E-Paper
Advertisement

LFP vs NMC బ్యాటరీలు.. ఇండియన్ ఈవీలకు ఏది బెస్ట్? అసలు తేడాలు ఇవే!

LFP vs NMC బ్యాటరీలు.. ఇండియన్ ఈవీలకు ఏది బెస్ట్? అసలు తేడాలు ఇవే!
Advertisement

LFP vs NMC Batteries: ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలు పెరుగుతున్న కొద్దీ బ్యాటరీ టెక్నాలజీపై కూడా ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా LFP, NMC అనే రెండు రకాల బ్యాటరీలు ప్రస్తుతం EV మార్కెట్‌లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ రెండూ లిథియం-అయాన్ బ్యాటరీలే అయినప్పటికీ, వాటి పనితీరు, ధర, లైఫ్, ఛార్జింగ్ విధానంలో తేడాలున్నాయి. భారత్ లో పరిస్థితులకు ఏ బ్యాటరీ అనుకూలంగా ఉంటుందంటే..

LFP బ్యాటరీ.. ఎక్కువ కాలం మన్నిక..

LFP అంటే లిథియం ఐరన్ ఫాస్ఫేట్. ఈ బ్యాటరీల్లో ఐరన్, ఫాస్ఫేట్ వంటి పదార్థాలను ఉపయోగిస్తారు. ఇవి తయారీ ఖర్చును తగ్గించడమే కాకుండా, బ్యాటరీకి మంచి స్థిరత్వాన్ని అందిస్తాయి. ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద కూడా LFP బ్యాటరీలు NMCతో పోలిస్తే మెరుగైన భద్రతా లక్షణాలను కలిగి ఉంటాయి. వీటిని తరచుగా 100 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఎక్కువ ఛార్జింగ్ సైకిల్స్‌ను తట్టుకోవడం వల్ల ఎక్కువ కాలం కారు ఉపయోగించాలనుకునేవారికి ఇవి మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. టాటా టియాగో EV, పంచ్ EV, నెక్సాన్ EV, MG విండ్సర్ EV లాంటి కొన్ని మోడళ్లలో LFP బ్యాటరీలను ఉపయోగిస్తున్నారు.

NMC బ్యాటరీ.. ఎక్కువ రేంజ్, మంచి పనితీరు

Advertisement

NMC అంటే నికెల్ మాంగనీస్ కోబాల్ట్. ఈ బ్యాటరీల ప్రత్యేకత హై ఎనర్జీ డెన్సిటీ. అంటే తక్కువ బరువు, తక్కువ స్థలంలో ఎక్కువ పవర్ ను నిల్వ చేస్తాయి. దీంతో  వెహికల్ ఎక్కువ డ్రైవింగ్ రేంజ్ అందించడానికి అవకాశం ఉంటుంది. అయితే, NMC బ్యాటరీలు అధిక ఉష్ణోగ్రతల విషయంలో మరింత జాగ్రత్త కోరుకుంటాయి. వీటి జీవితకాలాన్ని మెరుగ్గా ఉంచేందుకు సాధారణంగా రోజువారీ ఛార్జింగ్‌ను 80 శాతానికి పరిమితం చేయాలని కొన్ని కార్ల తయారీ సంస్థలు సూచిస్తాయి. హ్యుందాయ్ ఐయోనిక్ 5, కియా EV6 లాంటి కొన్ని ప్రీమియం ఈవీల్లో ఈ బ్యాటరీ టెక్నాలజీ కనిపిస్తుంది.

భారత పరిస్థితులకు ఏది సేఫ్ అంటే?   

మన దేశంలో వేసవిలో ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీలకు పైగా నమోదవుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాటరీ ఉష్ణోగ్రతను కంట్రోల్ చేయడం చాలా ముఖ్యం. LFP బ్యాటరీలు వేడిని తట్టుకునే విషయంలో మెరుగైన స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. NMC బ్యాటరీల్లో వేడి ఎక్కువైతే పనితీరు, భద్రతపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అయితే రెండు రకాల బ్యాటరీల్లోనూ సరైన కూలింగ్ వ్యవస్థ, బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (BMS)  చాలా ముఖ్యం.

ధర, లైఫ్ లోనూ తేడాలు

Advertisement

సాధారణంగా LFP బ్యాటరీల తయారీ ఖర్చు తక్కువగా ఉంటుంది. ఎక్కువ ఛార్జింగ్ సైకిల్స్‌ ను తట్టుకునే సామర్థ్యం కూడా వీటి ప్రత్యేకత. NMC బ్యాటరీలు హై ఎనర్జీ డెన్సిటీని అందించినప్పటికీ, వాటి తయారీకి ఉపయోగించే పదార్థాల కారణంగా ఖర్చు ఎక్కువగా ఉంటుంది.

భారతీయులకు ఏది బెస్ట్?

రోజువారీ ప్రయాణాలు, కుటుంబ అవసరాలు, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, ఎక్కువ కాలం బ్యాటరీ మన్నిక కావాలనుకునేవారికి LFP మంచి ఆప్షన్ కానుంది. ఎక్కువ రేంజ్, తక్కువ బరువు, మెరుగైన పనితీరు కోరుకునేవారు NMC బ్యాటరీ కార్లను తీసుకోవడం మంచిది.

Read Also: కారు వైర్లను ఎలుకలు కొరికేస్తున్నాయా? లక్షల్లో ఖర్చు కాకూడదంటే ఈ 5 చిట్కాలు పాటించండి!

Tags

Related News

పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ప్రాణాలకే ప్రమాదం!

కారు సన్‌రూఫ్ నుంచి నీళ్లు కారుతున్నాయా? వేలల్లో నష్టాన్ని తప్పించుకోండిలా!

కారు వైర్లను ఎలుకలు కొరికేస్తున్నాయా? లక్షల్లో ఖర్చు కాకూడదంటే ఈ 5 చిట్కాలు పాటించండి!

తక్కువ ధర.. ఎక్కువ రేంజ్.. భారత్‌లో బెస్ట్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

లాంగ్ డ్రైవ్‌ల కోసం బెస్ట్ 5 డీజిల్ SUVలు.. వీటి పవర్ చూస్తే ఆశ్చర్యపోతారు!

మారుతి బ్రెజ్జా టర్బో 1,200 కి.మీ. రివ్యూ.. మైలేజ్ ఎంత? పనితీరు ఎలా ఉందంటే?

హోండా నుంచి రెండు కొత్త SUVలు.. ఒకటి హైబ్రిడ్, మరొకటి ఎలక్ట్రిక్!

Big Stories

Advertisement
×