War 2 Song Teaser: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ (NTR) విలన్ గా, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) హీరోగా రాబోతున్న చిత్రం ‘వార్ 2’. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara advani) హీరోయిన్గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య ఆగస్టు 14వ తేదీన సినిమా రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీనికి తోడు సినిమాపై అంచనాలు పెంచేలా ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ మధ్య ఒక డాన్స్ నెంబర్ ఉంటుంది అని, అది సినిమాకే హైలెట్గా నిలుస్తుంది అని నిర్మాతలు చెప్పుకొస్తున్న విషయం తెలిసిందే.
వార్ 2 నుంచి జనాబ్ ఈ అలీ సాంగ్ టీజర్ రిలీజ్..
అయితే ఇప్పుడు ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేయకుండా సాంగ్ టీజర్ ను మాత్రమే రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు మేకర్స్. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్.. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న ‘ జనాబ్ ఈ అలీ ‘ అనే సాంగ్ టీజర్ ను తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ టీజర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఎన్టీఆర్ ఇద్దరూ కూడా డాన్స్ లో ఐకాన్స్ గా పేరు సొంతం చేసుకున్నారు. అలాంటి ఇద్దరు డాన్స్ ఐకాన్స్ ఒకే స్టేజ్ పై కలిసి డాన్స్ చేయడం నిజంగా ఒక అద్భుతం అని చెప్పవచ్చు.
పోటీపడి మరీ డాన్స్ చేసిన ఎన్టీఆర్ – హృతిక్..
ఇద్దరు కూడా ఎవరికివారు తమ బాడీలను స్ప్రింగ్ లా వంచేస్తూ.. తమ అద్భుతమైన పర్ఫామెన్స్ తో పోటీపడి మరీ డాన్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇద్దరిలో ఎవరిని చూడాలో అర్థం కాక ఆడియన్స్ కూడా తెగ కన్ఫ్యూజన్లో పడిపోయారు . ఏది ఏమైనా ఈ ఒక్క టీజర్ చాలు సినిమాపై అంచనాలు పెంచడానికి అని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే తాజాగా విడుదలైన ఈ సాంగ్ టీజర్ ను థియేటర్లలోనే చూడాలి అని ఎన్టీఆర్ కూడా స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వార్ 2 సినిమా విశేషాలు..
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee) దర్శకత్వంలో .. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా (Adithya chopra) భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. ఇప్పటికే ఈ సినిమా థియేటర్లలో భారీ సక్సెస్ అవ్వడానికి అటు హీరోలతో పాటు ఇటు దర్శక నిర్మాతలు కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి తోడు ఆగస్టు 14వ తేదీన రజనీకాంత్ (Rajinikanth)కూలీ సినిమా కూడా విడుదల కాబోతోంది.. మరి రెండు బడా ప్రాజెక్టులు ఒకేరోజు తెరపైకి వస్తున్నాయి. ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద నంబర్ వన్ గా నిలుస్తుందో చూడాలి.
The dance WAR you’ve been waiting for is almost here. Here’s the tease… #JanaabeAali full song in theatres only! pic.twitter.com/iUgdEWZbJ1#War2 releasing in Hindi, Telugu and Tamil in cinemas worldwide on 14th August.@ihrithik | @advani_kiara | #AyanMukerji | @ipritamofficial…
— Jr NTR (@tarak9999) August 7, 2025
ALSO READ: Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!