Maa inti Bangaram OTT: పాన్ ఇండియా ట్రెండ్ పెరిగిపోయిన తర్వాత ప్రాంతీయంగా విడుదలయ్యే ప్రతి సినిమా ఇప్పుడు దాదాపు పాన్ ఇండియా భాషలలో విడుదలవుతూ అన్ని భాష ప్రేక్షకులను అలరిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఓటీటీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. థియేటర్లలో సినిమాను మిస్ అయిన వారికి ఇటు ఓటీటీలలో పైగా అన్ని భాషలలో సినిమా చూసే అవకాశం లభిస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక సినిమా హిందీ స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది. అదేదో కాదు సమంత వందకోట్ల మూవీ మా ఇంటి బంగారం.
ప్రముఖ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్ర పోషిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మా ఇంటి బంగారం. ఈ సినిమా సుమారుగా రూ.100 కోట్లకు పైగా వసూళ్ల సాధించి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో ఇప్పటివరకు వచ్చిన లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది కూడా.. ఇకపోతే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. ఇప్పటికే తెలుగు భాషలో ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్ జియో హాట్ స్టార్ వేదికగా.. ఈ సినిమా తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు హిందీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యింది మా ఇంటి బంగారం.
తెలుగు ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను జియో హాట్ స్టార్ సొంతం చేసుకోగా.. హిందీ వర్షన్ డిజిటల్ హక్కులను సోనీ లివ్ సంస్థ సొంతం చేసుకుంది. ఇందులో భాగంగానే త్వరలోనే ఈ చిత్రాన్ని తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోనీ లివ్ అధికారికంగా ప్రకటించింది. ఇక తెలుగులో భారీ కలెక్షన్స్ తో అటు మంచి వ్యూస్ తో దూసుకుపోతున్న ఈ సినిమా.. హిందీ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.
also read:అగ్నివీర్ గా టాలీవుడ్ విలన్ కూతురు!
నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. గుల్షన్ దేవయ్య, గౌతమి, దిగంత్ మంచాలే, శ్రీముఖి తదితరులు కీలకపాత్రలు పోషించారు. సమంత సొంత నిర్మాణ సంస్థ అయిన ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై సమంత, రాజ్ నిడిమోరు , హిమాంక్ దువ్వూరు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.
సమంత విషయానికొస్తే.. ఒకవైపు సినిమాలతో దూసుకుపోతున్న ఈమె.. ఇటీవల తన వ్యక్తిగత జీవితంలో కూడా వరుస శుభవార్తలను అభిమానులతో పంచుకుంటోంది. నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ తో ఏడడుగులు వేసిన ఈమె ఇటీవల ప్రెగ్నెంట్ అంటూ ఆ శుభ వార్తను అభిమానులతో పంచుకుంది కూడా. ఇక తాజాగా తన సినిమా 100 కోట్ల క్లబ్లో చేరడంతో పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న సమంత ప్రస్తుతం మెటర్నిటీ లీవ్ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే అటు తమిళంలో ప్రముఖ ఓటీటీ సంస్థకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ఇకపోతే తాను తన జీవితంలో అమ్మ అనే పిలుపు కోసం ఎదురుచూస్తున్నానని , అందుకోసం కొంతకాలం విశ్రాంతి కూడా తీసుకోబోతున్నానని తెలిపింది. ఇక డిసెంబర్లో సమంత డెలివరీ కాబోతున్నట్లు సమాచారం.
Sanskaar wohi, Action wohi, Bangaaram wohi. Bas ab apne ghar, apni bhasha mein! ❤️🔥
Maa Inti Bangaaram. Coming Soon in Hindi on Sony LIV. pic.twitter.com/hhQwn34SnF
— Sony LIV (@SonyLIV) August 11, 2026