Bigg boss 9 telugu: బిగ్ బాస్ (Bigg Boss) రియాల్టీ షో.. ఇప్పటికే పలు భాషల్లో స్ట్రీమింగ్ అవుతూ ఎన్నో సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాల్టీ షో.. తెలుగులోకి కూడా తీసుకువచ్చారు. అలా తెలుగులో ఇప్పటికే 8 సీజన్లు సక్సెస్ఫుల్ గా పూర్తయ్యాయి. తొమ్మిదో సీజన్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. ఇక బిగ్ బాస్ రియాల్టీ షో స్టార్ట్ అయిన ప్రతిసారి ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటుంది.ఈ షోని బ్యాన్ చేయాలని ఇప్పటికే సిపిఐ నారాయణ (CPI Narayana) వంటి వాళ్లు షోపై కేసులు వేసినా కూడా.. ఈ రియాలటీ షో కి ఎండ్ కార్డ్ పడడం లేదు. ఇక సీజన్ 9 త్వరలోనే స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో మళ్లీ ఈ సీజన్ కి కూడా నాగార్జున (Nagarjuna)నే హోస్ట్ అని తెల్చేశారు.
బిగ్ బాస్ 9 పై పెరుగుతున్న అంచనాలు..
అయితే ఇప్పటికే 8 సీజన్లు సక్సెస్ఫుల్గా పూర్తయినప్పటికీ.. 9వ సీజన్ మాత్రం కాస్త స్పెషల్ గా తీసుకురావాలని బిగ్ బాస్ మేకర్స్ ఆలోచన చేస్తున్నారట. బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రక్రియ, టాస్కులు ప్రతి ఒక్కటి చాలా భిన్నంగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్ మొదటి వారంలో స్టార్ట్ అవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్న వేళ బిగ్ బాస్ 9 (Bigg Boss 9)పై సోషల్ మీడియాలో భారీ అంచనాలు ఉన్నాయి. దానికి కారణం సీజన్ 9 చాలా డిఫరెంట్ గా ఉంటుందనే టాక్ రావడమే.
బిగ్ బాస్ 9 లో సరికొత్త రూల్స్..
బిగ్ బాస్ సీజన్ 9 ఎలిమినేషన్ ప్రక్రియని అన్ని సీజన్ల కంటే ఇప్పుడు కాస్త భిన్నంగా తీసుకు రాబోతున్నారట. అలాగే సామాజిక పరిపక్వత, మానసిక ధైర్యం వంటి అంశాలు ఎక్కువగా ఉండేటటువంటి టాస్కులనే ఈ సీజన్ 9 లో తీసుకు రాబోతున్నారట. అలాగే గత సీజన్లో ఉన్న సీక్రెట్ రూమ్, వైల్డ్ కార్డు ఎంట్రీ వంటి వాటిని పక్కన పెట్టి గేమ్ ని సరికొత్తగా మార్చబోతున్నారట.. వీటి స్థానంలో మైండ్ గేమ్ ని ఉంచి షోపై ప్రేక్షకులకు ఆసక్తి పెరిగేలా చేయాలని మేకర్స్ ఆలోచన చేస్తున్నారట. ఇంటెన్సీ డ్రామా, మైండ్ గేమ్ వంటి వాటిపై సీజన్ 9 లో ఎక్కువ ఫోకస్ ఉంటుందని తెలుస్తోంది.
బిగ్ బాస్ 9 ఫైనల్ కంటెస్టెంట్స్..
ఇక ఇప్పటికే బిగ్ బాస్ 9 లోకి వెళ్లే కంటెస్టెంట్ల లిస్ట్ కూడా ఫిక్స్ అయినట్టు కొంతమంది పేర్లు తెర మీద వినిపిస్తున్నాయి. అందులో ప్రముఖంగా నటుడు సాయికిరణ్(Sai Kiran), నవ్య స్వామి (Navya Swamy), కల్పిక గణేష్(Kalpika Ganesh), అలేఖ్య చిట్టి పీకిల్స్ సిస్టర్ లో ఒకరు, తేజస్విని గౌడ (Tejaswini Gouda), సుమంత్ అశ్విన్ (Sumanth Ashwin), దీపిక(Deepika),జ్యోతిరాయ్(Jyothi Rai) వంటి సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే ఈసారి సీజన్ 7లో లాగే కామన్ మ్యాన్ కి అవకాశం ఉందని నాగార్జున చెప్పారు.
కొత్త రూల్స్ వర్కౌట్ అవుతాయా?
దీంతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన కామన్ మ్యాన్ ని కూడా తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.ఇక ఇప్పటికే సీజన్ 9 కు సంబంధించిన ప్రోమో కూడా బిగ్ బాస్ ప్రియుల్లో ఆసక్తి పెంచడంతో.. సీజన్ 9 అంచనాలను మించి ఉంటుంది అనే టాక్ వినిపిస్తోంది.అయితే బిగ్ బాస్ 7 తర్వాత వచ్చిన 8 అంత ఆసక్తికరంగా లేదు. దీంతో షో మీద కాస్త నెగెటివిటీ వచ్చింది. అందుకే బిగ్ బాస్ 9 బాలేకపోతే మళ్లీ నెక్స్ట్ సీజన్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉండదు.అందుకే బిగ్ బాస్ సీజన్ 9 ని మేకర్స్ డిఫరెంట్ గా తీసుకురాబోతున్నారట. మరి ఇతర సీజన్లకు భిన్నంగా తీసుకు రాబోతున్న ఈ బిగ్ బాస్ 9 ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా.. ? ఈ డిఫరెంట్ రూల్స్ తో సీజన్ వర్కౌట్ అవుతుందా? అనేది ముందు ముందు తెలుస్తుంది.
also read:Ranya Rao: హీరోయిన్ అరెస్ట్.. ఏడాది పాటు జైలు శిక్ష!