Prabhas: మంచు విష్ణు(Manchu Vishnu) తన డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాని(Kannappa Movie) ఎట్టకేలకు ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మైథాలజీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పరవాలేదని టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా ఈ సినిమాలో ప్రభాస్(Prabhas) పాత్ర హైలెట్ అంటూ ప్రేక్షకులు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో ఇతర భాష సెలబ్రిటీలు కూడా ఈ సినిమాలో భాగమైన విషయం తెలిసిందే. ఇక రుద్ర (Rudra)అనే పాత్ర కోసం ప్రభాస్ నటించడం విశేషం.
ప్రభాస్ అభిమానుల హంగామా..
ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి ఆదరణ, పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. ఇలాంటి ఒక స్టార్ హీరో కన్నప్ప సినిమాలో క్యామియో పాత్రలో నటిస్తున్నారు అంటేనే సినిమాపై కాస్త అంచనాలు పెరిగిపోయాయి ఇక ఈ సినిమాకు మంచి టాక్ వస్తుంది అంటే అది కేవలం ప్రభాస్ ఫాన్స్ కారణమనే చెప్పాలి. ప్రభాస్ దాదాపు అరగంట పాటు సందడి చేయబోతున్న నేపథ్యంలో ప్రభాస్ ని చూడటం కోసమే పెద్ద ఎత్తున అభిమానులు థియేటర్లకు తరలివస్తున్నారు. ఇక ప్రభాస్ సన్నివేశాలు హైలైట్ గా ఉన్నాయని తెలుస్తోంది.
రుద్ర పాత్ర కోసం ఎన్టీఆర్..?
ఈ సినిమాకు ప్రభాస్ రుద్ర పాత్ర చాలా కీలకంగా మారిందని, ఈ పాత్రలో విష్ణు ప్రభాస్ ని సెలెక్ట్ చేసుకుని తన సినిమాని కాపాడుకున్నారని కూడా వినపడుతుంది. అయితే కన్నప్ప సినిమాని అనుకున్న సమయంలో చిత్ర బృందం రుద్ర పాత్రలో ప్రభాస్ ను కాకుండా మరొక హీరోని తీసుకోవాలనే ఆలోచనలో ఉండేవారట. కానీ కొంతమంది సలహాలు సూచనలు మేరకు ప్రభాస్ ను కలిసినట్టు తెలుస్తుంది. మరి ప్రభాస్ కాకుండా రుద్ర పాత్ర కోసం విష్ణు ముందుగా అనుకున్న హీరో ఎవరనే విషయానికి వస్తే… ఆయన మరెవరో కాదు పాన్ ఇండియా స్టార్ హీరో ఎన్టీఆర్(NTR) అని చెప్పాలి. ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఈయనకి కూడా ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ప్రభాస్ మాత్రమే కరెక్ట్…
ఈ క్రమంలోనే రుద్ర పాత్ర కోసం ఎన్టీఆర్ ను తీసుకుంటే బాగుంటుందని ఆలోచన విష్ణు చేసినప్పటికీ కొంతమంది ప్రభాస్ పేరును సూచించారట. దీంతో విష్ణు మోహన్ బాబు ఏ మాత్రం ఆలోచించకుండా ప్రభాస్ ని కలవడం ప్రభాస్ రుద్ర సినిమాలో నటించడం జరిగింది. ఇక ఈ విషయం తెలిసిన ప్రభాస్ అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఒకవేళ ప్రభాస్ ను కాకుండా ఎన్టీఆర్ ని తీసుకుంటే సినిమా అట్టర్ ప్లాప్ అయ్యేది అంటూ కామెంట్లు చేస్తున్నారు. రుద్ర పాత్రలో ప్రభాస్ ని చూసిన తర్వాత ఆ పాత్రకు ఆయనే కరెక్ట్ అని, తన స్థానంలో ఎవరిని ఊహించుకోలేం అంటూ ప్రభాస్ ఫాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా కన్నప్ప సినిమా విష్ణు అభిమానులకు మాత్రమే కాదు ప్రభాస్ అభిమానులకు కూడా మంచి వినోదాన్ని అందిస్తోందని చెప్పాలి.
Also Read: Bigg Boss 9 Buzz Host: బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా లేడీ కంటెస్టెంట్.. ఇక మాములుగా ఉండదు