Bala Ramyanam:ఈ మధ్యకాలంలో రామాయణం ( Ramayanam) కు సంబంధించి ఎన్నో సినిమాలు తెరకెక్కుతున్నాయి
అలా ఇప్పటికే శ్రీరామరాజ్యం(Sri Rama Rajyam), శ్రీరామ పట్టాభిషేకం,సంపూర్ణ రామాయణం, లవకుశ, ఆది పురుష్ (Adi Purush), బాల రామాయణం ఇలా ఎన్నో సినిమాలు వచ్చాయి. కథ ఒక్కటే అయినప్పటికీ ఆ కథకి అనేక గ్రాఫిక్స్, విజువల్స్ అందిస్తూ సినిమాని భారీ ఎత్తున తీస్తూ ఉంటారు. ఇక త్వరలోనే బాలీవుడ్లో కూడా రామాయణ (Ramayana) సినిమా రాబోతోంది.
ఎన్టీఆర్ తొలి హీరోయిన్గా గుర్తింపు..
ఇదంతా పక్కన పెడితే చిన్నపిల్లలు అందర్నీ కలిపి బాల రామాయణం పేరిట సినిమాని ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ (Guna shekhar) తెరకెక్కించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో బాల రాముడి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR) నటించగా.. సీతాదేవి పాత్రలో స్మితా మాధవ్ (Smitha Madhavan) నటించారు. 1996లో విడుదలైన ఈ బాల రామాయణం సినిమాకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అలా ఉత్తమ బాలల చిత్రంగా ఈ బాల రామాయణం(Bala Ramayanam) సినిమా అవార్డు అందుకుంది. ఇక ఈ సినిమా వచ్చి ఇప్పటికే 30 ఏళ్ళు దగ్గర పడుతుంది. అయితే ఈ సినిమాలో సీతాదేవి పాత్రలో నటించిన హీరోయిన్ ని ఇప్పుడు చూస్తే మాత్రం అందరి మతిపోతుంది. అలా తారక్ సరసన తొలిసారి హీరోయిన్ గా నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది ఈ చిన్నది
ఇప్పుడు ఆమె ఏం చేస్తుందో తెలుసా..
మరి ఇంతకీ బాల రామాయణంలో సీత పాత్రలో నటించిన స్మితా మాధవ్ ఇప్పుడు ఏం చేస్తుంది అనేది చూస్తే.. స్మితా మాధవ్ (Smitha Madhav) ప్రస్తుతం సినిమాలైతే చేయట్లేదు. ఆమె కన్నడలో యాంకర్ గా పలు షోలు చేస్తోంది. ఇక స్మిత మాధవ్ కర్ణాటక క్లాసికల్ సింగర్ గా ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. కేవలం సింగర్ మాత్రమే కాదు భరతనాట్యంలో కూడా శిక్షణ తీసుకొని.. అటు డాన్సర్ గా.. ఇటు సింగర్ గా.. మరోవైపు యాంకర్ గా కన్నడ ఇండస్ట్రీలో రాణిస్తోంది.. తెలుగు విశ్వవిద్యాలయం నుండి నృత్యం అలాగే సంగీతంలో డిప్లొమా ప్రోగ్రామ్ పూర్తి చేసి, ఇందిరకళ సంగీత విశ్వవిద్యాలయం నుండి భరతనాట్యంలో మాస్టర్స్ చేసి, మద్రాస్ లోని విశ్వవిద్యాలయం నుండి సంగీతంలో మాస్టర్స్ చేసింది. అలా భరత నాట్యం,సంగీతంలో ఆరితేరిన స్మితా మాధవ్ కన్నడ బుల్లితెర మీడియాలో రాణిస్తోంది. ఇక ఆ మధ్యకాలంలో పృథ్వి (Prithvi)అనే ఆర్ట్ ఫిలిం లో కనిపించిన స్మితా మాధవ్ ప్రస్తుతం సినిమాలు మానేసి యాంకరింగ్ రంగంలో రాణిస్తోంది.
మళ్లీ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలి అంటూ..
ఇక స్మిత మాధవ్ పెద్దగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండదు.ఏదో అప్పుడప్పుడు సోషల్ మీడియా అభిమానులను ఇలా వచ్చి అలా పలకరించి వెళ్తూ కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.అలా తాజాగా స్మితా మాధవ్ కి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారడంతో బాల రామాయణం సినిమాలో సీత పాత్రలో నటించిన స్మితా మాధవ్ పెద్దయ్యాక అచ్చం బాపు బొమ్మలా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ALSO READ:Telugu Heroes : హీరోలకు ఇదేం ఖర్మరా అయ్యా.. మరీ యూట్యూబర్స్ స్థాయికి!