E-Paper
Advertisement

‘వారణాసి’లో ఇలాంటి సీన్ ఉందా?.. వీడియో చూస్తే షాకే!

‘వారణాసి’లో ఇలాంటి సీన్ ఉందా?.. వీడియో చూస్తే షాకే!
Advertisement

Varanasi :మందాకినికి ఏం జరుగుతుందో అర్థమవట్లేదు. చుట్టూ అంతా గందరగోళం, భారీ సంఖ్యలో బుల్స్ స్పీడ్ గా తనవైపే వస్తున్నట్టుగా ఉన్నాయి.చేతిలో ఎర్రటి,పొడవైన జెండా. మహేష్ కి సిగ్నల్ ఇస్తూ ఊపుతూ ఉంది.దాన్ని బైనాక్యులర్ లో చూసిన రుద్ర గుర్రంపై దూసుకొచ్చి ఆమెను కాపాడతాడు.ఈ సీన్ చూస్తే నిజంగానే గూస్‌బంప్స్ రావాల్సిందే. వీడియోలో రుద్ర లుక్, గుర్రం పరుగులు, యాక్షన్ సీన్స్ అన్నీ చూస్తుంటే అచ్చం సినిమాలోని షాట్‌లానే అనిపిస్తోందా .అచ్చం అలాగే ఉంది మరి.ఇక ఈ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

ఇది ‘వారణాసి’ నుంచి లీకైన వీడియో కాదు!

అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇది ‘వారణాసి’ సినిమా నుంచి లీకైన వీడియో కాదు.నిజానికి రాజమౌళి సినిమా రిలీజ్ అయ్యే వరకు కథకు సంబంధించిన విషయాలు బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. అధికారికంగా పెద్దగా అప్‌డేట్స్ కూడా ఇవ్వడం లేదు.

Advertisement

దీంతో ఫ్యాన్స్ తమ ఊహలకు పని చెప్పేస్తున్నారు.సినిమాలో రుద్ర ఎలా ఉంటాడు? మందాకినితో అతని ప్రయాణం ఎలా సాగుతుంది? ఎలాంటి యాక్షన్ సీన్స్ ఉంటాయి? అంటూ తమకు నచ్చినట్టుగా వీడియోలు తయారు చేస్తున్నారు.

అచ్చం లీకైన ఫుటేజ్‌లానే కనిపిస్తోంది!

అందులో భాగంగానే ఈ వీడియో కూడా బయటకు వచ్చింది.కాకపోతే దీన్ని చూస్తే మాత్రం ఇది ఫ్యాన్ మేడ్ వీడియో అని అస్సలు అనిపించదు. ఏదో సినిమా నుంచి లీకైన ఫుటేజ్‌లా కనిపిస్తోంది.ముఖ్యంగా రుద్ర గుర్రంపై దూసుకెళ్లే సీన్ చాలా సహజంగా ఉండటంతో చాలామంది నిజంగానే ఇది ‘వారణాసి’ నుంచి లీకైందని అనుకున్నారు.

అసలు విషయం ఏంటంటే.. ఇది AI వీడియో!

Advertisement

కానీ ఇది AIతో తయారు చేసిన ఫ్యాన్ మేడ్ వీడియో.ఇప్పుడు AI టెక్నాలజీ ఏ రేంజ్‌కు వెళ్లిపోయిందో చెప్పడానికి ఈ ఒక్క వీడియో చాలు.ఒకప్పుడు ఫ్యాన్స్ సినిమాల కోసం పోస్టర్లు, ఫొటోలు మాత్రమే తయారు చేసేవారు. ఇప్పుడు ఏకంగా సినిమాలోని సీన్‌లా కనిపించే వీడియోలను కూడా తయారు చేస్తున్నారు.

అందుకే అసలు సినిమా నుంచి వచ్చిన కంటెంట్ ఏది? ఫ్యాన్స్ తయారు చేసిన వీడియో ఏది? అనేది గుర్తించడం కూడా చాలా కష్టం.ఇక ఇప్పటికే మహేష్ రాముడిగా AIతో చేసిన విజువల్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతున్నాయి కూడా.

‘వారణాసి’పై భారీ అంచనాలు

ఇక ‘వారణాసి’ విషయానికి వస్తే.. సూపర్‌స్టార్ మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా జోనస్ కాంబినేషన్‌లో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.టైమ్ ట్రావెల్, అడ్వెంచర్, యాక్షన్, పురాణ అంశాలు కలిసిన కథగా ఈ సినిమాపై ప్రచారం జరుగుతోంది.

మహేశ్ బాబు ఇందులో రుద్ర పాత్రలో కనిపించనున్నాడనే విషయం బయటకు వచ్చినప్పటి నుంచి ఫ్యాన్స్‌లో ఆసక్తి మరింత పెరిగింది.

రాజమౌళి విజువల్స్‌పై మరో రేంజ్‌లో హైప్

‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలతో రాజమౌళి విజువల్స్ విషయంలో ఏ రేంజ్ చూపించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇప్పుడు ‘వారణాసి’లో అంతకు మించి చూపించాబోతున్నాడనే ప్రచారం జరుగుతుంది.అందుకే సినిమా నుంచి చిన్న అప్‌డేట్ వచ్చినా సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది.

జక్కన్న అప్‌డేట్స్ ఇవ్వకపోతే ఫ్యాన్స్ ఊరుకుంటారా?

అయితే సినిమా నుండి జక్కన్న ఎలాంటి అప్ డేట్స్ వదల్లెకపోవడంతో మీము ఆగలేమంటూ అభిమానులే రుద్ర, మందాకిని పాత్రలకు AI లో ఇలా ప్రాణం పోసేస్తున్నారు.కొందరు రుద్ర యాక్షన్ సీన్స్ చేస్తుంటే.. మరికొందరు రుద్ర, మందాకిని మధ్య సన్నివేశాలను ఊహించి ఏకంగా వీడియోలే తీసేస్తున్నారు.

ఫ్యాన్ మేడ్ వీడియోకే ఇంత రెస్పాన్స్!

ఈ వీడియోలో కూడా రుద్ర మందాకినిని కాపాడే విధానం చూస్తే.. ‘ఇలాంటి సీన్ సినిమాలో ఉంటే థియేటర్‌లో మామూలు రచ్చ ఉండదు’ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.మరికొందరైతే ‘ఫ్యాన్ మేడ్ వీడియోనే ఇంత బాగుంటే.. జక్కన్న అసలు విజువల్స్ ఎలా ఉంటాయో?’ అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

జక్కన్న ఆ హైప్‌ను ఎలా రీచ్ చేస్తాడో!

ఏది ఏమైనా ‘వారణాసి’ నుంచి అధికారిక అప్‌డేట్స్ రాకపోయినా.. ఫ్యాన్స్ మాత్రం తమ క్రియేటివిటీతో సినిమాపై హైప్‌ను పెంచేస్తున్నారు.చూడాలి మరి జక్కన్న ఆ హైప్ ని ఎలా రీచ్ అవుతాడో !

Tags

Related News

చిన్న సినిమాలను తొక్కిపెడితే ఊరుకోం: హీరో షిరాజ్ మెహదీ ఆగ్రహం..

గంగా హాస్పిటల్ డాక్టర్స్ కు రామ్ చరణ్ కృతజ్ఞతలు..!

150 ఏళ్ల నాటి నిజ జీవిత కథ..రణబాలి ఫస్ట్ సిరీస్ డాక్యుమెంటరీ రిలీజ్!

వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు..బలవంతపు ప్రేమ అక్కర్లేదు.. రాశి ఖన్నా

పెళ్లి పై ఓపెన్ అయిన అంజలి..అంత ఆత్రుత ఎందుకో అంటూ?

కంప్లైంట్ చేసింది భక్తిపై కాదు.. అల్లు శిరీష్ పోస్ట్ వైరల్!

అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి.. అడుక్కోవడానికి కాదు..మదర్ సెంటిమెంట్ తో ‘స్లమ్ డాగ్ ‘ గ్లింప్స్!

రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. బయటపడ్డ నమ్మలేని నిజాలు!

Big Stories

Advertisement
×