వచ్చాయి. ఇందులో భాగంగా గ్రాండ్ i10 నియోస్, i20 మోడళ్ల ధరలు కూడా పెరిగాయి. ఇప్పటికే i20 ధరల పెంపు వివరాలను వెల్లడించగా, ఇప్పుడు గ్రాండ్ i10 నియోస్ కొత్త ధరల వివరాలు చూద్దాం.
హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్‌లోని కొన్ని వేరియంట్ల ధరలు మాత్రమే కాకుండా, దాదాపు అన్ని మోడళ్ల ధరలు పెరిగాయి. ముఖ్యంగా స్పోర్ట్జ్ CNG MT (Sportz CNG MT), మాగ్నా CNG MT (Magna CNG MT) వేరియంట్లపై ఒక్కొక్కటి రూ.6,000 చొప్పున పెంచింది. అయితే, ఈ కారు ఎంట్రీ లెవల్ వేరియంట్ అయిన ఎరా పెట్రోల్ MT (Era Petrol MT) ధరలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. పాత ధరనే కొనసాగిస్తోంది. తక్కువ బడ్జెట్ లో గ్రాండ్ i10 నియోస్ కొనాలనుకునే వారికి ఇది కొంత ఊరటనిచ్చే అంశం.
CNG వేరియంట్లను మినహాయిస్తే, గ్రాండ్ i10 నియోస్ శ్రేణిలోని మిగిలిన వేరియంట్ల ధరలు ఒక్కొక్కటి రూ.4,700 పెరిగాయి. ఈ పెంపుతో కారు కొనుగోలుదారులు గతంలో కంటే కొంత ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. తాజా ధరల పెంపు తర్వాత హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ ఎక్స్-షోరూమ్ ధరలు రూ.5.60 లక్షల నుంచి రూ.8.09 లక్షల మధ్య ఉన్నాయి. ఈ హ్యాచ్‌బ్యాక్ మార్కెట్‌లో టాటా టియాగోతో పోటీ కొనసాగిస్తోంది.
మరోవైపు హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ విషయంలో ఇంకో ఆసక్తికరమైన అప్‌డేట్ కూడా ఉంది. ఈ కారు తర్వాతి తరం మోడల్‌ను భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు కంపెనీ ఇప్పటికే కన్ఫార్మ్ చేసింది. న్యూ జెనరేషన్ మోడల్ లో డిజైన్, ఫీచర్లు, ఇతర మార్పులపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి మాత్రం గ్రాండ్ i10 నియోస్ కొనుగోలు చేయాలనుకునేవారు తాజా ధరల పెంపును దృష్టిలో ఉంచుకోవాలి. ముఖ్యంగా CNG వేరియంట్లు కొనాలనుకునే వారు కొత్త ధరలను పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది.
Read Also: టయోటా ఫార్చ్యూనర్ ధరలు భారీగా పెంపు.. ఏ వేరియంట్‌పై ఎంత పెరిగిందంటే?