Udaya Bhanu: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ యాంకర్ ఉదయభాను(Udaya Bhanu) ఒకరు. సుమ, ఝాన్సీ కంటే ముందుగానే ఈమె యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా యాంకర్ గా కొనసాగడమే కాకుండా హీరోయిన్గా కూడా పలు సినిమాలలో నటించి ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్టుగా, యాంకర్ గా ఓ వెలుగు వెలిగారు. అయితే ఇటీవల కాలంలో ఉదయభానుకు పెద్దగా అవకాశాలు రాలేదని చెప్పాలి. ఇలా యాంకర్ గా అవకాశాలు లేకపోవడంతో యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈమె ప్రేక్షకుల ముందుకు వస్తూ బిజీగా ఉన్నారు. ఇక ప్రస్తుతం యాంకర్ అంటే అందరికీ టక్కున సుమ(Suma) పేరు గుర్తుకువస్తుంది.
సిండికేట్ పెరిగిపోయిందా?
ఒక సినిమా వేడుక జరుగుతుంది అంటే ఆ సినిమా పూజా కార్యక్రమాల నుంచి మొదలుకొని సక్సెస్ మీట్ కార్యక్రమాల వరకు సుమ యాంకర్ గా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ఒక సినిమా వేడుకలో భాగంగా ఉదయభాను మాట్లాడుతూ యాంకరింగ్ విషయంలో సిండికేట్ భారీగా పెరిగిపోయిందని తెలిపారు. తాను రేపు ఒక ఈవెంట్ కు వెళ్లాల్సి ఉండగా చివరి క్షణాలలో ఈవెంట్ క్యాన్సిల్ అవుతుందని, అక్కడ నా బదులు వేరే వాళ్ళు ఉంటారు అంటూ ఉదయభాను చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చలకు కారణమయ్యాయి. ఉదయభాను ఇలా మాట్లాడటంతో ఇండస్ట్రీలో ఈమెను తొక్కేస్తున్నది ఎవరు? కావాలనే అవకాశాలు లేకుండా చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.
ఎవరు ఎవరిని తొక్కేయరు…
ఇలా ఉదయభాను చేసిన ఈ వ్యాఖ్యల గురించి ప్రముఖ నిర్మాత నట్టి కుమార్(Natti Kumar) “బిగ్ టీవీ”తో మాట్లాడుతూ అసలు విషయం వెల్లడించారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ తాను ఉదయభాను గారి వ్యాఖ్యలతో ఏమాత్రం ఏకీభవించను అంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో యాంకర్ అంటే సుమ కనకాల (Suma Kanakala)పేరు గుర్తుకు వస్తుంది సుమ హైపోజిషన్ లో ఉంది అంటే ఆమె ఒకరిని తొక్కేసిందని ఉద్దేశం కాదు. ఉదయభాను గారు ఉద్దేశం అదే అయితే ఒకానొక సమయంలో ఈమె టాప్ యాంకర్ గా ఉండేది అప్పుడు మరి ఉదయభాను కూడా ఇలాగే అందరిని తొక్కేసిందా? అంటూ ప్రశ్నించారు.
ఇండస్ట్రీలో ఎవరు శాశ్వతం కాదు..
సినిమా ఇండస్ట్రీలో ఎవరు శాశ్వతం కాదు.. ఒకప్పుడు ఉదయభాను టాప్ యాంకర్ గా ఉండేది ఆమె వ్యక్తిగత కారణాలవల్ల కొంత గ్యాప్ ఇవ్వడంతో ఆ గ్యాప్ ను సుమ పూర్తి చేశారని, రేపొద్దున సుమ వ్యక్తిగత కారణాలవల్ల ఇండస్ట్రీకి గ్యాప్ ఇస్తే ఆమె స్థానాన్ని మరొకరు ఆక్రమిస్తారని ఇది ఇండస్ట్రీలో జరిగే సర్వసాధారణ విషయమని తెలిపారు. ఉదయభాను వ్యక్తిగత కారణాలవల్ల ఇండస్ట్రీకి దూరం కావడంతోనే ఆమెకు ఇప్పుడు అవకాశాలు లేవు అంతమాత్రాన తనని తొక్కేస్తున్నారని సిండికేట్ పెరిగిపోయింది అంటూ మాట్లాడటం సరైనది కాదని ఈ సందర్భంగా నట్టి కుమార్ ఉదయభాను వ్యాఖ్యలను ఖండిస్తూ అసలు విషయం వెల్లడించారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవ్వటంతో ఈయన చెప్పింది కూడా నిజమే కదా అంటూ ఈయన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారు.
Also Read: Bigg Boss Agnipariksha: అసలైన అగ్నిపరీక్ష మొదలు… ఇదీ చదరంగం కాదు రణరంగమే!