E-Paper
Advertisement

సిరిసిల్లలో పడిపోతున్న గ్రాఫ్.. అలర్ట్ అయిన కేటీఆర్!

సిరిసిల్లలో పడిపోతున్న గ్రాఫ్.. అలర్ట్ అయిన కేటీఆర్!
Advertisement

KTR: ఇంట గెలిచి ర‌చ్చ గెల‌వాల‌నే సామెత‌ను ఫాలో అవుతున్నారు కేటీఆర్‌. సిరిసిల్లాలో త‌న ప‌ట్టు కోల్పోతున్నార‌నే ప్రచారం నేప‌థ్యంలో, ప్రతిప‌క్షాలు ఆ వేదిక‌గా చేస్తున్న విమ‌ర్శల దాడి క్రమంలో ఆయ‌న న‌జ‌ర్ ఇప్పుడు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంపై ప‌డింది. అక్కడి జ‌నంతో మమేకమ‌య్యేందుకు ఆయ‌న కొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.

కంటి పరీక్షలు నిర్వహించిన కేటీఆర్..

Advertisement

కేసీఆర్ పాల‌న‌లో ఉన్న కంటి వెలుగు ప‌థ‌కాన్ని కాంగ్రెస్ స‌ర్కార్ ఎత్తేసింది. త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని వీర‌న్నప‌ల్లిలో ఎమ్మెల్యే కేటీఆర్‌ ఇవాళ ప్రారంభించారాయ‌న‌. అక్కడి ప్రజ‌ల‌కు కంటి ప‌రీక్షలు నిర్వహించి.. అవ‌స‌ర‌మైన వారికి కంటి అద్దాలు అందించారు. 171 మందికి ఆప‌రేష‌న్లు చేస్తామ‌ని ప్రక‌టించారు. త్వర‌లో ఈ పథ‌కాన్ని జిల్లా మొత్తంగా విస్తరిస్తామ‌ని కేటీఆర్ ఆ వేదిక‌గా హామీ ఇచ్చారు.

కేటీఆర్ టార్గెటె‌గా కవిత కామెంట్స్

Advertisement

క‌విత రెండు సార్లు సిరిసిల్లా నుంచి కేటీఆర్ టార్గెటెడ్‌గా కామెంట్స్ చేశారు. ఆయ‌న‌ను టూరిస్ట్ ఎమ్మెల్యే అని విమ‌ర్శించారు. ఇక్కడికి రావ‌డ‌మే లేద‌ని, ప్రజ‌ల స‌మ‌స్యలు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని విమ‌ర్శల అస్త్రాలు ఎక్కు పెట్టారు. మొన్న నేరెళ్ల బాధితుల‌కు వ‌ద్దకు వెళ్లి.. ద‌ళితుల‌పై పాశ‌విక దాడికి కేటీఆరే బాధ్యుడ‌ని ఆరోపించారామె. పోలీసుల‌పై చ‌ర్యలు తీసుకోలేద‌ని, కేటీఆర్‌కు ధ‌నార్జనే ముఖ్యమ‌ని, ప్రజ‌ల ప్రాణాల‌తో ప‌నిలేద‌ని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కేటీఆర్‌కు సిరిసిల్లలో మెజారిటీ త‌గ్గుతూ..

కేటీఆర్‌కు సిరిసిల్లలో మెజారిటీ త‌గ్గుతూ వ‌స్తోంది. గ‌తంతో పోలిస్తే దాదాపు 60 వేల మెజారిటీ త‌గ్గిందాయ‌న‌కు. 2018లో 89వేల ఓట్ల మెజారిటీ రాగా, 2023లో 29, 687 మెజారిటీతో స‌రిపెట్టుకున్నారు. ఇప్పుడు క‌విత కూడా ప్రత్యర్థిగా వ‌ర్గంగా మార‌డం.. త‌న‌నే టార్గెట్ చేసి అక్కడికి వెళ్లి మ‌రీ విమ‌ర్శలు చేయ‌డంతో సిరిసిల్లాలో గెలుపు న‌ల్లేరు మీద న‌డ‌క అనుకోవ‌ద్దని డిసైడ్ అయ్యారు కేటీఆర్‌. అందుకే ఇప్పటి నుంచి ఇల్లు చ‌క్కబెట్టుకునే చ‌ర్యల‌కు పూనుకున్నట్టు తెలుస్తోంది.

Also Read: కొంపల్లిలో పేకాట స్థావరంపై SOT దాడి.. మాజీ చైర్మన్‌తో సహా 8 మంది అరెస్ట్!

Tags

Related News

క్షుద్ర రాజకీయాలిక్కడ.. చేతబడుల దాడులు అక్కడ..! రాజకీయాల కోసం నేతలే మూఢనమ్మకాలను పట్టుకు వేలాడుతుంటే..

రాముడి యుగం నాటి దివ్య వృక్షం.. విజయవాడలో ప్రత్యక్షం!

ఎమ్మెల్యేలను నెత్తినపెట్టుకుని పెద్ద తప్పు చేశాం..! కేసీఆర్ చేసిన పెద్ద పొరపాటిదే..! కేటీఆర్‌ కామెంట్స్‌ వెనుక మర్మమేమిటీ? పాతకాపులకిక చెక్?

ఆయన వేలు పెడితే నాకు టికెట్ ఖాయం.. కిషన్ రెడ్డి మద్దతు ఎవరికో తెలుసా?

ఆ శాఖలోకి మీడియాకు నో ఎంట్రీ.. తెరవెనుక ఏం జరుగుతోంది?

పెట్టుబడులను ఆకర్షించేందుకు లోకేశ్‌ డోలో గోలీ మంత్రం..! పప్పు అనే విమర్శల నుంచి చమత్కార ఛలోక్తులు విసిరే స్థాయికి..!

మెట్రో పిల్లర్ల కేసులో అసలు కథ ఇదేనా? బెయిల్ కోసం సెక్షన్లు తగ్గించేశారా?

కేంద్రం నిర్ణయాలతో ధరల సూచి హైక్.. ధరల మంటతో సామాన్యుడి విల విల!

Big Stories

Advertisement
×