Jr.Ntr: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన RRR సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత తన తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ చిత్రం వార్ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయిన ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస పాన్ ఇండియా సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈయన ప్రశాంత్ నీల్(Prashanth) డైరెక్షన్లో డ్రాగన్ అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఎన్నో బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ భారీగా సంపాదిస్తున్నారు. అయితే ఇటీవల ఒక యాడ్ షూట్ లో భాగంగా ఎన్టీఆర్ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయన చేతికి గాయం(Hand Injury) కావడంతో సుమారు రెండు వారాలపాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు. ఇలా ఎన్టీఆర్ కు గాయమైందనే విషయాన్ని ఆయన టీం అధికారకంగా తెలియజేశారు.
గాయంతోనే యాడ్ షూట్ పూర్తి..
ఇకపోతే ఎన్టీఆర్ కు తగిలిన గాయం పెద్దదేమి కాదని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా తెలిపారు. ఇదిలా ఉండగా తాజాగా ఎన్టీఆర్ కి సంబంధించి మరొక వార్త వైరల్ అవుతుంది ఎన్టీఆర్ తన చేతికి గాయం అయినప్పటికీ ఆయన పూర్తి చేయాల్సిన యాడ్ షూట్ పూర్తి చేసినట్టు సమాచారం. డాక్టర్లు విశ్రాంతి తీసుకోమని చెప్పినా ఈయన మాత్రం తన పని పూర్తి చేయాలన్న మొండి పట్టుదలతో గాయం అయిన మరుసటి రోజు ఈ షూట్ పూర్తి చేశారని తెలుస్తోంది. అయితే ఈ యాడ్ షూట్ కి సంబంధించిన సెట్ హైదరాబాదులో ఒక ప్రైవేట్ స్టూడియోలో ఏర్పాటు చేశారు. తాను విశ్రాంతి తీసుకునే వరకు ఉంటే ఆ సెట్ కోసం భారీ స్థాయిలో రెంట్ చెల్లించాల్సి ఉంటుందని అందుకే ఎన్టీఆర్ తన చేతికి గాయమైన ఈ యాడ్ షూట్ పూర్తి చేశారని తెలుస్తుంది.
ఎన్టీఆర్ డెడికేషన్ కు హాట్సాఫ్…
ఇలా యాడ్ ఫిల్మ్ మేకర్స్ కు అధిక భారం కలగకుండా ఈయన నొప్పిని భరిస్తూనే ఈ షూట్ పూర్తి చేయడంతో ఎన్టీఆర్ డెడికేషన్ పట్ల అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు మరి ఇంత మొండోడివి ఏంటి సామి నువ్వు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ ఈ మొండి పట్టుదలే తనని ఈ స్థాయిలో నిలబెట్టిందని చెప్పాలి. ఇక ఎన్టీఆర్ కెరియర్ విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో మరో పాన్ ఇండియా సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత కొరటాల డైరెక్షన్ లో దేవర 2 చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈయన నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
Also Read: Kantara Chapter1: కాంతారకు అరుదైన గౌరవం.. విడుదలకు ముందే ఇలా!