E-Paper
Advertisement

కెటిఆర్‌కు కొండా సురేఖ క్షమాపణలు.. ఉద్దేశపూర్వకంగా అనలేదని క్లారిటీ ఇచ్చిన సురేఖ!

కెటిఆర్‌కు కొండా సురేఖ క్షమాపణలు.. ఉద్దేశపూర్వకంగా అనలేదని క్లారిటీ ఇచ్చిన సురేఖ!
Advertisement

Konda Surekha: గతంలో కేటీఆర్‌పై చేసిన కామెంట్స్‌పై ఆమె పశ్చాత్తాపం ప్రకటించారు. సారీ చెప్పారు. ఉద్దేశ్యపూర్వకంగా చేసిన కామెంట్స్‌ కావవి అని సంజాయిషీ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ‘అప్పటి రాజకీయాల అవసరాల కోసమే చేశాను తప్ప.. వ్యక్తిగతంగా కేసీఆర్‌ను, ఆ కుటుంబాన్ని డ్యామేజీ చేయాలని ఏమాత్రం కాద’న్నారు. ప్రస్తుతం ఆమె సారీ చెప్పడం వెనుకున్న రాజకీయ మర్మాన్ని ఎవరికి వారే అంచనాలు వేసుకుంటున్నారు. ఆమెపై కేటీఆర్‌ గతంలో వేసిన కేసు విషయంలో ఉపసంహరణ కోసమే ఈ విధమైన కామెంట్ చేసి ఉంటారని బీఆరెస్‌ శిబిరం చెబుతోంది. దాసుడి తప్పులు దండంతో సరి అన్నట్టుగా..నాగార్జున తనపై కేసు వేసిన విషయంలో సారీతో సరిపెట్టుకున్నట్టు.. రాజకీయంగా కేటీఆర్‌తో శత్రుత్వమెందుకు? అనే కోణంలో ఇలా చెప్పి ఉంటారా? అనే విశ్లేషణలు కూడా సాగుతున్నాయి.

కామెంట్స్‌ పై రాజకీయ దుమారం..

మరో కీలక చర్చ జరుగుతోంది సురేఖ కామెంట్స్‌పై. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ సురేఖ చేసిన ఈ కామెంట్స్‌ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. నల్లగొండ- వరంగల్‌- ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి పేరును డిక్లేర్‌ చేశారు. ఖమ్మం ఉమ్మడి జిల్లాకు చెందిన కీలకమైన ముగ్గురు మంత్రులు.. భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరావు ఇక్కడి నుంచే ప్రాతినిథ్యం వహిస్తుండటంతో ఈ ఎమ్మెల్సీ సీటు గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ గెలుపు బాధ్యతను వీరి భుజాలపైనే మోపారు సీఎం. రెండు ఎమ్మెల్సీ సీట్లలో కనీసం ఒక్కటైనా గెలవకపోతే పార్టీకి బూస్టింగ్‌ ఇస్తూ వస్తున్న తరుణంలో డ్యామేజీ ఖాయమని కేటీఆర్ భావిస్తున్నారు. దీనికి తోడు ఈ ఎన్నికల ఫలితాలను సెమీ ఫైనల్స్‌గా చూడాలని హరీశ్‌రావు ఇది వరకే ప్రకటించి ఉన్నారు. దీంతో కచ్చితంగా ఒక సీటు గెలవాల్సిందేనన్న బలమైన సంకల్పంతో ఆ పార్టీ వ్యూహాలుంటున్నాయి.

సారీ అనే పాచిక వేశారా?

Advertisement

నల్లగొండ- ఖమ్మం- వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఏనుగుల రాకేశ్‌రెడ్డి బరిలో ఉన్నారు. గతంలో ఇదే స్థానం నుంచి పోటీ చేసి కొద్దిపాటి ఓట్ల తేడాతో ఓడిపోయారాయన. దీంతో ఈసారి సమీకరణలన్నీ కలిసి వస్తే.. కచ్చితంగా గెలుస్తారనే ధీమాలో బీఆర్‌ఎస్‌ ఉంది. ఈ క్రమంలోనే అసంతృప్త నేతగా ఉన్న సురేఖకు కేటీఆర్‌ గాలం వేశారా? ఆయన వేసిన వ్యూహంలో భాగంగా సురేఖ.. సారీ అనే పాచిక వేశారా? అనే కోణంలో కూడా చర్చ జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ఆమెను పార్టీలోకి తీసుకోబోమని జగదీశ్‌రెడ్డి ఇటీవల కామెంట్ చేశారు. కానీ రాజకీయాల్లో శాశ్వత శత్రువులండరనే విధంగా.. వరంగల్‌లో ఇప్పటికీ బలమైన బీసీ నేతలుగానే కొండా దంపతులును చూస్తున్నారు. కడియం శ్రీహరిపై రాజకీయ ప్రతీకారంతో కేటీఆర్‌ ఉన్నారనే ప్రచారం ఉంది. సురేఖ ద్వారా కడియంకు కూడా చెక్‌ పెట్టొచ్చనే సమీకరణ పై ఓ చర్చ జరుగుతోంది.

Also Read: పిచ్చాసుపత్రి బేస్మెంట్లో సైకోపాత్… మిస్సైన అమ్మాయి కోసం వేట… గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

Tags

Related News

మియాపూర్ భూముల వివాదం.. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ విక్టరీ!

కొండా సురేఖ క్షమాపణ కేటీఆర్ రియాక్షన్ ఇదే.. ఏమన్నారంటే?

జగిత్యాల శ్మశానవాటికలో క్షుద్రపూజల కలకలం.. బొమ్మకు సూదులు గుచ్చి..?

నాగ్‌పూర్‌లో బీజేపీకి ఘోర పరాజయం.. మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు!

ఎల్ నినో ఎఫెక్ట్.. ఆ ఉచిత పథకంపై తెలంగాణ సర్కార్ నీలినీడలు!

ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లపై.. తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ!

మేడ్చల్లో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా.. జీరో ఫెటాలిటీ డిస్ట్రిక్ట్ పథకం!

Big Stories

Advertisement
×