BigTV English

Jr.NTR Fans: యుద్ధ ట్యాంకర్లతో ర్యాలీ … ఇదెక్కడి మాస్ క్రేజ్ రా బాబు!

Jr.NTR Fans: యుద్ధ ట్యాంకర్లతో ర్యాలీ … ఇదెక్కడి మాస్ క్రేజ్ రా బాబు!

Jr NTR Fans: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR)ఒకరు . ఇలా తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఈయన రాజమౌళి దర్శకత్వంలో నటించిన RRR సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ కు విదేశాలలో కూడా బీభత్సమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కోసమే విదేశీయులు తెలుగు నేర్చుకున్నారంటే ఈయనకు ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో స్పష్టమవతుంది. ఇక ఎన్టీఆర్ ఇటీవల దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ కొట్టారు. ఇక త్వరలోనే బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తో (Hrithik Roshan)కలిసి నటించిన వార్ 2 సినిమా(War 2Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు


యుద్ధ ట్యాంకర్లతో ర్యాలీ..

అయాన్ ముఖర్జీ(Ayan Mukerji) దర్శకత్వంలో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన వార్ 2 సినిమా ఆగస్టు 14వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. అయితే యూకే లో ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులు మాత్రం చాలా విభిన్నంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. వార్ 2 సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవాలని యూకే లోని ఎన్టీఆర్ అభిమానులు వార్ 2 యుద్ధ సమయంలో ఉపయోగించిన యుద్ధ ట్యాంకర్లతో(war tankers) ర్యాలీ చేస్తూ వినూత్న రీతిలో తమ అభిమానాన్ని చాటుకున్నారు.


సరికొత్త ట్రెండ్ సృష్టించిన తారక్ ఫ్యాన్స్..

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా ఈ ట్యాంకర్లపై ఎన్టీఆర్ అభిమానులు వార్ 2 సినిమాకి సంబంధించిన జెండాలను పట్టుకొని జై ఎన్టీఆర్ అంటూ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ గా మారడంతో ఎన్టీఆర్ అభిమానులు మరింత వైరల్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఏ హీరో విషయంలో కూడా ఇలా జరగలేదని చెప్పాలి. ఇలా ఎన్టీఆర్ అభిమానులు వార్ 2 ప్రమోషన్లలో భాగంగా సరికొత్త ట్రెండ్ సృష్టించారని తెలుస్తోంది.

?igsh=MXB1OXp4MzZ6Ymw1ZQ%3D%3D

ఇక వార్ 2 సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక స్పై ఏజెంట్ గా కనిపించబోతున్నారని తెలుస్తోంది. యశ్ ఫిలిమ్స్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించారు. మరి కొద్ది రోజులలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో సినిమాపై తెలుగులో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఇదే రోజే రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమా కూడా విడుదల కాబోతున్న నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద కూడా అసలు సిసలైన వార్ జరగబోతుందని చెప్పాలి. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా పాన్ ఇండియా సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Also Read: Balakrishna: గర్వంగా ఉంది.. క్రెడిట్ మొత్తం వారికే నేషనల్ అవార్డుపై బాలయ్య కామెంట్స్!

Related News

Allu Sneha: స్నేహ రెడ్డికి ఈ ఫోటో అంటే అంత ఇష్టమా.. అంత స్పెషల్ ఏంటబ్బా?

Pasivadi Pranam Film: చిరు పసివాడి ప్రాణం చైల్డ్ ఆర్టిస్ట్ ఆ హీరోయినేనా.. ఇప్పుడు ఎలా ఉందంటే?

Idli KottuTrailer: ఆకట్టుకుంటున్న ధనుష్ ఇడ్లీ కొట్టు ట్రైలర్.. పని ఆదాయం కోసమే కాదంటూ!

Actress Hema: మంచు లక్ష్మికి హేమ సపోర్ట్.. మధ్యలో యాంకర్ సుమను కూడా ఇరికించేసిందిగా!

Mohanlal: ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైన నటుడు మోహన్ లాల్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

OG Business: ఓజీ ముందు బిగ్ టార్గెట్… సేఫ్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలంటే ?

Kantara Chapter1: కాంతారకు సాయంగా రాజా సాబ్… రంగంలోకి ఇంకా బడా స్టార్స్!

Allu Arjun Fans: అల్లు అర్జున్ అభిమాన సంఘాల ప్రెసిడెంట్స్ భేటీ.. అదే కారణమా?

Big Stories

×