NTR Health: తారక్ కి గత కొన్ని రోజుల కిందట భుజానికి గాయం అయిన సంగతి తెల్సిందే. ఇక వెంటనే సికింద్రాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్‌లో చేరిన తారక్ కి డాక్టర్స్ ఆర్తోస్కోపిక్ సర్జరీ చేసి ప్రస్తుతం తారక్ పూర్తిగా సేఫ్ ఉన్నాడని డాక్టర్స్ చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇక కిమ్స్‌లో జరిగిన ఈ శస్త్రచికిత్సను ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం నిర్వహించింది. డాక్టర్ ఆర్.ఎ. పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెజ్జంకి, డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ శ్రీనివాస్ రావు సూరపనేని కలిసి ఆపరేషన్ పూర్తి చేశారు.
మొత్తం ప్రొసీజర్ సక్సెస్ అయిందని, ఎలాంటి కాంప్లికేషన్స్ లేవని స్పష్టం చేశారు వైద్యులు. ఇక ఆగస్టు 12న విడుదల చేసిన అధికారిక మెడికల్ బులెటిన్‌లో కిమ్స్ హాస్పిటల్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ సంబిత్ సాహు ఈ విషయం పై క్లారిటీ ఇచ్చారు.
ఇక ప్రస్తుతం తారక్ కొద్ది రోజులు పూర్తిగా బెడ్ కే పరిమితం అయ్యి విశ్రాంతి తీసుకుంటారని ఆ తర్వాత ఫిజియోథెరపీ, ప్రత్యేక వ్యాయామాలతో తిరిగి మునుపటిలా రికవరీ అవుతాడని సమాచారం.డాక్టర్ల లెక్క ప్రకారం మరో రెండు నుంచి మూడు నెలల్లో ఆయన మళ్లీ పాత ఫిట్‌నెస్‌తో తిరిగి వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.
ఇక సినిమాల సంగతి చెప్పాలంటే.. తారక్ చేతిలో ఇప్పుడు నీల్ తో చేస్తున్న డ్రాగన్ సినిమా ఉన్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఇక ఈ సినిమాని వచ్చే ఏడు జూన్ 11న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు కూడా.
ఇక దీని తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో గాడ్ ఆఫ్ వార్ సినిమా పట్టాలెక్కబోతుందని తాజాగా వదిలిన గ్లిమ్ప్స్ ని బట్టే అర్థమవుతుంది.ఇలా వరుసగా రెండు ప్యాన్ ఇండియా సినిమాలు లైనప్ లో ఉండటంతో రిస్క్ చేయకుండా షూటింగ్ కంటే ముందు హెల్త్‌కే ఫస్ట్ ప్రాధాన్యం ఇవ్వాలని టీమ్ కూడా నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.
also read :‘వారణాసి’లో ఇలాంటి సీన్ ఉందా?.. వీడియో చూస్తే షాకే!
ఇక సోషల్ మీడియాలో అయితే #GetWellSoonNTR ట్రెండ్ అవుతోంది. “అన్నా.. ముందు నువ్వు బాగుండాలి, సినిమా తర్వాత కూడా వస్తుంది” అంటూ పోస్టులు పెడుతున్నారు తారక్ ఫ్యాన్స్.మొత్తంగా తారక్ ఆరోగ్యం బాగానే ఉందన్న వార్త బయటకు రావడంతో ఫ్యాన్స్ లో అయితే టెన్షన్ తగ్గినట్టే కనిపిస్తుంది.ఏది ఏమైనా టాలీవుడ్ లో ఇపుడు వరుస సర్జరీలు జరగడం హాట్ టాపిక్ గా మారిపోయింది.