E-Paper
Advertisement

కిమ్స్ హాస్పిటల్ లో జూ.ఎన్టీఆర్ కి శస్త్ర చికిత్స!

కిమ్స్ హాస్పిటల్ లో జూ.ఎన్టీఆర్ కి శస్త్ర చికిత్స!
Advertisement

Jr NTR: మొన్న బాలకృష్ణ (Balakrishna), నిన్న రామ్ చరణ్ (Ram Charan), నేడు ఎన్టీఆర్ (NTR ) ఇలా సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు సినిమా షూటింగ్లలో గాయపడడం గాయం తాలూకా నొప్పిని భరించలేక సర్జరీలు చేయించుకోవడం.. అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. సినీ ప్రియులను అలరించడానికి సెలబ్రిటీలు పడుతున్న కష్టం వర్ణనాతీతం. ముఖ్యంగా తమ నటనతో ప్రేక్షకులను మెప్పించడానికి ప్రాణాలను సైతం ఫణంగా పెడుతూ సెలబ్రిటీలు చేస్తున్న సాహసాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి

వైద్యుల సమక్షంలో ఎన్టీఆర్ భుజానికి సర్జరీ..

ఇకపోతే తాజాగా ఎన్టీఆర్ భుజానికి ఇటీవల గాయం అయింది అని, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకున్న ఆయన ఎనిమిది వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి ఒక ప్రకటన విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఆగస్టు 11వ తేదీన మరో ప్రకటన విడుదల చేసింది ఎన్టీఆర్ ఆఫీస్. సికింద్రాబాద్లోని కిమ్స్ హాస్పిటల్ లో ప్రముఖ వైద్య బృందం సమక్షంలో ఎన్టీఆర్ భుజానికి శస్త్ర చికిత్స ఆగస్టు 12వ తేదీన జరగనున్నట్లు ప్రకటించింది. అయితే ఇప్పుడు ఆయనకు స్పెషల్ వైద్య బృందం సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో సర్జరీ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. విషయం తెలుసుకున్న నందమూరి అభిమానులు, సినీ ప్రియులు ఎన్టీఆర్ భుజానికి శస్త్ర చికిత్స సక్సెస్ అవ్వాలి అని, ఆయన త్వరగా వేగంగా రికవరీ అవ్వాలని కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ సర్జరీ తర్వాత కిమ్స్ హాస్పిటల్ వైద్య బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిపై బులిటెన్ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

also read:హిందీలో స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్న మా ఇంటి బంగారం.. ఎప్పుడంటే?

విశ్రాంతి తప్పనిసరి..

ఎన్టీఆర్ ప్రస్తుతం సర్జరీ చేయించుకుంటున్న నేపథ్యంలో ఆయనకు విశ్రాంతి అనివార్యం అన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆరు నుండి 8 వారాల వరకు ఎన్టీఆర్ విశ్రాంతి తీసుకోబోతున్నారు. ఇక ఆ తర్వాతే ఆయన తన సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు సమాచారం.

మరింత ఆలస్యం కానున్న డ్రాగన్..

Advertisement

కే జి ఎఫ్, సలార్ చిత్రాలతో సంచలనం సృష్టించిన ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీళ్ (Prashanth Neel) దర్శకత్వంలో ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా చేస్తున్నారు. ప్రముఖ హీరోయిన్ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇంకా కొంత భాగం మిగిలి ఉంది. పైగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ భుజానికి శస్త్ర చికిత్స జరుగుతోంది కాబట్టి మళ్ళీ ఎన్టీఆర్ షూటింగ్లో పాల్గొనడానికి సమయం పడుతుంది.. అందుకే ఈ సినిమా మళ్లీ వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.. ఏది ఏమైనా డ్రాగన్ సినిమా రోజురోజుకి ఆలస్యం అవుతుండడంతో అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేసినా.. ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Related News

అగ్నివీర్ గా టాలీవుడ్ విలన్ కూతురు!

మల్టీస్టారర్ కు వెంకీ మామ సిద్ధం.. డైరెక్టర్ ప్లానింగ్ ఇదా..?

యంగ్ హీరోతో నాగదుర్గ ప్రత్యేక పూజలు.. ప్రేమలో పడ్డారా?

“ఆయన నక్క.. నేను కుక్కను” నసీర్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు

డ్రామాలొద్దంటున్న త్రిష.. ఎవరిని ఉద్దేశించిందో తెలుసా?

50కి దగ్గరైనా తగ్గేదేలే.. సురేఖ వాణి జిమ్ వీడియో వైరల్!

మళ్లీ నోరుజారిన చిరు.. ‘మెగా 158’ టైటిల్ లీక్ చేసి.. ఇదే ఆ టైటిల్

Big Stories

Advertisement
×