E-Paper
Advertisement

ఘనంగా తేజ సజ్జ నిశ్చితార్థం..హాజరవుతున్న సినీ, రాజకీయ ప్రముఖులు!

ఘనంగా తేజ సజ్జ నిశ్చితార్థం..హాజరవుతున్న సినీ, రాజకీయ ప్రముఖులు!
Advertisement

Teja Sajja:చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి.. పదుల సంఖ్యలో సినిమాలు చేసి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న తేజ సజ్జ (Teja sajja) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ని మొదలుకొని రామ్ పోతినేని (Ram pothineni) వరకు ఎంతోమంది స్టార్, యంగ్ హీరోల సినిమాలలో నటించి ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకున్న తేజ.. తొలిసారి నందిని రెడ్డి (Nandini Reddy) దర్శకత్వంలో సమంత(Samantha ) ప్రధాన పాత్ర పోషించిన ‘ఓ బేబీ’ చిత్రంలో కీలకపాత్ర పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. జాంబిరెడ్డి సినిమాతో హీరోగా మారిన తేజ.. ఆ తర్వాత చేసిన హను-మాన్ చిత్రంతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. దీనికి తోడు ఇటీవల వచ్చిన మిరాయ్ చిత్రంతో మరో బ్లాక్ బాస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు తేజ సజ్జ.

నేడే ఘనంగా తేజ సజ్జ నిశ్చితార్థం..

అలాంటి ఈయన ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. డిసెంబర్లో జరగబోయే వివాహ వేడుకకు సిద్ధమవుతున్నారు తేజ. ఈ క్రమంలోనే నేడు ఆయన నిశ్చితార్థ వేడుక ఘనంగా జరగబోతోంది. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు ఒక్కొక్కరిగా హాజరవుతున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అమెరికాకు చెందిన అమ్మాయితో హైదరాబాదులో తేజ నిశ్చితార్థం జరుగుతోంది.

హాజరవుతున్న సినీ, రాజకీయ ప్రముఖులు..

Advertisement

తేజ సజ్జ నిశ్చితార్థ వేడుకకు సినిమా ఇండస్ట్రీ నుండి రానా దగ్గుపాటి, రవితేజ, ప్రశాంత్ వర్మ, వరలక్ష్మి శరత్ కుమార్, ఈమె భర్త నికోలాయ్ సచ్ దేవ్, శ్రీకాంత్, నాని, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నిర్మాత నాగవంశీ, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ వంటి సినీ ప్రముఖులు హాజరవుతుండగా.. మరొకవైపు పొలిటికల్ లీడర్స్ బీఆర్ఎస్ హరీష్ రావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తోపాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి.. హీరోగా సత్తా చాటుతూ పాన్ ఇండియా లెవెల్లో పేరు దక్కించుకున్న తేజ నిశ్చితార్థ వేడుకకే ఈ రేంజ్ లో ప్రముఖులు హాజరవుతున్నారు అంటే.. ఇక వివాహ వేడుకకు, రిసెప్షన్కు ఇంకెంత మంది హాజరవుతారో చూడాలి అంటూ అభిమానులు సైతం ఆసక్తి కనబరిస్తున్నారు.

ALSO READ:‘రామాయణ’ చూసి ఫిదా అయిన అమల అక్కినేని.. ఏమన్నారంటే?

డిసెంబర్లో వివాహం..

Advertisement

తేజా సజ్జ పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోబోతున్నారు. ఈయనకు కాబోయే భార్య యూఎస్ కి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈమెకు సినిమాలతో ఎటువంటి సంబంధం లేదు. అమెరికాలోనే పుట్టి, పెరిగారని.. గతంలో తేజ వెల్లడించారు. ఇరు కుటుంబాల పెద్దలు వీరి వివాహాన్ని రాజస్థాన్లోని ఉదయపూర్ వేదికగా డిసెంబర్లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరపాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక తర్వాత సినీ, రాజకీయ ప్రముఖుల కోసం హైదరాబాదులోనే రిసెప్షన్ వేడుక ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

Related News

‘రామాయణ’ చూసి ఫిదా అయిన అమల అక్కినేని.. ఏమన్నారంటే?

ఆసక్తి రేపుతున్న ‘ఆకాశంలో ఒక తార’ ట్రైలర్ రిలీజ్!

శ్రీహరి ఇంట్లో శుభకార్యం.. పెళ్లి పీటలెక్కబోతున్న పెద్ద కొడుకు?

నిన్న అమిత్ షా.. నేడు కిషన్ రెడ్డి.. కేంద్రమంత్రులతో చిరంజీవి భేటీ వెనుక కారణం?

మెగా ఫ్యాన్స్ కు కిక్కు ఇచ్చే న్యూస్.. ‘కాకా’ లేటెస్ట్ అప్డేట్..!

‘డ్రాగన్’ లో ఫీస్ట్.. ఎన్టీఆర్ మరో లుక్ రెడీ..?

లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఆషికా రంగనాథ్!

Big Stories

Advertisement
×