BigTV English

Dhoom 4 : ‘ధూమ్ 4 ‘ టాలీవుడ్ స్టార్ హీరో?..బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే..!

Dhoom 4 : ‘ధూమ్ 4 ‘ టాలీవుడ్ స్టార్ హీరో?..బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే..!

Dhoom 4 : బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి తాజాగా వచ్చిన చిత్రం వార్ 2.. టాలీవుడ్ హీరో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమాలో నటించడంతో ఈ సినిమాపై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. థియేటర్లలోకి వచ్చిన తర్వాత సినిమా పెద్దగా ఆకట్టుకోలేదన్న టాక్ ను మూట కట్టుకుంది. అయితే ఇప్పుడు బాలీవుడ్ లో ధూమ్ 4 పై అనేక ప్రచారాలు వినిపిస్తున్నాయి.. ధూమ్ మూవీకి సీక్వెల్ గా వస్తున్న ప్రతి మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు ధూమ్ 4 పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. గతంలో వచ్చిన సీక్వెల్ సినిమాలన్నిట్లో బాలీవుడ్ హీరోలు నటించారు. ఇప్పుడు రాబోతున్న సీక్వెల్ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో కూడా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


బాలీవుడ్ సినిమాల్లో టాలీవుడ్ హీరోలు..

ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వరుస టాలీవుడ్ హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చేవాళ్లు.. అందులో కొంతమంది మాత్రం భారీ విజయాన్ని అందుకుంటే మరి కొంతమంది మాత్రం యావరేజ్ టాక్ ను సొంతం చేసుకొని మళ్లీ యూటర్న్ తీసుకొని తెలుగు సినిమాల్లో నటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. తెలుగులో వరుస హిట్ చిత్రాల్లో నటించి సత్తాను చాటుతున్న స్టార్ హీరోలు కూడా సైతం నార్త్ లో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు ఇప్పటికే హిందీలో సినిమాలు చేశారు. కానీ పెద్దగా సక్సెస్ అవ్వలేకపోయారు. ఇకముందు ఏ స్టార్ హీరో బాలీవుడ్ సినిమాల్లో ప్రత్యక్షమవుతాడు చూడాలి..


Also Read : బిగ్ బాస్ సీజన్ 9 లోకి ఐదుగురు కన్ఫామ్..?

ధూమ్ 4 లో తెలుగు హీరో.. 

దొంగతనాల మీద గతంలో వచ్చిన బాలీవుడ్ బ్లాక్ బాస్టర్ మూవీ ధూమ్.. జాన్ అబ్రహం విలనీ, అభిషేక్ బచ్చన్ పోలీస్ ఆఫీసర్ పాత్ర, ట్విస్టులు ఛేజులు అబ్బో ఓ హాలీవుడ్ మూవీ చూసిన రేంజ్ లో ఫీలయ్యారు.. అలాగే ధూమ్ 2 హృతిక్ రోషన్ నటించడంతో మరింత క్రేజ్ పెరిగింది. ధూమ్ 3కి మాత్రం షాక్ కొట్టింది. అమీర్ ఖాన్ డ్యూయల్ రోల్ చేసినా అంతగా మెప్పించలేక యావరేజయ్యింది… ధూమ్ 4 లో రణబీర్ కపూర్ దొంగగా నటించేందుకు ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వార్ 2 తీసిన అయాన్ ముఖర్జీకే ఈ బాధ్యతలు అప్పజెప్పాలని నిర్మాత ఆదిత్య చోప్రా అనుకున్నాడట.. అయితే ఇందులో పోలీసు పాత్రకు తెలుగు హీరోను సెలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. వార్ 2 ద్వారా బాలీవుడ్ లో మంచి టాక్ ని సొంతం చేసుకున్నా ఎన్టీఆర్ ఇందులో నటించే అవకాశాలున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయి. మరి దీనిపై పూర్తి వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.

Related News

Sridevi: అందుకే ఆ ఫీలింగ్ కలగలేదు – శ్రీదేవి కామెంట్స్!

DCM Pawan Kalyan : అధికార దుర్వినియోగం… పవన్ కళ్యాణ్‌పై హై కోర్టులో పిటిషన్

RajiniKanth – Kamal Haasan : గ్యాంగ్‌స్టార్స్‌గా రజనీ, కమల్… లోకీ మావా మెంటల్ మాస్ ప్లాన్ ఇది..

Nandamuri:నందమూరి ఇంట విషాదం… జయకృష్ణ భార్య కన్నుమూత

90’s A Middle Class: అవార్డుల పంట పండించిన శివాజీ 90’స్.. సంతోషంలో టీమ్!

Big Stories

×