E-Paper
Advertisement

జగపతిబాబు షోలో సుమ,రాజీవ్ సందడి.. బయటపడ్డ పాత ప్రేమ రహస్యాలు!

జగపతిబాబు షోలో సుమ,రాజీవ్ సందడి.. బయటపడ్డ పాత ప్రేమ రహస్యాలు!
Advertisement

Jayammu Nischayammu Raa show:టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబు హోస్ట్ చేస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సీజన్-2 షో బాగా సందడి చేస్తోంది. ఇప్పటికే సాయి పల్లవి, అల్లు అర్జున్, త్రివిక్రమ్ లాంటి స్టార్స్ వచ్చి వెళ్లగా.. ఈ వారం ఎపిసోడ్‌కు యాంకర్ సుమ, రాజీవ్ కనకాల గెస్టులుగా వచ్చారు. తాజాగా రిలీజైన ఈ ఎపిసోడ్ ప్రోమో చూస్తుంటే నవ్వాగడం లేదు. భార్యాభర్తలిద్దరూ కలిసి జగపతి బాబుతో చేసిన ఆ ఫన్నీ రచ్చ ఏంటో ఇప్పుడు చూద్దాం.

మలయాళం పేరుతో జగపతి బాబు పంచ్:

షో మొదలవ్వగానే జగపతి బాబు తన స్టైల్లో సుమను ఆటపట్టించడం స్టార్ట్ చేశారు. నీ పూర్తి పేరు చెప్పమని అడగగానే, సుమ మలయాళంలో తన పొడవాటి పేరును గడగడా చెప్పేసింది. అది విన్న జగపతి బాబు వెంటనే.. “నేను పేరు చెప్పమన్నాను, బూతులు తిట్టమని చెప్పలేదు” అంటూ పంచ్ వేశారు. దాంతో సుమ ఒక్కసారిగా షాక్ అయి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ ప్రోమోలో భలే ఫన్నీగా ఉంది.

పాత లవ్ స్టోరీ సీక్రెట్స్ లీక్:

Advertisement

మాటల మధ్యలో సుమ మాట్లాడుతూ.. పెళ్లికి ముందు తాను నలుగురిని రిజెక్ట్ చేశానని చెప్పింది. దానికి జగపతి బాబు.. “అయితే రాజీవ్‌కు ఒక్కరి గురించే తెలుసు అన్నమాట” అనగానే కరెక్ట్‌గా అదే టైమ్‌కి రాజీవ్ కనకాల లోపలికి వచ్చి సుమకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి ఇద్దరూ కలిసి తమ పాత ప్రేమ కథలను బయటపెట్టారు. సుమకు ప్రపోజ్ చేద్దామనుకునేలోపే వెనకాల ఇంకొకడు రెడీ అయ్యేవాడని రాజీవ్ చెప్పడం బాగా నవ్వించింది.

రాజీవ్ తలపై నీళ్లు పోసిన సుమ:

ప్రోమోలో వీళ్లిద్దరి మధ్య సరదా గొడవలు చూస్తుంటే భలే మజా వస్తోంది. పాత విషయాలన్నీ నీకు గుర్తున్నాయా అని రాజీవ్ అడిగితే.. “ఎన్ని అని గుర్తుపెట్టుకుంటాను రాజా” అంటూ సుమ కౌంటర్ వేసింది. దానికి రాజీవ్ “ఓరి నాయనో” అంటూ తల పట్టుకున్నారు. ఆ సరదా కోపంలో సుమ ఏకంగా వాటర్ బాటిల్ తీసి రాజీవ్ తలమీద నీళ్లు పోయడం ప్రోమోలో బాగా వైరల్ అవుతోంది.

సుమపై అల్లు అర్జున్ స్పెషల్ కామెంట్:

Advertisement

మరోవైపు సుమ క్రేజ్ ఇండస్ట్రీలో ఏ రేంజ్‌లో ఉందో రీసెంట్‌గా జరిగిన ఒక ఈవెంట్‌లో మరోసారి ప్రూవ్ అయింది. హైదరాబాద్‌లో జరిగిన ‘ఆకాశంలో ఒక తార’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ గెస్ట్‌గా వచ్చారు. ఆ స్టేజ్ మీద బన్నీ మాట్లాడుతూ.. “తెలుగులో సుమగారి తర్వాత మేము అంతగా ఇష్టపడే మలయాళీ దుల్కర్ సల్మాన్ మాత్రమే” అని చెప్పారు. సుమ మలయాళీ అయినా తెలుగు ప్రేక్షకులతో పాటు స్టార్ హీరోలు కూడా ఆమెను ఎంత ఓన్ చేసుకున్నారో ఈ మాటలతో అర్థమైపోతోంది.

also read:ఓటీటీలోకి 20 చిత్రాలు..ఆ 2 డోంట్ మిస్!

ఎప్పుడు, ఎక్కడ చూడాలి?:

సుమ ఎక్కడ ఉంటే అక్కడ కామెడీ మామూలుగా ఉండదు. అలాంటి సుమను జగపతి బాబు ఇంటర్వ్యూ చేస్తుంటే ఆ ఫన్ వేరే లెవల్‌లో ఉంది. ఈ ఫుల్ ఎపిసోడ్‌ను టీవీ కంటే ముందే జీ5 (ZEE5) ఓటీటీలో చూడొచ్చు. అలాగే ఆదివారం రాత్రి 7:30 గంటలకు జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారం కాబోతోంది.

వీకెండ్‌కు ఫుల్ కామెడీ:

ప్రోమోనే ఇంత ఫన్నీగా ఉంటే, ఇక ఫుల్ ఎపిసోడ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. సుమ, రాజీవ్ కనకాల కామెడీ టైమింగ్, జగపతి బాబు సరదా ప్రశ్నలతో ఈ వారం ఆడియన్స్‌కు మంచి టైమ్ పాస్ దొరకడం ఖాయం!

Related News

మూడేళ్లకే ప్రపంచ రికార్డులు.. పొదరిల్లు చక్రి కొడుకు టాలెంట్ కు ఫిదా అవ్వాల్సిందే!

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన జబర్దస్త్ బాబు..డేట్ కూడా ఫిక్స్!

కామనర్స్ హౌస్లోకి రీ ఎంట్రీ..మిథిలేష్ దెబ్బకు ముఖేష్ గప్ చుప్ ..!

శ్రీవిద్యను ఆ స్టార్ హీరోయిన్ తో పోల్చిన వర్ష!

మీనా నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..? వాట్ ఏ క్రేజ్ మావా..

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి బాలు పై అనుమానం.. మీనాకు నిజం తెలుస్తుందా..? బాలు, అరుణ్ మధ్య సుమతి..

Karthika Deepam 2 Serial Today Episode November 16th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్నను పెళ్లి చేసుకోమని సూరజ్ కు చెప్పిన మాలిని

Big Stories

Advertisement
×