Venkatesh : టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు నేడు తన 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో తన ప్రత్యేకమైన నటన, ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో కోట్లాది అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించిన మహేష్ బాబు.. ఈ వయసులో కూడా అదే ఉత్సాహం, శక్తితో ముందుకు సాగుతున్నారు.. బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నాడు. ఆయనకు పుట్టినరోజు సందర్బంగా సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు, మహేష్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో చిన్నోడికి పెద్దోడు శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన ట్వీట్ అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.
చిన్నోడికి పెద్దోడి స్పెషల్ విషెస్..
మహేష్ బాబు పుట్టినరోజు సందర్బంగా సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో వెంకీ మామ స్పెషల్ విషెస్ తెలిపారు. ప్రియమైన మహేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజుతో నీకు 50 ఏళ్లు నిండాయి. కానీ నువ్వు నాకు ఎప్పటికీ చిన్నోడివే.. నువ్వు ఎప్పటికీ ఇలాగే నవ్వుతూ ఉండాలి. ఎన్నో హృదయాలను వెలిగిస్తున్నావు. నీలాంటి మంచి వ్యక్తి లేరు. నీ నవ్వు చిరకాలం ఉండాలి. నేను కూడా మిమ్మల్ని SSMB29 లో చూసేందుకు వెయిట్ చేస్తున్నానని ట్వీట్ లో రాసుకొచ్చారు. అంతేకాదు వీరిద్దరూ కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులోని ఫోటోను షేర్ చేశారు.. ప్రస్తుతం ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.. ఈ ట్వీట్ ని చూసిన మహేష్ అభిమానులు వెంకీ మామ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Happy birthday dearest @urstrulyMahesh! Today you turn 50 but you’ll forever be my Chinnodu 🤗❤️❤️
Your humor and kindness light up the hearts of so many… there’s truly no one like you. Keep smiling, special one. Can’t wait for the world to witness your magic in #SSMB29!✨ pic.twitter.com/r228b8qbnU
— Venkatesh Daggubati (@VenkyMama) August 9, 2025
Also Read : బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న డబ్బింగ్ మూవీ.. ఎన్ని కోట్లంటే..?
మహేష్ బాబు సినీ కెరీర్..
టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు మహేష్ బాబు. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసాడు. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం ఆయన ఒక వైపు సినిమాలు.. మరోవైపు వాణిజ్య ప్రకటనలతో బిజీగా ఉంటున్నాడు. అంతేకాదు సమాజాసేవ కూడా చేస్తున్నాడు..మహేష్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది చిన్నారుల హృదయాలను కాపాడుతూ ప్రేక్షకుల మనసులో రియల్ హీరో అయ్యాడు.. ఇప్పటివరకు కొన్ని వేలకు పైగా గుండె ఆఫరేషన్లు చేయించారు.. ఇది మామూలు విషయం కాదు.. ఇకపోతే ప్రస్తుతం ఈయన దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తన 29వ సినిమాని చేస్తున్నారు.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చిలో థియేటర్లలోకి రాబోతుంది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి అప్డేట్ వచ్చే అవకాశం ఉందని సమాచారం..
వెంకీ మామ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం త్రివిక్రమ్ తో ఓ సినిమా చేస్తున్నాడు.. దీని తర్వాత మరో భారీ ప్రాజెక్టులో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..