దేశం, ప్రాంతం, కుల మతాలను బట్టి ఆచారాలు ఉంటాయి. తెలుగువారిలో దగ్గర బంధువులను వివాహం చేసుకుని ఆచారం పూర్వం నుంచి ఉంది. మేనమామ వరసయ్యే వ్యక్తులను బావ వరసయ్య వ్యక్తులను అమ్మాయిలకు ఇచ్చి పెళ్లి చేస్తారు. ప్రతి దేశంలో కూడా ఇలాంటివి కొన్ని ఆచారాలు ఉన్నాయి. అయితే ఐస్లాండ్ దేశంలో మాత్రం దగ్గర బంధువులను పెళ్లి చేసుకునేందుకు, ప్రేమించేందుకు ఇష్టపడరు.
ఎందుకు పెళ్లిచేసుకోరు?
ఐస్లాండ్ దేశం పేరు చెబితేనే అందమైన ప్రకృతి, అగ్నిపర్వతాలు గుర్తొస్తాయి. ప్రపంచంలో ప్రత్యేకమైన చిన్న దేశాల్లో ఐస్లాండ్ కూడా ఒకటి. దాని జనాభా చాలా తక్కువ మంది. అయితే ఈ జనాభాలో ఎక్కువమంది దాదాపు ఒకే పూర్వీకుల నుంచి వచ్చారు. అంటే వారి జన్యువుల మధ్య మ్యుటేషన్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఐస్లాండ్ లోని ప్రజలు తమకు దగ్గర బంధువులను పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడరు. దీనివల్ల వంశపారంపర్యంగా వచ్చే కొన్ని రకాల వ్యాధులు పిల్లలకు వచ్చే అవకాశం ఉందని వారు భయపడుతూ ఉంటారు.
డీఎన్ఏ డేటాబేస్ తో
ఒక వ్యక్తి తమకు దగ్గర బంధువా కాదో తెలుసుకునేందుకు కూడా వారు డిఎన్ఏ టెస్టును చేసుకుంటారు. ఐస్లాండ్ దేశం సపోర్ట్ మెకానిజంను కూడా అభివృద్ధి చేసింది. అంటే ఒక జన్యు డేటాబేస్ ను అభివృద్ధి చేసింది. ఇందులో ప్రతి పౌరుడి డీఎన్ఏ కు సంబంధించి ఖచ్చితమైన సమాచారం ఉంటుంది. దీనిని ఎవరైనా యాక్సెస్ చేయవచ్చు. తమ డిఎన్ఏ తో ఎవరికి దగ్గర బంధుత్వం ఉందో తెలుసుకోవచ్చు.
ఇద్దరు వ్యక్తులు ప్రేమలో పడినప్పుడు వారి మధ్య డిఎన్ఏ పోలిక ఎలా ఉందో తెలుసుకునేందుకు వారు జన్యు డేటా బేస్ ను సెర్చ్ చేస్తారు. తమ జన్యు సంబంధం దగ్గరగా ఉంటే వెంటనే ఆ సంబంధాన్ని ముగిస్తారు. లేకుంటే పుట్టే పిల్లలకు రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని భయపడతారు.
వంశపారంపర్యంగా వచ్చే ఆరోగ్య సమస్యల్లో తీవ్రమైనది క్యాన్సర్. అందుకే ఐస్లాండ్ ప్రజలు జన్యుడేటా బేస్ ను ఫాలో అవుతారు. వ్యక్తిగత వంశపారంపర్య వ్యాధులను నివారించేందుకు ఈ పద్ధతి ఎంతో మంచి ఫలితాలను ఇస్తున్నట్టు ఐస్లాండ్ అధికారులు కూడా చెబుతున్నారు.
ఐస్లాండ్ చాలా తక్కువ జనాభా కలిగి ఉన్న దేశం. అందుకే జన్యు సమూహం కూడా తక్కువగానే ఉంటుంది. జన్యు డేటాబేస్ లో ఉన్న సమాచారాన్ని బట్టి అక్కడ వారికి అర్థమవుతుంది. అంటే జన్యువులు అక్కడ ఉన్న తక్కువ జనాభాలోనే మ్యుటేషన్ చెందుతూ ఉన్నాయి. కాబట్టి తమను తాము పునరుద్ధరించుకోలేకపోతున్నాయి.
కొత్త వ్యక్తులతో కలిసి నప్పుడే పిల్లల్లో కొత్త డిఎన్ఏ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ దాదాపు ఒక ఇలాంటి జన్యువుల నుంచి వచ్చిన పౌరుల మధ్య పుట్టిన పిల్లలు కూడా అదే జన్యువులతో జన్మిస్తున్నారు. వంశపారంపర్య వ్యాధులు వచ్చే అవకాశం వారిలో ఎక్కువ అయిపోతుంది. మరి దగ్గర డిఎన్ఏ సంబంధం కలిగి ఉన్న వారిని పెళ్లి చేసుకోవడానికి దాన్ని నివారించేందుకే ఈ జన్యు డేటాబేస్ ను ఐస్లాండ్ లోని వ్యక్తులు ఫాలో అవుతున్నారు. ఇది నిజానికి ఎంతో మంచి పద్ధతి కూడా.
ఇప్పటికీ మనదేశంలో మేన భావను, మేనమామను కూతురికిచ్చి పెళ్లి చేసే సంప్రదాయం ఉంది. దీనివల్ల పుట్టే పిల్లల్లో చాలామందికి మానసికమైన సమస్యలు వస్తున్నాయి. నిజానికి ఇలా దగ్గర మేనరిక సంబంధాలు చేసుకోవడం ఏ మాత్రం మంచిది కాదు. పుట్టే పిల్లలు ఇబ్బందులు పాలు అయ్యే అవకాశం ఎక్కువ.