E-Paper
Advertisement

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న నూక రాజు.. రాంప్రసాద్ ను మించిన రెమ్యూనరేషన్!

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న నూక రాజు.. రాంప్రసాద్ ను మించిన రెమ్యూనరేషన్!
Advertisement

Bigg Boss 10 wild card: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రియాలిటీ షో ప్రారంభమై నెల రోజులు పూర్తి అయింది. ఇలా నాలుగు వారాల పాటు కొనసాగిన ఈ కార్యక్రమంలో భాగంగా నలుగురు కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే బిగ్ బాస్10(Bigg Boss 10) హౌస్ లోకి వైల్డ్ కార్డు (Wild Card) ఎంట్రీస్ ద్వారా కొంతమంది అడుగు పెట్టబోతున్నట్లు తెలిసిందే .ఈ వైల్డ్ కార్డు ఎంట్రీస్ వీకెండ్ లో ఉండబోతున్నాయని సమాచారం. అయితే వైల్డ్ కార్డు ఎంట్రీస్ గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి.

బిగ్ బాస్ హౌస్ లోకి మరో జబర్దస్త్ కమెడియన్…

వైల్డ్ కార్డు ద్వారా పలానా వ్యక్తులు హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు అంటూ వార్తలు హల్చల్ చేశాయి అయితే ఈ వైల్డ్ కార్డులో భాగంగా మరో జబర్దస్త్ కమెడియన్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే జబర్దస్త్ కార్యక్రమం నుంచి ఆటో రాంప్రసాద్ అలాగే నాటీ నరేష్ కంటెస్టెంట్లుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే మరొక కమెడీయన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నట్టు సమాచారం. మరి ఆ కమెడియన్ ఎవరు? ఏమిటి? అనే విషయానికి వస్తే..

వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్న నూకరాజు..

Advertisement

బిగ్ బాస్ 10 వైల్డ్ కార్డ్ ఎంట్రీలో భాగంగా జబర్దస్త్ కార్యక్రమం నుంచి కమెడియన్ నూకరాజు (Nukaraju) హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తుంది. జబర్దస్త్ వేదికపై తన కామెడీతో ఎంతో మంది అభిమానులను మెప్పించిన నూకరాజు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అవకాశాన్ని అందుకున్నారని సమాచారం. జబర్దస్త్ (Jabardasth)కార్యక్రమంలో ఇమ్మాన్యూయేల్ కు ఎలాంటి క్రేజ్ ఉందో నూకరాజు కూడా అంతే క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈయన కూడా బిగ్ బాస్ ద్వారా ఇకపై ప్రేక్షకులను సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం నూకరాజు తీసుకోబోతున్న రెమ్యూనరేషన్ కి సంబంధించిన వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి.

భారీ స్థాయిలో రెమ్యూనరేషన్..

నూకరాజు బిగ్ బాస్ 10 కార్యక్రమంలో పాల్గొనడం కోసం భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఈ రియాలిటీ షోలో భాగంగా ఈయన ఆటో రామ్ ప్రసాద్(Auto Ramprasad) ను మించిన రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ రియాలిటీ షోలో భాగంగా కంటెస్టెంట్ గా పాల్గొన్న ఆటో రాంప్రసాద్ ఒక వారానికి 3.5 నుంచి 4 లక్షల రూపాయలు అందుకోబోతున్నట్లు సమాచారం అయితే నూకరాజు ఆటో రామ్ ప్రసాద్ ని మించిన రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మరి నిజంగానే నూకరాజు వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారా? అందరికంటే హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఈయన అందుకోబోతున్నారా? అనే వివరాలు తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి ఉండాలి.

Advertisement

Also Read: రవితేజకు విలన్ గా టాలీవుడ్ స్టార్.. క్రేజీ కాంబో సెట్ చేసిన వివేక్ ఆత్రేయ!

Related News

“బిందెల బిందెలు బావయ్యో”.. మరో ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన మాధురీ రాథోడ్!

పండును ఈ పరిస్థితుల్లో చూస్తే కన్నీళ్లు ఆగవు.. మళ్లీ డ్యాన్స్ చేయగలడా? రికవరీకి ఎంత టైమ్?

బిగ్ బాస్ 10 5వ వారం నామినేషన్ లిస్ట్.. డేంజర్ జోన్ లో ఆ ఇద్దరే!

Nindu Noorella Saavasam Serial Today Episode October 6th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మనోహరి, పార్థును చంపకుండా అమర్ అడ్డుకుంటాడా..? 

Karthika Deepam 2 Serial Today Episode October 6th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ తో జ్యోత్స్న పెళ్లి చేస్తానన్న దీప              

హేటర్స్ కి అనసూయ దిమ్మతిరిగే రియాక్షన్!

బిగ్ బాస్ 10లో నామినేషన్స్ సెగలు.. ఆమెపై విరుచుకుపడ్డ కంటెస్టెంట్స్!

Big Stories

Advertisement
×