E-Paper
Advertisement

బ్రేకప్ అయ్యిందా? అయితే .. పార్టీ చేసుకోండి …అంటున్న హాలీవుడ్ బ్యూటీ

బ్రేకప్ అయ్యిందా? అయితే .. పార్టీ చేసుకోండి …అంటున్న హాలీవుడ్ బ్యూటీ
Advertisement

Jennifer Lopez: జెన్నిఫర్ లోపేజ్ .. ఇంటర్నేషనల్ స్టేజ్ లపై  సంచలనాలు  సృష్టించిన గ్లోబల్ పాప్ ఐకాన్.56 ఏళ్ల ఈ వెటరన్ బ్యూటీ  జీవితంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు పెళ్లిళ్లు పెటాకులు అయిపోయాయి.అలా ప్రపంచం మొత్తం ఆమె ప్రేమాయణాల గురించి విడాకుల  గురించే మాట్లాడుకున్న పరిస్థితి .మాములుగా ఇలా జరిగితే ఎవరైనా ఏం చేస్తారు డిప్రెషన్ లోకి వెళ్లిపోతారు కానీ జెనిఫర్ మాత్రం ఇప్పుడు సరికొత్త ఫ్లాప్ ఫిలాసఫీని తెరమీదికి తెచ్చింది.అవును బ్రేకప్ అంటే అయితే ఏడుస్తూ కూర్చోవద్దని, బ్యాండ్ బాజాలతో పార్టీలు చేసుకోవాల్సిన అసలైన పండుగని చెప్పుకొచ్చింది.

మీరు విడిపోయారా అయితే కంగ్రాట్స్

ఈమధ్య ఇంటర్నెట్ సెన్సేషన్ కరీం రహమ పోస్ట్ చేసిన సబ్వే టేక్స్ టాక్ షోలో జెనిఫర్ చెప్పిన ఈ మాటలు నెట్టింట్లో  మంటలు పుట్టిస్తున్నాయి.లైఫ్ లో ఒక రిలేషన్ బ్రేకప్ అవ్వడాన్ని మనం ఎందుకు ఫెయిల్యూర్ గా చూడాలంటూ, నిజానికి బ్రేకప్ అవడం అంటే మనల్ని మనం మరింత సాన పెట్టుకోవడానికి ప్రకృతి ఇచ్చే ఒక అద్భుతమైన లాంచ్ ప్యాడని  చెప్పుకొచ్చింది ఈ  హాలీవుడ్ బ్యూటీ.ఎవరైనా విడిపోయారని తెలిస్తే జాలి చూపించకుండా’ మీరు విడిపోయారా అయితే కంగ్రాట్స్ పార్టీ చేసుకోండి ‘అంటూ చెప్పాలని సలహా ఇచ్చింది.హృదయముక్కలైనప్పుడే మనిషిలో అసలైన డెవలప్మెంట్ కనిపిస్తుందని, తన లైఫ్ లో సాధించిన అనేక సక్సెస్ ల వెనుక ఇలాంటి మానసిక క్షోభలే ఉన్నాయని తెలిపింది.

బెన్ అప్లెక్స్ తో నడిపిన ప్రేమాయణం అప్పట్లో ఒక సంచలనం

Advertisement

లైఫ్ లో లవ్ బ్రేకప్ అయినా , నటించిన సినిమా ప్లాఫైనా అసలు ఏం జరిగింది? ఏం తప్పు చేసాం వంటివి మరింతగా తెలుసుకోవడానికి అవకాశం దొరుకుతుందని తెలిపింది.జెన్న ఫర్ ప్రేమాయణాల విషయానికొస్తే హాలీవుడ్ స్టార్ బెన్ అప్లెక్స్ తో నడిపిన ప్రేమాయణం అప్పట్లో ఒక సంచలనం.2003లో వచ్చిన ఇడ్లీ సినిమా షూటింగ్ టైంలో మొదలైన వీరి పరిచయం ఆ తర్వాత పెళ్లి దాకా వచ్చి క్యాన్సిల్ అయింది .అయితే గమ్మత్తుగా ఇదే జోడి దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఒకటవవడం గమనార్హం. అయితే  2022లో ఘనంగా పెళ్లి చేసుకున్న ఈ జోడి 2025లో మనస్పర్ధల కారణంగా విడిపోయారు.బెన్నీఫర్ అంటూ అభిమానులు మురిసిపోయేలోపే వీరి బంధం బ్రేక్ అవడం బాధాకరం.

ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసిన ఆన్ ది ఫ్లోర్ 

ఇక దీని కన్నా ముందే జెన్నీఫర్ కి  ఓజాని నోవా, క్రిస్ జడ్, ప్రముఖ గాయకుడు మార్క్ ఆంథోనీలతో పెళ్లిళ్లయిన ఏవి నిలబడలేకపోయాయి.అయితే ఇన్ని దెబ్బలు తగిలిన జెనీఫర్ ఎక్కడ తగ్గకపోవడం విశేషం.జెనీఫర్ కెరీర్ విషయానికి వస్తే 1997 లో వచ్చిన బయోపిక్ ‘సెలెనా’తో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ఈ బ్యూటీ ఆన్ ది ఫ్లోర్ అంటూ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసింది.ఇక ది వెడ్డింగ్ ప్లానర్, ‘హుస్ట్లర్స్’ వంటి సినిమాలతో మంచి  క్రేజ్ తెచ్చుకుంది.

Advertisement

also read :టైమ్ కన్నా ముందే వారణాసి ప్యాకప్..జక్కన్న స్పీడ్ మాములుగా లేదుగా

ఏది ఏమైనా జెన్నిఫర్  ఇచ్చిన తాజా ఇంటర్వ్యూ తో బ్రేకప్ అనేది ఎండ్ కార్డ్ కాదు అది సరికొత్త లైఫ్ కి ఓపెనింగ్ కార్డ్ అంటూ ఇచ్చిన స్టేట్మెంట్ యూత్ కి ఇపుడు  పిచ్చపిచ్చగా నచ్చేస్తుందనడంలో సందేహం లేదు !

Related News

నాని రెమ్యునరేషన్ పెంచేశాడా? నిర్మాతలకు కొత్త లెక్క

రణబాలికి హైక్స్ లేవట.. మేకర్స్ లెక్క మామూలుగా లేదుగా!

‘రాజాసాబ్’ బ్యూటీ రిధి.. ఈసారి కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిందే!

నితిన్‌కు హిట్ పడి ఎన్నాళ్లయిందో.. ఈసారి అయినా లెక్క మారేనా?

హీరోగానే కాదు.. డైరెక్టర్‌గానూ సంపాదిస్తున్న విశ్వక్ సేన్!

లెజెండ్రీ డైరెక్టర్ సింగీతంకి ‘పద్మ అవార్డ్స్’ ఎందుకు రాలేదు?

పవన్.. ప్రభాస్.. ఇద్దరి పక్కన ఛాన్స్! నిధి లెక్క ఎప్పుడు మారుతుందో?

గురూజీకి సెకండ్ హాఫ్ నచ్చలేదా? ‘ఆదర్శ కుటుంబం’పై కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×