E-Paper
Advertisement

సూర్యగ్రహణానికి, ఆ గ్రామానికి సంబంధం ఏమిటి? అక్కడ ఉండేది 10 మంది మాత్రమే!

సూర్యగ్రహణానికి, ఆ గ్రామానికి సంబంధం ఏమిటి? అక్కడ ఉండేది 10 మంది మాత్రమే!
Advertisement

Solar Eclipse: ప్రపంచవ్యాప్తంగా సంపూర్ణ సూర్యగ్రహణం బుధవారం కనిపించనుంది. ఆసియా దేశాల్లో తక్కువ ప్రభావం ఉంటుంది. యూరప్‌లో ఈ గ్రహణం ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఇంతవరకు ఓకే.. సూర్యగ్రహణానికి-ఆ గ్రామానికి ఉన్న సంబంధం ఏమిటి? ఆ ప్రాంత జనాభా కేవలం 10 మంది మాత్రమే. కానీ ఎందుకు ప్రసిద్ధి చెందింది? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా సంపూర్ణ సూర్యగ్రహణం

ఆగస్టు 12న అంటే బుధవారం రాత్రి సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించనుంది. దాని ప్రభావం ఇండియాపై అస్సలు ఉండదని పండితులు చెబుతున్నారు. యూరప్ మాటేంటి? గ్రీన్‌ల్యాండ్, ఐస్‌లాండ్, ఉత్తర అట్లాంటిక్, స్పెయిన్ తోపాటు పలు దేశాల్లో సూర్యగ్రహణం కనిపిస్తుంది. గ్రహణం సయమంలో చాలామంది విమానాల్లో నుంచి చూసేందుకు ప్రయాణికులు రెడీ అవుతున్నారు. ఖగోళ ఘట్టానికి సూర్యగ్రహణం సాక్ష్యంగా నిలవనుంది.

స్పెయిన్‌లో మారుమూల గ్రామం

Advertisement

ఈ అద్భుతమైన దృశ్యాన్ని స్పెయిన్‌లోని బుర్గోస్ ప్రావిన్స్‌లో ఉన్న అవెల్లెనోసా డి మున్యో గ్రామం కనెక్టు అయ్యింది. ఎందుకంటే ఆ గ్రామంలో సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించవచ్చు. దీంతో గ్రామానికి టూరిస్టుల తాకిడి మొదలైంది. ఒక రోజు పర్యటనకు అక్కడికి పర్యాటకులు చేరుకుంటున్నారు. గ్రహణం పూర్తి దశలో సరిగ్గా అక్కడే కనిపించడంతో ఈ గ్రామం ప్రసిద్ధి కెక్కింది. గ్రహణం సంభవించే సమయంలో ఆ ప్రదేశం అసాధారణంగా ఉంటుందని చెబుతున్నారు. సంపూర్ణ గ్రహణం ప్రారంభమయ్యే సమయానికి సూర్యుడు ఆ ప్రాంతంలో తక్కువ ఎత్తులో ఉంటాడని చెబుతున్నారు.

పగలు-రాత్రివేళ రెండుసార్లు సూర్యగ్రహణం

స్పెయిన్‌లో సూర్యగ్రహణం పగటి-రాత్రి వేళ కూడా రెండుసార్లు చూసే అవకాశం వచ్చింది. దీనికితోడు సూర్యాస్తమయం తర్వాత పెర్సిడ్ ఉల్కాపాతం ఆకాశం వైపు చూడటానికి మరో కారణంగా చెబుతున్నారు. ఆ స్పానిష్ గ్రామం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. స్పెయిన్‌లోని అవెల్లెనోసా డి మున్యో గ్రామం జనాభా ఎంతో తెలుసా? శాశ్వత నివాసితుల సంఖ్య సుమారు 10 మంది మాత్రమే. 1937లో ఈ ప్రాంతంలో జన్మించారు కొందరు. ఆ విధంగా 1950 నాటికి ఆ గ్రామంలో సుమారు 200 మంది ప్రజలు నివాసం ఉండేవారు.

ఆ గ్రామ జనాభా కేవలం 10 మంది మాత్రమే

Advertisement

ఆ గ్రామస్తుల జీవనోపాధి వ్యవసాయం, తోటపని, పశుపోషణపై ఆధారపడేవారు. వ్యవసాయంలో యాంత్రీకరణ, పరిమిత ఉపాధి అవకాశాల కారణంగా అక్కడి ప్రజలు మాడ్రిడ్, బిల్బావో, బార్సిలోనా వంటి పెద్ద నగరాలకు వలసపోయారు. ప్రస్తుతానికి ఆ గ్రామ జనాభా కేవలం 10 మంది మాత్రమే. సూర్యగ్రహణం నేపథ్యంలో ఆ గ్రామానికి చెందినవారు పెద్దలు, పిల్లలు, ఫ్రెండ్స్ అంతా తిరిగి వచ్చారు. సూర్యగ్రహణం నేపథ్యంలో ఆ గ్రామం చుట్టూ ఉన్న హోటళ్లు బుక్ అయిపోయాయి. గ్రహణం కారణంగా ఈ చిన్న గ్రామం మళ్లీ సందడిగా మారింది.

ALSO READ: విమానం ఎక్కి అదృశ్యమైన ట్రంప్.. హాలీవుడ్ రేంజ్‌ ఆపరేషన్

Related News

ఖమేనీ అంతం తర్వాత కూడా లొంగని ఇరాన్.. ట్రంప్ వేసిన ప్లాన్ ఎక్కడ తప్పింది?

వరద గుప్పిట్లో బ్యాంకాక్ సిటీ.. 48 గంటల్లో 300 మి.మీ. వర్షం, విమానాల గురించి..

రాతి యుగానికి చెందిన ప్రజలు.. చెట్లపై వారి జీవితం, భూమికి 20 మీటర్లు ఎత్తులో, ఎక్కడో తెలుసా?

నేపాల్‌కు పొంచివున్న ముప్పు.. హిమాల్ శిఖరంపై భారీ హిమపాతం, 10 మంది మిస్సింగ్

లాడెన్ ఎక్కడ దొరికాడో మర్చిపోయావా? ఐరాసలో పాక్ ప్రధానికి ఇచ్చిపడేసిన భారత్!

DR కాంగోలో ఘోర ప్రమాదం.. ఆర్మీ విమానం ధ్వంసం… 14 మంది సజీవ దహనం!

ఇరాన్‌కు బిగ్ షాక్.. ‘సీజ్‌ఫైర్’ రిక్వెస్ట్‌కు ట్రంప్ నో.. భారీ అటాక్‌కు స్కెచ్!

ఐరాస వేదికగా పాక్ పరువు తీసిన జైశంకర్.. ఆ దేశ విలేకరి ప్రశ్నకు దిమ్మతిరిగే కౌంటర్!

Big Stories

Advertisement
×