Isha Koppikar:ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఎక్కువగా విడాకుల బాట పడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.. వివాహమైన కొన్ని నెలలకే కొంతమంది విడాకులు తీసుకుంటే.. మరికొంతమంది సంవత్సరాల తరబడి వైవాహిక బంధంలో సంతోషంగా ఉండి.. చివరికి విడాకులు తీసుకొని అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక హీరోయిన్ ప్రేమ వివాహం చేసుకొని, 14 ఏళ్ల పాటు వైవాహిక బంధంలో సంతోషంగా కొనసాగి, ఇప్పుడు తన భర్తకు విడాకులు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.. ఆమె ఎవరో కాదు నాగార్జున (Nagarjuna) హీరోగా నటించిన ‘చంద్రలేఖ’ సినిమాలో నటించిన ఇషా కొప్పికర్(Isha Koppikar). అంతకుముందు 1997లో తెలుగు చిత్రం ‘W/o వి. వర ప్రసాద్’ తో టాలీవుడ్ కి పరిచయం అయింది.
14 ఏళ్ల ప్రేమ వైవాహిక బంధానికి హీరోయిన్ ముగింపు..
ఎక్కువగా హిందీ సినిమాలలో నటించే ఈమె.. ఫిజా, ప్యార్ ఇష్క్ ఔర్ మొహబ్బత్ , రుద్రాక్ష్, హమ్ తుమ్, దిల్ కా రిష్టా, ఇంతేకం : ది పర్ఫెక్ట్ గేమ్, కృష్ణ కాటేజ్ వంటి పలు చిత్రాలలో నటించి అటు బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరయింది. కెరియర్ పరంగా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో టిమ్మీ నారంగ్ (Timmy Narang)తో అప్పటికే ప్రేమలో ఉన్న ఈమె అతడిని వివాహం చేసుకుంది. అయితే ఇప్పుడు మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. వీరిద్దరికి ఒక అమ్మాయి కూడా ఉంది. 14 సంవత్సరాల వైవాహిక జీవితానికి ఇలా ముగింపు పలకాల్సి వచ్చిందని, ఈ నిర్ణయం కఠినమైనదే కానీ అవసరమైంది అంటూ ఇషా తెలిపింది.
అందుకే విడాకులు తీసుకున్నాను – ఇషా కొప్పికర్
ఇక విడాకుల విషయంపై ఇషా మాట్లాడుతూ టిమ్మి నుండి విడిపోవడానికి కారణాలు అడిగితే.. నేను ఒకరిని నిందించను. విడిపోవడానికి టిమ్మీ కారణమని, ఇద్దరి మధ్య అనుబంధం పనిచేయడం లేదు అని , విడాకులను తిరస్కరించడం అంతా సులభం ఏమీ కాదు అని, కానీ ఆలోచనలు, విలువలకు ప్రాధాన్యతనిస్తూ విడాకులు ప్రకటించడం జరిగింది అని ఇషా కొప్పికర్ తెలిపింది. ఇకపోతే ఈ విడాకుల విషయాన్ని తన కూతురికి చెప్పినప్పుడు ఆమె నిరాశ వ్యక్తం చేసిందని, కానీ అతడు బాధ్యతారహితంగా ప్రవర్తించడం వల్లే తప్పక విడాకులు ప్రకటించాము అంటూ తెలిపింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఇషా కొప్పికర్ విడాకులు ప్రకటించడంతో అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇషా కొప్పికర్ – టిమ్మీ నారంగ్ ప్రేమ, పెళ్లి..
ఇక వీరిద్దరి విషయానికి వస్తే.. జిమ్ లో ప్రేమలో పడిన ఈ జంట నవంబర్ 2009లో వివాహం చేసుకున్నారు. ముఖ్యంగా వీరు డేటింగ్ ప్రారంభించడానికి ముందు.. మూడు సంవత్సరాలుగా ఒకరికొకరు తెలుసుకోవడం జరిగింది. వివాహం తర్వాత జూలై 2014లో వీరికి రియానా అనే అమ్మాయి జన్మించింది. ఇలా వైవాహిక బంధంలో ఎంతో సంతోషంగా ఉన్న ఈ జంట ఇప్పుడు విడాకులు ప్రకటించడం అభిమానులనే కాదు సినీ సెలెబ్రిటీలను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ALSO READ:Heroine Poonam: శ్రీదేవిపై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.. అదంతా కుట్రే అంటూ!