Amala Akkineni:నితీష్ తివారీ తీసిన ‘రామాయణ’ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్ అయింది. వసూల్ పరంగా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది .ఇప్పుడు సామాన్యులే కాదు, సినీ సెలబ్రిటీలు కూడా ఈ సినిమా చూసి మెచ్చుకుంటున్నారు. తాజాగా నటి అమల అక్కినేని ఈ మూవీ చూసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. సినిమాలో తనకు ఏం నచ్చాయో, పార్ట్-2 కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నారో అమల మాటల్లోనే చూద్దాం.
తాను కాలేజీ రోజుల్లో కళాక్షేత్రంలో డ్యాన్స్ నేర్చుకునేటప్పుడు ఎన్నోసార్లు రామాయణ నాటకాలు వేశానని అమల గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడే మళ్లీ అప్పటి ఎగ్జైట్‌మెంట్ వచ్చిందట. ఎప్పుడెప్పుడు థియేటర్లో చూద్దామా అని అందరిలాగే తను కూడా వెయిట్ చేశానని, ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లి సినిమాను బాగా ఎంజాయ్ చేశానని అమల చెప్పారు.
డైరెక్టర్ నితీష్ తివారీ ఈ కథను తెరపై చూపించిన తీరు చాలా బాగుందని అమల అన్నారు. సినిమాలో ప్రతి క్యారెక్టర్, ప్రతి సీన్ చాలా సహజంగా వచ్చాయని, ఇంత పెద్ద సినిమా తీసిన ప్రొడ్యూసర్‌కి, డైరెక్టర్‌కి హ్యాట్సాఫ్ చెప్పారు. ఇక ఈ మూవీ ఇండియన్ సినిమా గర్వపడేలా ఉందని, ఇప్పటి జెనరేషన్ ఆడియన్స్‌కు కూడా ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అవుతోందని మెచ్చుకున్నారు.
సినిమాలో నటించిన ముగ్గురు మెయిన్ యాక్టర్స్ (రణబీర్, సాయి పల్లవి, యష్) తో పాటు మిగతా వాళ్లంతా చాలా బాగా చేశారని అమల అన్నారు. ముఖ్యంగా సీత క్యారెక్టర్‌ని చాలా స్ట్రాంగ్‌గా, రావణుడిని ఒక ప్రత్యేకమైన కారణం ఉన్న వ్యక్తిగా చూపించిన విధానం తనకు బాగా నచ్చిందట. అయితే ఇంతకంటే ఎక్కువ చెబితే స్పాయిలర్స్ అవుతాయని, ఆడియన్స్ థ్రిల్‌ను పాడు చేయనని సరదాగా అన్నారు.
ALSO READ:ఆసక్తి రేపుతున్న ‘ఆకాశంలో ఒక తార’ ట్రైలర్ రిలీజ్!
అందరికీ తెలిసిన కథే అయినా, సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా బోర్ కొట్టకుండా కొన్ని సీన్లు అదిరిపోయాయని అమల రాసుకొచ్చారు. అసలు యుద్ధం ఇంకా ముందుందని, రాముడి అసలు పని ఇప్పుడే మొదలైందని చెప్పారు. ఇక అందుకే పార్ట్-2 ఎప్పుడు వస్తుందా అని తాను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
ఇక మొత్తానికి ‘రామాయణ’ సినిమా అమల అక్కినేని మనసును పూర్తిగా గెలుచుకుంది. ఇది థియేటర్లలో కచ్చితంగా చూడాల్సిన సినిమా అని, డైరెక్టర్ నితీష్ తివారీకి కంగ్రాట్స్ చెబుతూ ఆమె పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.