Janhvi Kapoor: దివంగత నటి అతిలోక సుందరి శ్రీదేవి(Sridevi) వారసురాలిగా నటి జాన్వీ కపూర్ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో బిజీగా గడుపుతున్నారు. కెరియర్ మొదట్లో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె ప్రస్తుతం వరుస సౌత్ సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఏమాత్రం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దేవర సినిమా(Devara Movie) ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైన ఈమె మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటిస్తున్న పెద్ది(Peddi Movie) సినిమాలో కూడా అవకాశం లభించింది.
రక్తపు మరకలతో జాన్వీ కపూర్..
ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాలు అలాగే పెద్ది సినిమా షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్న జాన్వి కపూర్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక ఫోటో అభిమానులను ఎంతగానో ఆందోళనకు గురిచేస్తుంది. చేతిపై, మొహం మీద రక్తపు మరకలతో ఉన్న ఫోటోని జాన్వీ కపూర్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ ఫోటో చూసినా అభిమానులు అసలు జాన్వి కపూర్ ఒంటిపై ఈ గాయాలెంటీ అసలేం జరిగింది అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు.
ప్రమాదంలో నటి జాన్వీ
ఇకపోతే ఈ ఫోటోలలో భాగంగా ఈమె వంటి నిండా గాయాలతో మరొక వ్యక్తిని హగ్ చేసుకుని ఉన్న ఫోటోని షేర్ చేశారు. ఇక ఈ ఫోటోను హ్యాపీ అంటూ షేర్ చేయడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. బహుశా ఈ ఫోటో సినిమా షూటింగ్ కి సంబంధించినదని స్పష్టంగా అర్థం అవుతుంది. షూటింగ్లో భాగంగా ఈమె ఒంటి పై గాయాలైనట్టు నటించారనే విషయం తెలియడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇలా ఒక్కసారిగా జాన్వి కపూర్ ఫోటో చూడగానే నిజంగానే తనకు ఏదైనా ప్రమాదం జరిగిందా అంటూ అభిమానులు ఆందోళన చెందారు.
గ్రామీణ నేపథ్యంలో..
ఇక ప్రస్తుతం ఈమె పలు బాలీవుడ్ సినిమాలతో పాటు పెద్ది సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసినదే. ఇక పెద్ది సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సాన(Bucchi Babu Sana) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో జాన్వి కపూర్ పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కూడా బుచ్చిబాబు పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇదివరకే జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా ఈమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో ఎంతో మంచి ఆదరణ లభించిన సంగతి తెలిసిందే.
Also Read: Udaya Bhanu: ఉదయభానుని తొక్కేసింది ఆవిడే… నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు!