War 2 : ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా, టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ (NTR) విలన్ గా నటిస్తున్న చిత్రం వార్ 2 (War 2). బాలీవుడ్ లో మంచి విజయం అందుకున్న వార్ (War) చిత్రానికి కొనసాగింపుగా ఈ సినిమా రాబోతోంది.ప్రముఖ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee) దర్శకత్వంలో.. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా(Adithya chopra) భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో ఆగస్టు 14వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది.. ఇందులో కియారా అద్వానీ (Kiara advani) హీరోయిన్గా నటిస్తోంది.
రన్ టైమ్ లాక్ చేసుకున్న వార్ 2..
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇటీవల సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది ఈ చిత్రం. ఇందులో యాక్షన్ పర్ఫామెన్స్ ఉన్నప్పటికీ సెన్సార్ బోర్డ్ యూ /ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇప్పుడు ఈ సినిమా రన్ టైమ్ కూడా లాక్ చేసుకుంది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. హిందీ వెర్షన్ రన్ టైం ఒకలాగా.. తెలుగు, తమిళ్ వెర్షన్ రన్ టైం మరోలాగా ఫిక్స్ చేయడం గమనార్హం. అసలు విషయంలోకి వెళ్తే.. వార్ 2 రన్ టైం హిందీ వెర్షన్ 2:53 గంటల నిడివితో లాక్ చేయబడింది. పైగా ఈ హిందీ వెర్షన్ లో అదనపు సన్నివేశాలు ఉండబోతున్నాయని సమాచారం.
2 వెర్షన్ లలో వార్ 2..
ఇటు తమిళ్, తెలుగు వెర్షన్ విషయానికి వస్తే.. 2 గంటల 51 నిమిషాల నిడివితో సినిమా రానున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హిందీ వెర్షన్ తో పోల్చుకుంటే ఇక్కడ తెలుగు, తమిళ వెర్షన్లో కొన్ని సన్నివేశాలు తొలగించారు అని.. పైగా అటు తెలుగులో ఇటు హిందీలో సీన్స్ కూడా డిఫరెంట్ గా ఉండబోతున్నాయని.. రెండు వెర్షన్స్ లో వార్ 2 సినిమా రాబోతోందని సమాచారం. ఇక దీన్ని బట్టి చూస్తే అటు హిందీ ఆడియన్స్ కోసం ఇటు తెలుగు, తమిళ్ ఆడియన్స్ కోసం రెండు వెర్షన్ లలో సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మరి ఆగస్టు 14వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా ఏ ఆడియన్స్ ను ఏ విధంగా మెప్పిస్తుంది అనే విషయం తెలియాల్సి ఉంది.
వార్ 2 సినిమా విశేషాలు..
వార్ 2 సినిమా విషయానికి వస్తే అటు హృతిక్ రోషన్ ఇటు ఎన్టీఆర్ ఎవరికివారు తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేయబోతున్నారు. దీనికి తోడు వీరిద్దరికి సంబంధించి ఒక పాట ఉందని, సినిమా మొదటినుంచి చెబుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఈ సాంగ్ టీజర్ ను ఇటీవల విడుదల చేసి అంచనాలు పెంచేశారు. ఈ పూర్తి పాటను థియేటర్లలోనే చూడాలని అటు ఎన్టీఆర్ కూడా స్పష్టం చేశారు. మరి ఇంత పగడ్బందీగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా థియేటర్లలో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.
ALSO READ:Mahesh Babu: ఏడాది ఆదాయంతో పాన్ ఇండియా మూవీ తీయొచ్చని మీకు తెలుసా?