OTT Movie : రొమాంటిక్ సినిమాలకు ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. అయితే కొన్ని సినిమాలలో రొమాన్స్ హద్దులు దాటి పోతుంటుంది. ఇలాంటి సినిమాలను ఒంటరిగానే చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు అభిమానులు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, సరికొత్త స్టైల్ లో తెరకెక్కింది. ఉత్తరప్రదేశ్ గ్రామంలో నలుగురు మహిళల జీవితాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. వీళ్ళ భర్తలు నగరంలో ఏళ్లకొద్దీ పనిచేస్తూ ఇంటికి రాకపోవడంతో, వీళ్ళు తోడు కోసం తపించి పోతుంటారు. ఈ క్రమంలో స్టోరీ ఆసక్తికరంగా, కంటిమీద రెప్ప వేయకుండా చేస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘చార్ లుగాయ్’ 2023లో విడుదలైన హిందీ కామెడీ మూవీ. ఇది ప్రకాశ్ సైనీ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో నిధి ఉత్తమ్, మాన్సీ జైన్, దీప్తి గౌతమ్, కమల్ శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. స్ట్రిప్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ నిర్మాణంలో వచ్చినా ఈ సినిమా, 2023 మే 19న థియేటర్లలో విడుదలైంది. 2 గంటల 7 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమా IMDbలో 7.2/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం యూట్యూబ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్‌లోని ఓ చిన్న గ్రామంలో ఉషా, రష్మీ, మీనూ, రంజూ అనే నలుగురు స్నేహితురాళ్లు ఉంటారు. వీళ్ళ భర్తలు నగరంలో ఏళ్ల తరబడి పనిచేస్తూ, ఇంటికి రాకపోవడంతో ఒంటరితనంతో తోడు కోసం ఆరాటపడుతుంటారు. వీళ్ళ భర్తలు నగరంలో వేశ్యల వద్ద తమ కోరికలను తీర్చుకుంటూ, గ్రామంలో తమ భార్యలను, కుటుంబ బాధ్యతలను పట్టించుకోకుండా ఉంటారు. ఈ సమయంలో ఉషా గ్రామంలోని దుగ్గు అనే బాడీబిల్డర్ తో రెగ్యులర్‌గా ఫిజికల్ రిలేషన్‌షిప్‌లో ఉంటుంది. రష్మీ, మీనూ కూడా తమ కోరికలను తీర్చుకోవాలని ఉషాతో చెప్పడంతో, ఉషా దుగ్గుని తన ఇంటికి పిలిపిస్తుంది. ఈ ప్రాసెస్‌లో రంజూ వారికి సపోర్ట్ చేస్తూ, ఈ ప్లాన్‌ని సీక్రెట్‌గా ఉంచడానికి సహాయపడుతుంది. ఇలా వీళ్ళ వ్యవహారం నడుస్తున్నప్పుడు హఠాత్తుగా దుగ్గు ఉషా ఇంటిలో ఓ రాత్రి అతను అనుమానాస్పద స్థితిలో చనిపోతాడు. దీంతో నలుగురు స్నేహితురాళ్ల జీవితాలు తలకిందులవుతాయి.
దుగ్గు మరణం తర్వాత, నలుగురు స్త్రీలు ఈ సంఘటనను దాచిపెట్టేందుకు హడలిపోతారు. ఎందుకంటే గ్రామంలో ఈ విషయం బయటపడితే వారి జీవితాలు, గౌరవం నాశనమవుతాయి. రష్మీ తన చార్మ్‌ని ఉపయోగించి, స్థానిక డాక్టర్ రాస్తోగిని ఒప్పించి, దుగ్గు శవాన్ని దాచిపెట్టడానికి సహాయం తీసుకుంటుంది. ఈ ప్రాసెస్‌లో వారు అనేక అడ్డంకులను ఎదుర్కొంటారు. పోలీసుల సందేహాలు, గ్రామస్తుల గాసిప్‌లు వారిని ఒత్తిడిలో పడేస్తాయి. ఈ సన్నివేశాలు కామెడీ, టెన్షన్ మిక్స్‌తో నడుస్తాయి. ముఖ్యంగా రష్మీ, రాస్తోగితో డీల్ చేసే సీన్స్, ఉషా గ్రామస్తుల సందేహాలను తప్పించే ప్రయత్నాలు కొంత ఫన్ ని క్రియేట్ చేస్తాయి. ఈ కథ అనుకోని ట్విస్ట్‌లతో గందరగోళంగా మారుతుంది. చివరికి ఈ మహిళలు శవాన్ని మాయం చేస్తారా ? వీళ్ళ భర్తలు ఇక సిటీలోనే ఉంటారా ? వీళ్ళ కోరికలు ఎలా తీర్చుకుంటారు ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకొండి.
Read Also : ఈ దెయ్యానికి అమ్మాయిలే కావాలి… ఒక్కో సీన్ కు గుండె జారిపోద్ది… గుండె ధైర్యం ఉంటేనే చూడండి