BigTV English

Telugu Heroes : హీరోలకు ఇదేం ఖర్మరా అయ్యా.. మరీ యూట్యూబర్స్‌ స్థాయికి!

Telugu Heroes : హీరోలకు ఇదేం ఖర్మరా అయ్యా.. మరీ యూట్యూబర్స్‌ స్థాయికి!

Telugu Heroes :ఆధునిక ప్రపంచంలో ఎప్పుడు ఏ విషయం ట్రెండింగ్ లోకి వస్తుందో చెప్పడం కష్టం. అదే అంటారు కదా.. ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయని.. ఈ సామెత ప్రస్తుత సందర్భానికి కచ్చితంగా సూట్ అవుతుంది అని చెప్పవచ్చు. సాధారణంగా హీరోలను యూట్యూబర్స్.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎక్కువగా ఫాలో అవుతున్న విషయం తెలిసిందే. కానీ ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ట్రెండ్ మారింది అని అనక మారారు. స్టార్ హీరోలే ఇప్పుడు యూట్యూబర్స్ ను ఫాలో అయ్యే స్థాయికి చేరుకున్నారని తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే హీరోలకు ఇదేం కర్మరా అయ్యా అంటూ నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


యూట్యూబర్లను ఫాలో అవుతున్న హీరోలు..

ఇంతకుముందు యూట్యూబర్లు కొంతమంది హీరోలను ఇమిటేట్ చేసి ఫేమస్ అయ్యే వాళ్ళు. తమ యూట్యూబ్ ఛానల్స్ కి వ్యూస్ తెచ్చుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రస్తుతం ఉన్న హీరోలు ఎక్కువగా యూట్యూబర్లను ఇమిటేట్ చేసి వ్యూస్ తెచ్చుకోవాలని చూస్తున్నారు ముఖ్యంగా తమ సినిమాల ప్రమోషన్స్ లో భాగంగా. తమ సినిమాను ఆడియన్స్ మధ్యలోకి తీసుకెళ్లడానికి.. ఫేమస్ యూట్యూబర్లను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఒకరకంగా చెప్పాలి అంటే.. సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత హీరోల కంటే కొంతమంది యూట్యూబర్లకే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే అలా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న యూట్యూబర్ లను ఇప్పుడు హీరోలు ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇది చూసిన చాలామంది అటెన్షన్ కోసమో.. లేక వ్యూస్ కోసమో తెలియదు కానీ హీరోలు అనవసరంగా ఆ యూట్యూబర్ల ను హైలెట్ చేస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.


కిరణ్ అబ్బవరం పై నెటిజన్స్ ట్రోల్స్..

ఉదాహరణకు హీరో కిరణ్ అబ్బవరం (Kiran abbavaram తాజాగా ‘K ర్యాంప్’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి ఇటీవల గ్లింప్స్ వచ్చింది. ఆ గ్లింప్స్ ఫైనల్ షార్ట్ లో హీరో ఒక పాపులర్ యూట్యూబర్ ను ఇమిటేట్ చేశాడు. దీనికి మంచి రెస్పాన్స్ కూడా లభించింది. అందుకే మరో ప్రమోషనల్ కంటెంట్ లో కూడా మరో యూట్యూబర్ ను ఇమిటేట్ చేసే షార్ట్ ఉండేలా చూడాలని హీరో తన చిత్ర బృందానికి చెప్పారట. ఇక మొత్తానికైతే స్టార్ హీరోలు కూడా ఇప్పుడు యూట్యూబర్లను ఫాలో అయ్యే స్థాయికి చేరుకోవడం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. హీరోలలో కంటెంట్ తగ్గిపోయిందా.. క్రియేటివిటీగా ఆలోచించలేకపోతున్నారా అందుకే ఇలా యూట్యూబర్ల వెంట పడుతున్నారా అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

ప్రియదర్శి కూడా..

ఇకపోతే ఇదివరకే యంగ్ హీరో ప్రియదర్శి కూడా ఇటీవల అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదాన్ని తన ప్రమోషన్స్ లో ఉపయోగించుకొని.. తన సినిమాకు ప్రమోట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత దీనిపై స్పందించారు కూడా.. ఇలా హీరోలు, యూట్యూబర్లను ఫాలో అవ్వడం చూసి ట్రెండ్ మారింది అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా హీరోలు సొంత క్రియేటివిటీ తో ఆలోచించి తమ సినిమాను ముందుకు తీసుకెళ్తారేమో చూడాలి.

ALSO READ:Bahubali Re Release Run Time : బాహుబలి రీ రిలీజ్‌ రన్ టైంపై రూమర్స్.. రానా ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు!

Related News

Bollywood: బాలీవుడ్ లో దిగ్బ్రాంతి, ఆ ప్రముఖ నటుడు దూరమయ్యారు

Ar Muragadoss: ఇంక రిటైర్మెంట్ ఇచ్చేయండి బాసు, పెద్ద డైరెక్టర్లు వరుస ఫెయిల్యూర్స్

Nag Ashwin: ప్రధానికి నాగ్ అశ్విన్ కీలక రిక్వెస్ట్.. కొత్త జీఎస్టీ‌లో ఆ మార్పు చెయ్యాలంటూ…

Siima 2025 Allu Arjun: సైమా ఈవెంట్లో అల్లు అర్జున్, లుక్ అదిరింది భాయ్

17 Years of Nani : మామూలు జర్నీ కాదు, ఈ తరానికి నువ్వే బాసు

Sujeeth: సుజీత్ కరుడుగట్టిన కళ్యాణ్ అభిమాని.. ఏం చేశాడంటే?

Big Stories

×