Aakasamlo oka tara trailer: ప్రముఖ మలయాళ స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) ప్రధాన పాత్రలో నటిస్తున్న సరికొత్త చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. పవన్ సాధినేని (Pawan sadhineni) దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ట్రైలర్ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. నవంబర్ 15వ తేదీన ఆదివారం ఘనంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించగా.. ప్రముఖ స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా వచ్చి సందడి చేశారు. ఇకపోతే తాజాగా నేడు ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది. ఒక సాధారణ పల్లెటూరి అమ్మాయి ఆస్ట్రోనాట్ కావాలనే కోరికను ఎలా నెరవేర్చుకుంది? అనే కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
దుల్కర్ సల్మాన్ హీరోగా, సాత్విక వీరవల్లి హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు నవంబర్ 20వ తేదీన ఈ సినిమా రాబోతోంది. ఇందులో శృతిహాసన్ , గౌతమ్ వాసుదేవ్ మేనన్ కీలకపాత్రలకు పోషిస్తున్నారు. ఇందులో వ్యోమగామి కావాలనుకునే ఒక పల్లెటూరి అమ్మాయి కలను నిజం చేసే పాత్రలో దుల్కర్ సల్మాన్ కనిపించారు.
also read: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన జబర్దస్త్ బాబు..డేట్ కూడా ఫిక్స్!
ఆకట్టుకుంటున్న ట్రైలర్..
ఇకపోతే ట్రైలర్ విషయానికి వస్తే.. కృష్ణ ఎప్పుడూ తన గురించే ఆలోచిస్తావా? మరి నీ గురించి ఆలోచించవా? అనే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభించారు. అందులో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. ఈ ప్రపంచంలో మన కలలను సహకారం చేసుకునే అవకాశం కొందరికే వస్తుంది. అందరికీ రాదు కదా.. అయితే ఆ అవకాశం రాలేదని బాధపడుతూ కూర్చోకుండా.. ఆకాశమంత స్థాయికి మించి కలను కంది కల్పన” అంటూ సాత్విక వీరవల్లి పాత్రను ఇంట్రడ్యూస్ చేశారు. ” పది మంది నవ్వితే ఏంటి? ఇద్దరు నమ్మిన చాలు కదా?” అనే డైలాగు ఆకట్టుకుంది . ఎట్టకేలకు కల్పనను ఆస్ట్రోనాట్ గా చూడాలన్న కోరిక కృష్ణకు నెరవేరినట్టు ట్రైలర్ లోనే చూపించారు.. అయితే ఆ తర్వాత ఏం జరిగింది? ఆమెను చూసి నవ్విన వాళ్లు ఆమెకు జేజేలు కొట్టారా? అసలు ఏంటి? అనే విషయం తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. మొత్తానికైతే ఆకాశంలో ఒక తార ట్రైలర్ చాలా ఆసక్తికరంగా సాగుతోంది.