Balakrishna: కేంద్ర ప్రభుత్వం తాజాగా 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను(71 National Awards) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అవార్డులలో భాగంగా తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా వివిధ కేటగిరీలలో పలు సినిమాలకు జాతీయ అవార్డులు లభించడం విశేషం. ఇక ఈ జాతీయ చలనచిత్ర అవార్డు కార్యక్రమాలలో భాగంగా బాలకృష్ణ (Balakrishna)హీరోగా నటించిన భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమాకు గాను ఉత్తమ చిత్రంగా(Best Film) అవార్డు లభించిన సంగతి తెలిసిందే. ఇలా ఈ సినిమాకు అవార్డు రావడంతో చిత్ర బృందం స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఈ క్రెడిట్ మొత్తం చిత్ర బృందానిదే…
ఇప్పటికే దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) స్పందిస్తూ.. తమ సినిమాకు నేషనల్ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ ఎమోషనల్ అయ్యారు. తాజాగా నందమూరి బాలకృష్ణ కూడా తన సినిమాకు నేషనల్ అవార్డు రావడం పై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా బాలయ్య స్పందిస్తూ..71 వ జాతీయ చలనచిత్ర అవార్డులలో భాగంగా మా సినిమా భగవంత్ కేసరి ఉత్తమ సినిమాగా ఎంపిక కావటం చాలా గర్వంగా ఉందని తెలిపారు. ఈ క్రెడిట్ మొత్తం మా చిత్ర బృందానికి దక్కుతుందని ఈ సందర్భంగా బాలయ్య తెలియజేశారు. షైన్ స్క్రీన్స్ (ఇండియా) LLP తరపున చిత్ర నిర్మాతలు సాహు గారపాటి గారు, హరీష్ పెద్ది గారు, దర్శకుడు అనిల్ రావిపూడి ఈ కథను అందంగా ఆవిష్కరించారు.
మరింత స్ఫూర్తిని కలిగించింది..
ఇక ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్క ఆర్టిస్టు టెక్నీషియన్, ఇతర సిబ్బంది కృషి పట్టుదల వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. మా సినిమాను ఉత్తమ సినిమాగా ఎంపిక చేసిన జాతీయ అవార్డుల జ్యూరీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని బాలయ్య భగవంత్ కేసరి సినిమాకు నేషనల్ అవార్డు రావడంతో సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా భారతదేశంలోని ఇతర జాతీయ అవార్డుల గ్రహీతలు అందరికీ కూడా అభినందనలు తెలియజేశారు. ఇలా సినిమాలకు ఈ విధమైనటువంటి అవార్డులను ప్రకటించడంతో మరింత స్ఫూర్తిని కలిగిస్తుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే శక్తివంతమైన సినిమాలను అందించాలనే మా తపనను మరింత దృఢపరుస్తుందని బాలకృష్ణ సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
నేషనల్ అవార్డు జ్యూరీకి ధన్యవాదాలు…
ఇక ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎంతో సందేశాత్మకమైన సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణకు జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, నటించగా ఇందులో శ్రీ లీల బాలకృష్ణ కూతురి పాత్రలో నటించారు. ఇలా తండ్రి కూతురి అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అప్పట్లో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకు నేషనల్ అవార్డు రావడంతో చిత్ర బృందం కూడా సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా నేషనల్ అవార్డు జ్యూరీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
Also Read: James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే