Kantara Chapter1: కన్నడ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా కొనసాగుతున్న వారిలో రిషబ్ శెట్టి (Rishabh Shetty)ఒకరు.. దర్శకుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈయన తన స్వీయ దర్శకత్వంలో కాంతార సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఒక ప్రాంతీయ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకోవడమే కాకుండా ఏకంగా జాతీయ చలనచిత్ర అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో నటుడు రిషబ్ శెట్టి ఈ సినిమాకు ఫ్రీక్వెల్ సినిమాగా కాంతారా చాప్టర్ 1 (Kantara Chapter1)సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
ఈ సినిమా షూటింగ్ పనులన్నీ కూడా పూర్తి అయ్యాయి. ఈ సినిమాని దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 2వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం ఇటీవల ట్రైలర్ విడుదల చేయగా ఈ ట్రైలర్ కు విపరీతమైన ఆదరణ లభించడమే కాకుండా సినిమాపై మంచి అంచనాలను పెంచేసింది. ఇక విడుదల తేదీ కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాది కూడా భారీగా ప్రమోషన్లను నిర్వహించే ఆలోచనలు చిత్ర బృందం ఉన్నారు.
కాంతర థీమ్ తో పోస్టల్ కార్డ్స్…
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా విడుదలకు ముందే అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. చిత్రపటం కర్ణాటక పోస్టల్ సర్కిల్ తో బాగస్వామ్యంతో కాంతర థీమ్ తో ఒక స్పెషల్ కవర్ విడుదల చేశారు. కన్నడ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా తీర్చిదిద్దిన ఈ కవర్ అందరినీ ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా ఇది కన్నడ సాంప్రదాయానికి దక్కిన అసలైన గౌరవం అంటూ కామెంట్లు చేస్తున్నారు. చిత్ర నిర్మాణ సంస్థ హోం భలే ఫిలిమ్స్ సహకారంతో కర్ణాటక పోస్టల్ సర్కిల్స్ భూత కోల నేపథ్యంలో రెండు పోస్టల్ కార్డులను విడుదల చేసింది.
7వేల స్క్రీన్ లలో ప్రదర్శితం…
ఈ సినిమా విడుదలకు ముందే అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకోవడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ సినిమా సుమారు 7000 స్క్రీన్ లలో ప్రదర్శితం కాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో రిషబ్ కు జోడిగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. కాంతార సినిమాతో నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న రిషబ్ శెట్టి ఫ్రీక్వెల్ సినిమా కచ్చితంగా ఆస్కార్ రేసులో ఉండాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగం మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో ఫ్రీక్వెల్ సినిమాని ఏకంగా స్పానిష్ లో కూడా డబ్ చేసి విడుదల చేయడానికి చిత్రబృందం సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమా భూతకోల నృత్య ప్రదర్శన ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.
Also Read: Breaking News: అనారోగ్యానికి గురైన పవన్ కళ్యాణ్.. విశ్రాంతి అవసరమంటూ!