BigTV English

Mahesh Babu : ఈయన ఏడాది ఆదాయంతో ఓ భారీ పాన్ ఇండియా మూవీ తీయొచ్చని మీకు తెలుసా?

Mahesh Babu : ఈయన ఏడాది ఆదాయంతో ఓ భారీ పాన్ ఇండియా మూవీ తీయొచ్చని మీకు తెలుసా?

Mahesh Babu: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న మహేష్ బాబు.. ఈరోజు 50వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, అభిమానులు ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే ఈ సందర్భంగా మహేష్ బాబుకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే మహేష్ బాబు ఏడాది సంపాదనతో ఒక పాన్ ఇండియా మూవీ తీయొచ్చు అని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆయన ఆదాయం ఎంత అనే విషయం ఇప్పుడు చూద్దాం.


మహేష్ ఏడాది సంపాదన ఎంతంటే?

మహేష్ బాబు చాలా సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ముఖ్యంగా సినిమాలు, బ్రాండ్ ఎండార్స్మెంట్ లతోపాటు హాస్పిటల్, మల్టీప్లెక్స్, థియేటర్స్, రియల్ ఎస్టేట్ రంగాలలో భారీగా పెట్టుబడులు పెట్టారు. ఇలా మహేష్ వార్షిక ఆదాయం సుమారుగా రూ.200కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఈయన ఏడాది సంపాదనతో ఒక పాన్ ఇండియా మూవీ తీయొచ్చని తెలిసి అందరూ నోరెళ్ళ పెడుతున్నారు.


మహేష్ బాబు ఒక్క యాడ్ సంపాదన ఎంతంటే?

మహేష్ బాబు ఎన్నో ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పలు బ్రాండ్ ఎండార్స్మెంట్లలో కనిపిస్తున్న మహేష్ బాబు కూల్డ్రింక్స్, సోప్స్, కిచెన్ ప్రొడక్ట్స్, యాప్స్ , రియల్ ఎస్టేట్ ఇలా అన్ని రకాల యాడ్స్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కమర్షియల్ రేంజ్ ను బట్టి మహేష్ బాబు రెమ్యూనరేషన్ తీసుకుంటారంట. యాడ్ వాల్యూ ఎక్కువైతే సెకండ్ కి కోటి రూపాయలు తీసుకునే అవకాశం కూడా ఉందని సమాచారం. మొన్నా మధ్య ఫోన్ పే యాడ్ కోసం ఐదు సెకండ్ల యాడ్ కి ఏకంగా 5 కోట్ల రూపాయలు తీసుకున్నారు. మౌంటెన్ డ్యూ యాడ్ కోసం ఏకంగా రూ.12 కోట్లు తీసుకున్న మహేష్ బాబు.. చిన్న యాడ్ అలాగే యాడ్ డ్యూరేషన్ బట్టి కూడా అమౌంట్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఎక్కువగా రూ.5నుంచి రూ.10కోట్ల వరకు ఒక్క యాడ్ కి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట మహేష్ బాబు.

యాడ్స్ కారణంగా చిక్కుల్లో పడ్డ మహేష్ బాబు.

ఇదిలా ఉండగా ఈ యాడ్స్ కారణంగా మహేష్ బాబు చిక్కుల్లో పడ్డ విషయం తెలిసిందే. సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ కి సంబంధించిన కేసులో మహేష్ బాబు ఇరుక్కున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కంపెనీలను ఆయన ప్రమోట్ చేశారు. బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడంతో మహేష్ బాబుకు ఎంత పారితోషకం లభించింది అనే కోణంలో ఈడీ అధికారులు మహేష్ బాబుకు సమన్లు జారీ చేశారు. ఈ యాడ్ చేసినందుకు మహేష్ కి సుమారుగా 6 కోట్ల పారితోషకం లభించింది. అందులో 3.5 కోట్లు నగదు రూపంలో మిగిలిన అమౌంట్ ను చెక్ రూపంలో తీసుకున్నారు. ఈ కేసులో మహేష్ బాబు విచారణ కూడా ఎదుర్కొన్నారు.

ALSO READ:Samantha – Naga Chaitanya :నాగచైతన్యకి రాఖీ కట్టిన సమంత.. మండిపడుతున్న ఫ్యాన్స్!

Related News

War 2 Pre Release Event : ఇప్పుడు అసలైన వార్… ఈ ఒక్క దాంతో కూలీని దాటేసింది

NTR: కాళ్ళ మీద పడ్డ అభిమాని.. ఎన్టీఆర్ ఏం చేసాడంటే

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

War 2 Pre release: అభిమానులపై కోప్పడిన తారక్.. ఇక్కడి నుంచి వెళ్లిపోనా అంటూ!

War 2 Pre release: నన్ను ఎవరూ ఆపలేరు.. పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చిన తారక్!

War 2 Pre release: తారక్ మీకు అన్న… నాకు తమ్ముడు.. స్పీచ్ అదరగొట్టిన హృతిక్!

Big Stories

×