E-Paper
Advertisement

జగదాంబ థియేటర్ కథ ఇదే.. వైజాగ్ సినిమా కల్చర్‌కు ఎలా ఐకాన్ అయింది?

జగదాంబ థియేటర్ కథ ఇదే.. వైజాగ్ సినిమా కల్చర్‌కు ఎలా ఐకాన్ అయింది?
Advertisement

Jagadamba Theatre History:”అరేయ్ నీవంత పోటుగాడివి అయితే జగదాంబ జంక్షన్ లో తేల్చుకుందాం రారా”..అంటూ సినిమాల్లో హీరోవిలన్ లు సవాళ్ళు విసురుకోవడం మనం చూస్తూనే ఉంటాం .మరి వైజాగ్ లో ఉన్న ఆ జగదాంబ జంక్షన్ కి అంతటి గొప్ప పేరుని తీసుకొచ్చిన జగదాంబ థియేటర్ విశేషాలేంటో, అసలు ఆ థియేటర్ పుట్టు పూర్వోత్తరాలేంటో మనమూ ఒకసారి చూసేద్దాం.

వైజాగ్ లో కైలసగిరి,సింహాచలం, బీచ్ ఇలా ఎన్ని ఉన్నా జగదాంబ జంక్షన్ పేరు మాత్రం ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఈ జంక్షన్ లో ఉన్న జగదాంబ కి ఉన్న క్రేజ్ అలాంటిది మరి. నిజానికి ఈ జగదాంబ థియేటర్ పెట్టకముందు ఈ జంక్షన్ ని ”ఎల్లమ్మ తోట” అని పిలిచేవారట.ఇక ఏ ముహుర్తాన ఈ జంక్షన్ లో జగదాంబ వచ్చి చేరిందో అప్పటి నుండి అది జగదాంబ జంక్షన్ గా మారిపోయిందట.

Advertisement

దీనికి పెద్ద చరిత్రే ఉందండోయ్

ఈ జగదాంబ థియేటర్ విషయానికి వస్తే దీనికి పెద్ద చరిత్రే ఉందండోయ్.అవును..అది 1970ల కాలం నాటి మాట మరి.వైజాగ్ లో ”వేగి భద్రాచలం” అనే పెద్దమనిషి ఉండేవారు.ఆయన్ని అక్కడి వారు ‘రాంబాబు’ అనే మరో పేరు తో పిలిచేవారు.ఆయన కూరగాయల వ్యాపారం చేసేవారు.ముఖ్యంగా ఆయన బిజినెస్ లో ఉల్లి గడ్డలు, ఆలు గడ్డ(బంగాళ దుంపలు)ముఖ్యంగా హోల్ సేల్ గా అమ్మేవారట. అయితే ఆయనకీ విపరీతమైన సినిమా పిచ్చి ఉండటంతో సినిమాలని తీసికొని రామకృష్ణ అనే థియేటర్ లో సినిమాలు వేస్తూ ఉండేవారు.ఒక పక్క వెజిటేబుల్ వ్యాపారం చేస్తూనే, మరో వైపు సినిమా ఎగ్జిబిషన్ రంగంలో ఉన్నారన్న మాట.

Advertisement

మన వైజాగ్ లో ఎందుకు ఉండొద్దు

అయితే ఒకరోజు పనిమీద మద్రాస్ వెళ్ళిన భద్రాచలం కి అక్కడ ఉన్న” సఫైర్ థియేటర్” పిచ్చపిచ్చగా నచ్చిందట.ముఖ్యంగా అందులోని స్క్రీన్ ,సిట్టింగ్, అట్మాస్ఫియర్ అంతా చూసి ఫిదా అయిపోయాడట భద్రాచలం.ఇంకేం ఇలాంటి థియేటర్ మన వైజాగ్ లో ఎందుకు ఉండొద్దు అంటూ అప్పుడే ఫిక్స్ అయిపోయాడట.

ఇక వైజాగ్ రావడం రావడమే ఏకంగా 4,200 చదరపు గజాల స్థలాన్నికొనేసి, చెన్నై(అప్పటి మద్రాస్)లో ఫేమస్ ఆర్కిటెక్ట్ అయినటువంటి’ k.n శ్రీనివాసన్’ తో ఇప్పుడు మనం చూస్తున్న జగదాంబ థియేటర్ కి శ్రీకారం చుట్టాడట.మరింతకీ ఇంత ఫేమస్ అయిన జగదాంబ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా..? భద్రాచలం కి తన తల్లి అయినటువంటి జగదాంబ చాలా ఇష్టం.అందువల్లే తను ఇష్టంగా కట్టుకున్న ఈ థియేటర్ కి తన తల్లి పేరు వచ్చేలా ‘జగదాంబ’ అని పెట్టుకున్నాడని తెలుస్తుంది.

ఏకంగా 1200 వందల మంది ఒకేసారి

ఇక చూస్తుండగానే సినిమా థియేటర్ నిర్మాణం పూర్తయింది.కట్టినప్పుడే ఈ హల్లో ఏకంగా 1200 వందల మంది ఒకేసారి కూర్చునేట్టుగా సిట్టింగ్ కెపాసిటీని,అలాగే 70MM భారీ స్క్రీన్ ,దీనితో పాటు అప్పట్లో చాలా రేర్ గా ఉన్నటువంటి స్టీరియోఫోనిక్ సౌండ్ సిస్టం ని కూడా ఈ థియేటర్ లో ఏర్పాటు చేశాడంటే భద్రాచలం ఆలియాస్ రామారావుకి సినిమా పట్ల ఎంత ప్యాషన్ ఉందొ అర్థం అవుతుంది.

ఇక ఇప్పుడంటే కొన్ని వేల తెలుగు సినిమాలు ఈ థియేటర్ లో ప్రదర్శించారు కాని,మొట్టమొదటిసారిగా ఈ సినిమా హల్లో వేసిన సినిమా ఏంటో తెలుసా ..? అదే “Where Eagles Dare” అనే హాలీవుడ్ సినిమా.అవును ఎన్నో వేల తెలుగు సినిమాలు ఆడిన ఈ థియేటర్ లో మొదటి సారిగా ఒక ఇంగ్లీష్ సినిమాని స్క్రీనింగ్ చేయడం విశేషం. అయితే భద్రాచలం ఆలియాస్ రామారావు కి ఉన్న హాలీవుడ్ సినిమాల పిచ్చివల్ల అందులో మొదట్లో ఎక్కువగా Ben-Hur, The Ten Commandments, Guns of Navarone, Mackenna’s Gold, Indiana Jones వంటి హాలీవుడ్ సినిమాలే వేసేవారట.

పది వారాల పాటు ఆడిన జురాసిక్ పార్క్

ఆ క్రమంలోనే ఇందులో వేసిన జురాసిక్ పార్క్ ఏకంగా పది వారాల పాటు ఆడిందంటే థియేటర్ ఆడియన్స్ ని ఎంతలా అలరించిందో అర్థం చేసుకోవచ్చు.ఇక మెల్లిగా హాలీవుడ్ నుండి హిందీ సినిమాల వైపు మససు పారేసుకున్న జగదాంబ ‘షోలే’ వంటి ప్రముఖ సినిమాలని కూడా స్క్రీనింగ్ చేయడం విశేషం.

ఇక అప్పటి వరకు ఇలాంటి హై టెక్నాలజీ ఉన్న థియేటర్ వైజాగ్ చుట్టుపక్కలనే కాదు ,ఉత్తరాంద్రలోనే లేకపోవడం తో జనాలంతా తండోపతండాలుగా ఈ థియేటర్ కి వచ్చేవారట. ముఖ్యంగా ఇందులో ఉన్నస్టీరియోఫోనిక్ సౌండ్ సిస్టం ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసిందట.

జగదాంబ థియేటర్ ఒక ఉత్సవం జరిగే ఆలయం

ఇంకేం జనాల జాతరతో వైజాగ్ రూపు రేఖలు మారిపోయాయి.క్రమంగా జనాల రాకతో జగదాంబ థియేటర్ ”ఒక ఉత్సవం జరిగే ఆలయం” గా మారిపోయింది. ఎల్లమ్మ తోట అని పిలుచుకునే జంక్షన్ కాస్తా థియేటర్ మూలానా జగదాంబ జంక్షన్ గా మారిపోయింది.క్రమక్రమంగా వైజాగ్ కి అదొక ల్యాండ్ మార్క్ గా మిగిలిపోయింది.

ఇక హిందీ సినిమాలే కాదండోయ్ ..అభిమానుల కోరిక మేరకు తెలుగు సినిమాలని కూడా ఇందులో వేయడం మొదలెట్టారుఅలా వేసిన శివ, ఘరానా మొగుడు,కొండవీటి దొంగ, ప్రేమించుకుందాంరా వంటి సినిమాలు ఎన్నో రికార్డులు తమ ఖాతాలో వేసుకున్నాయి కూడా.

2012లోనే థియేటర్ లో 4K ప్రొజెక్షన్

ఇక కాల క్రమంలో సినిమా టెక్నాలజీ ,మారుతుండటంతో 2012లోనే థియేటర్ లో 4K ప్రొజెక్షన్ ని ఏర్పాటు చేశామని ఒక సందర్బంలో రాంబాబు కుమారుడు జగదీశ్ కుమార్ చెప్పుకొచ్చారు. ఇక క్రమమంగా అదే కాంప్లెక్స్ లో శారద, రామాదేవి థియేటర్లతో పాటు వీడియో గేమ్స్ హాల్ రావడంతో జంక్షన్ మరింతగా అభివృద్ధి వైపు అడుగులు వేసింది.ఇక ఇప్పటికీ వైజాగ్ లో మొదటి మల్టీఫ్లెక్స్ థియేటర్ కాంప్లెక్స్ ఏదంటే టక్కున వినిపించే పేరు జగదాంబ.

వైజాగ్ వాసుల గుండెల్లో  చెరగని ముద్ర

ఇక 54ఏళ్ళు పూర్తయిన సందర్బంగా 2024లో ఘనంగా ఈ థియేటర్ వార్షికోత్సవం జరుపుకుంది కూడా. ఏది ఏమైనా ఎన్ని ఏళ్ళు గడిచినా ఇప్పటికీ వైజాగ్ లో సినిమా అంటే ఇప్పటికీ అందరి నోట్లో వినిపించే మొదటి పేరు జగదాంబ కావడం అంటే ఈ థియేటర్ వైజాగ్ వాసుల గుండెల్లో ఎంతటి చెరగని ముద్ర వేసిందో అర్థమవుతుంది !

Tags

Related News

రవితేజకు విలన్ గా టాలీవుడ్ స్టార్.. క్రేజీ కాంబో సెట్ చేసిన వివేక్ ఆత్రేయ!

రామాయణ షూటింగ్ సెట్లో అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?

విశ్వంభర రిలీజ్ డేట్ లాక్.. ఈసారైనా టైంకి వస్తుందా?

హిట్ లేకుండా స్ట్రగుల్.. ‘రణబాలి’తో గేమ్ మారుతుందా?

‘జైలర్ 2’ ట్రైలర్ ఆగయా…ఈ సారి న‌లుగురు హీరోల‌తో మాస్ జాత‌ర‌

400 కోట్ల కలెక్షన్స్ ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్ రిలీజ్..ఎలా ఉందంటే?

‘ఆదర్శ కుటుంబం’ వాయిదాపై స్పందించిన నిర్మాత నాగవంశీ!

Big Stories

Advertisement
×